Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Big Alert: చికెన్‌లో కరోనా కంటే డేంజరస్ బ్యాక్టీరియా.. తింటే వంద శాతం చనిపోతారు!
ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. అందులో మరీ ముఖ్యంగా చికెన్ మాత్రం తప్పకుండా ఉండాలి. ఆదివారం రోజు ముక్క లేకపోతే ముద్ద మాత్రం దిగదు. అయితే చికెన్ వాళ్ళ అనారోగ్య సమస్యలు వస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తాజాగా మరో సంచనల నిజం వెలుగులోకి వచ్చింది. చికెన్‌లో ప్రాంతకమైన బ్యాక్టీరియాలు ఉన్నాయని వెల్లడైంది. తెలంగాణ, కేరళలోని ఫౌల్ట్రీల్లో అమ్ముతున్న చికెన్‌లో ఈ ప్రాంతకమైన బ్యాక్టీరియాలు, ఉన్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధికారులు వెల్లడించారు.
అసలు చికెన్‌లో ఎలాంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి? అవి మనిషికి ఏ విధంగా ప్రాణాపాయంగా మారుతున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పరిశోధనల్లో ఏం తేలిందంటే?
తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోని ఫౌల్ట్రీల్లోని కోళ్లపై ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధికారులు పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫౌల్ట్రీల్లోని కోట్లలో యాంటీ బయోటిక్స్‌ని తట్టుకునే ప్రమాదకరమై బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు గుర్తించారు. అలాగే విరేచనాలు కారణమయ్యే ఈకోలీ, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫీలోకాసస్ ఆరియస్, అలాగే క్లాస్ట్రిడియం పెర్‌ఫ్రింజెన్స్, సూడోమోనాస్ ఎరుగినోసా, క్లేబ్సియెల్లా, ఎంటరోకోకస్ ఫెకాలిస్, బాక్టీరియోడ్స్ ఫ్రాజిల్స్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఆనవాళ్లు గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే?
ఈ బ్యాక్టీరియాలు చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులతో పాటు పరిశోధకులు కూడా చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియాలు శరీరంలో యాంటీ బయోటిక్స్‌ను నిరోధించే ప్రతికూల శక్తిని పెంపొందిస్తాయని వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా కారణంగా న్యుమోనియా, కలరా, వంటి వ్యాధులు మనుషులను ఇబ్బందులకు గురి చేస్తాయని కొన్ని పరిస్థితుల్లో ప్రాణాపాయంగా కూడా మారుతాయని వెల్లడించారు. అలాగే వీటికి సంబంధించిన చికిత్స అందించే క్రమంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు.
పరిష్కారం ఏంటి?
ఈ బ్యాక్టీరియాలను నాశనమవ్వాలంటే కొన్ని టిప్స్ పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రాయిలర్ చికెన్‌లోని 95% బ్యాక్టీరియాలు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తేనే నాశనమవుతాయి. చికెన్‌ను సరిగ్గా ఉడికించి తినకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు కచ్చితంగా వస్తాయని వెల్లడించారు. అందుకే చికెన్‌ను సరిగ్గా ఉడికించి తినాలని పేర్కొంటున్నారు.
వారిపై చర్యలు తప్పనిసరి..
కోళ్లను తమ వ్యాపారం కోసం ఇష్టమొచ్చిన ఇంజెక్షన్స్ ఇచ్చి, మనిషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫౌల్ట్రీ ఫారం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రాణాంతకమైన బ్యాక్టీరియాలు, వైరస్‌లు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
జాగ్రత్తలు కూడా ముఖ్యం..
చికెన్ అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం. కానీ దానివల్ల ఆనారోగ్య సమస్యలు వస్తాయంటే కచ్చితంగా ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చికెన్‌ను శుభ్రంగా కడగడం, బాగా ఉడికాకనే తినడం వంటి కనీస జాగ్రత్తలు పాటించాలి. అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
గమనిక: ఈ స్టోరీలో మేము తెలిపిన విషయాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధ్రువీకరించడం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications