Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
ఆఫీసులో గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా? మోకాళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే ఇలా చేయండి
ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో గడిపే సమయం కన్నా ఆఫీసుల్లోనో లేదా పని పని ప్రదేశంలోనో ఎక్కువ సేపు గడపాల్సి వస్తుంది. డబ్బు సంపాదనలో ఇదంతా కామన్ గా మారిపోయింది. అయితే ఆఫీసులో గంటల తరబడి కుర్చీలో కూర్చొని పని చేయడం వల్ల చాలామందికి వెన్ను నొప్పి, నడుము నొప్పి వస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా యువత కూడా ఇది పెరిగిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. అదే సమయంలో గంటల పాటు డెస్క్ దగ్గర కూర్చోడం వల్ల మోకాల్ల నొప్పి కూడా పెరుగుతుంది. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు కాలక్రమేణా బలహీనపడతాయి. అయితే ఈ ప్రాబ్లమ్ తో బాధపడే ఉద్యోగులు తమ మోకాళ్లను ఎలా రక్షించుకోవాలో ఇక్కడ చూడండి.
-ఆఫీసులో కుర్చీలో ఎక్కువసేపు అలా కూర్చోవడం వల్ల మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు వాటి స్థితిస్థాపకతను అంటే ప్రతికూల పరిస్ధితుల నుంచి త్వరగా కోలుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి. కాబట్టి గంటకొకసారి అయినా కుర్చీలో నుంచి లేచి కనీసం 50 అడుగులు నడవండి లేదా గంట పాటు కుర్చీలో కూర్చున్న తర్వాత లేచి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి.

-చాలామంది కుర్చీపై వాలుతూ వర్క్ చేయడం, ఫోన్ మాట్లాడుతూ ఇలా చేయడం మనం గమనించవచ్చు. అయితే కుర్చీపై వాలుతూ పనిచేయడం వల్ల వెన్నెముక ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల నడుము ,మోకాళ్లలో నొప్పి వస్తుంది. మీది 8 గంటల షిఫ్ట్ అయితే.. కనీసం 7 సార్లు కుర్చీ నుండి లేచి తేలికగా సాగదీయాలి.
-చాలా మంది టేబుల్ దగ్గర కూర్చుని ఒకే భంగిమలో పని చేస్తారు. కాళ్ళకు ప్రత్యేక కదలిక ఉండదు. అందువల్ల కొంతకాలం తర్వాత మోకాలి నొప్పి పెరుగుతుంది. కాబట్టి మీరు కుర్చీపై కూర్చుని కొంత సాగదీయడం చేయవచ్చు. అప్పుడప్పుడు మీ కాళ్ళను ముందుకు చాపడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
-ఎక్కువ సమయం ఆఫీసులో ఉండటం వల్ల మన శరీరానికి తగినంత సూర్యరశ్మి అందదు. ఫలితంగా చర్మం విటమిన్ డి ఉత్పత్తి చేయదు. విటమిన్ డి ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అందువల్ల మీరు మోకాలి నొప్పిని అనుభవించడం ప్రారంభిస్తే..మీరు అవసరమైన విటమిన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత మీరు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవచ్చు.
-స్త్రీలలో, హైహీల్స్ ధరించే అలవాటు మోకాళ్ళు, చీలమండలలో నొప్పిని కలిగిస్తుంది. మీరు అలాంటి షూస్ ధరించి కుర్చీలో ఎక్కువ సమయం వర్క్ చేయకండి. సాధారణంగా పురుషులలో పాదం ముందు భాగం వెడల్పుగా ఉంటుంది కాబట్టి మీరు అలాంటి బూట్లు ధరించి ఆఫీసులో పని చేయాలి. దీంతోపాటు మీరు షూ అడుగు భాగం మృదువుగా ఉండేలా చూసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
