Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఏడు సంవత్సరాల ముందే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు..!
వైద్య పరిశోధనల్లో ఆకాశాన్ని తాకి మరింత పైకి వెళ్తున్నాం. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఎంత ప్రాణాంతక వైరస్ వచ్చినప్పటికీ దానికి విరుగుడు వ్యాక్సిన్‌ను కనుగ్గొని తీరుతున్నాము. ప్రాణాంతక క్యాన్సర్ నుంచి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రక్తంలో క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు క్యాన్సర్ సోకే ఏడు సంవత్సరాల ముందే పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చని అంటున్నారు.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనల్లో క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను కనుగ్గొన్నారు. యూనివర్సిటికీ చెందిన శాస్త్రవేత్తలు మొత్తం 44వేల మందికి పై పరిశోధనలు జరిపారు. వీరిలో 4,900ల మందికి పైగా క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నవారే.

ఏడు సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన ఈ పరిశోధనలను 618 క్యాన్సర్ ప్రొటీన్లను గుర్తించారు. రక్తంలో ఉండే ఈ క్యాన్సర్ ప్రొటీన్లు 19 రకాలు క్యాన్సర్ వ్యాధికి సంబంధం వున్నాయని అంటున్నారు. రక్త నమూనా తీసుకున్న ఏడు సంవత్సరాల తరువాత 44 వేల మందికి సంబంధించిన కొందరు మూడేళ్ల తరువాత క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇలా క్యాన్సర్ వ్యాధికి గురికాకముందే వారిలో క్యాన్సర్‌ను గుర్తించేందుకు ప్రొటీన్లు సహాయపడ్డాయని చెబుతున్నారు.
రక్తంలో వుండే ప్రొటీన్లపై మరింత పరిశోధన చేస్తే క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చాలా ప్రాణాలు కాపాడవచ్చని అంటున్నారు. క్యాన్సర్‌కు సంబంధించి ఇలాంటి పరిశోధనే మరొకటి జరిపారు. 3,00,000ల మందిపై పరిశోధనలు జరిపితే రక్తంలోని 40 రకాల ప్రొటీన్లు 9 రకాల క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని కనుగ్గొన్నారు.
ఇంగ్లాండ్‌కు చెందిన క్యాన్సర్ రిసర్చ్ సెంటర్ ఈ పరిశోధనలను జరపడానికి నిధులందిస్తోంది. ఆక్సఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ పరిశోధనలను చేపడుతున్నారు. క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని వైద్యులు ఎప్పటి నుండే చెబుతూనే వున్నారు. ఇప్పుడు ఏడు సంవత్సరాల ముందే క్యాన్సర్‌ను గుర్తించడం క్యాన్సర్ పరిశోధనల్లో ఒ మైలురాయిని అందుకున్నట్లు భావించవచ్చు.
క్యాన్సర్‌ను ముందుగానే ఎలా గుర్తించాలి ?
క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం వల్ల దాని నుండి బయటపడే అవకాశాలు చాలా తగ్గిపోతాయ్. క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టడానికి ప్రస్తుతం రకరకాల పధ్దతులను ఫాలో అవుతారు. ముందుగా శరీరంపై ఏవైనా గడ్డలు ఏర్పడినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చర్మం రంగు మారినా వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి.
రక్తపరీక్ష ద్వారా కూడా కొన్ని క్యాన్సర్‌లు తెలుసుకోవచ్చు. లుకేమియా క్యాన్సర్ లక్షణాలు రక్తపరీక్షలో తెలిసిపోతాయ్. తరువాత ఇమేజ్ టెస్టింగ్ ద్వారా కూడా క్యాన్సర్‌ను ముందే గుర్తించవచ్చు. ఈ టెస్టులో శరీరం లోపల ఉన్న భాగాలను స్కాన్ చేసి పరిశోధిస్తారు. యముకలను కూడా స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్, ఎమ్ఆర్‌ఐ, పీఈటీ, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. బయోప్సీ పరీక్ష ద్వారా కూడా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తారు. బయోప్సీ పరీక్షలో కణాలను తీసుకుంటారు. ఈ కణాలు తీసుకోవాలంటే శరీరంలోని కొంత భాగాన్ని పరీక్ష కోసం తీసుకుంటారు. ఏ భాగాన్ని తీసుకుంటారనేది అప్పటి వైద్య పరీక్షలను బట్టి వుంటుంది.
క్యాన్సర్‌లో మొత్తం 4 స్టేజులుంటాయ్. మొదటి స్టేజులో లక్షనాలు బయటపడతాయ్. క్యాన్సర్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోనే క్యాన్సర్ బారిన పడకుండా వుంటాము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications