ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం..

మన నిత్య జీవితంలో చాలా సమస్యలకు సంబంధించి ట్యాబ్లెట్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే డైరెక్ట్ గా మెడికల్ షాపుకి వెళ్లి తెచ్చుకుంటుంటాం. తలనొప్పి అని, జలుబు అని, దగ్గు అని, ఒళ్లు నొప్పులు , మోకాళ్ల నొప్పులు, గ్యాస్ ట్రబుల్ కి ఇలా చాలా సమస్యలకు మనం డాక్టర్ ని కలవకుండానే మెడికల్ షాపులకు వెళ్లి ట్యాబ్లెట్లు తెచ్చుకుంటుంటాం.

అయితే తాజాగా ఇకపై ఎసిడిటీ లేదా గ్యాస్ ట్రబుల్ కి సంబంధించిన ట్యాబ్లెట్లను నేరుగా మెడికల్ షాపులో కొనలేరు. యాసిడ్ రిఫ్లక్స్ మందుల కొనుగోలుపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సంచలన నిర్ణయం తీసుకుంది.

CDSCO New Rules Acidity Gas Medicines Now Require a Doctor s Prescription

కొత్త రూల్స్ ప్రకారం.. ఎసిడిటీ తగ్గించడానికి వాడే కొన్ని కీలకమైన మందులను ఇకపై మెడికల్ స్టోర్లలో ఇష్టానుసారంగా (ఓవర్ ది కౌంటర్) అమ్మకూడదు. వాటిని కొనాలంటే కచ్చితంగా డాక్టర్ రాసిచ్చిన చీటీ ఉండి తీరాల్సిందే.

వోనోప్రాజాన్ మందుపై కఠిన ఆంక్షలు

ముఖ్యంగా కడుపులో మంట, అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలకు విరివిగా ఉపయోగించే వోనోప్రాజాన్ (Vonoprazan) అనే మెడిసిన్ విషయంలో ఈ ఆంక్షలు చాలా కఠినంగా ఉండనున్నాయి. భారతదేశంలో ఇప్పటికే 10 మిల్లీగ్రాములు, 20 మిల్లీగ్రాముల మోతాదుల్లో ఈ మెడిసిన్ వాడేందుకు అనుమతి ఉంది.

అయితే కొత్త నిబంధనల ప్రకారం ఈ మందును ఎవరికి పడితే వారికి అమ్మడానికి వీల్లేదు. కేవలం జీర్ణాశయం, పేగుల వ్యాధులలో నిపుణులైన డాక్టర్లు (గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్) రాసిస్తేనే మెడికల్ షాపుల వాళ్లు ఈ మెడిసిన్ అమ్మాల్సి ఉంటుంది. సాధారణ డాక్టర్లు కాకుండా స్పెషలిస్ట్ సూచనను తప్పనిసరి చేయడం గమనార్హం.

బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా!బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా!

ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి?

ఇంత ఆకస్మికంగా ఈ నిబంధనలు ఎందుకు తెచ్చారనే సందేహం మీకు రావచ్చు. దీని వెనుక మన ఆరోగ్య భద్రతే దాగి ఉంది. చాలామంది ఏళ్ల తరబడి గ్యాస్ మందులు వాడుతూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం దొరుకుతుందే తప్ప, ఆ సమస్య రావడానికి గల మూల కారణం ఏంటనేది బయటపడదు అని CDSCO స్పష్టం చేసింది.

అంతేకాకుండా, ఈ యాంటీ-యాసిడ్ మందులను దీర్ఘకాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల, మన శరీరంలో అత్యంత కీలకమైన విటమిన్ బి12, మెగ్నీషియం స్థాయిలు పడిపోయి తీవ్రమైన లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ లోపాల వల్ల నరాల బలహీనత, కండరాల నొప్పులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

మరోవైపు, డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ లేకుండా లేదా అనవసరంగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, లేదా యాంటీ బయాటిక్స్ వాడకూడదని cdsco ఇటీవల హెచ్చరించింది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion