Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
షుగర్ వస్తే ఆకలి అధికం?, వాంతులు, వికారం?

షుగర్ వ్యాధి కలిగిన వ్యక్తి లక్షణాలు ఎలావుంటాయంటే....
తరచుగా మూత్రం పోయటం, విపరీతమైన దాహం మరియు ఆకలి, అలసట, లేక అసాధారణంగా నీరసపడటం, బరువు తగ్గటం, శ్వాస కష్టంగా తీసుకోవడం, వికారం, వాంతులు, చర్మం దురదలు, నయం కాని పండ్లు, కడుపు నొప్పి, దృష్టి మందగించడం, చేతులు, కాళ్ళు తిమ్మిర్లెక్కడం, తరచుగా చర్మం, లేదా చిగుళ్ళ్లు, జననాంగాలు ఫంగస్ బారిన పడటంగా వుంటాయి.
చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. ఈ లక్షణాల ఆధారంగా షుగర్ వ్యాధిని టైప్ 1 , టైప్ 2, గర్భవతి డయాబెటీస్ అని వర్గీకరించారు. నేటి రోజుల్లో చిన్న వయసులోనే అధిక బరువు సంతరించుకోవటానికి సాధారణంగా మనం అనేక పదార్ధాలలో వాడుతున్న షుగర్ వంటి తీపి పదార్ధాలు. ఫ్రక్టోస్ అధికంగా తీసుకుంటే లెప్టిన్ నిరోధకత తగ్గుతందని, ఈ చర్య అధిక ఫ్యాట్ లేదా హై కేలరీ ఆహారాలతో కలసి అధిక బరువు సంతరించుకునేలా చేస్తోందని, అధిక బరువు కారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులవుతున్నారని పరిశోధకులు చెపుతున్నారు.
తాజా పరిశోధనలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ లో ప్రచురించారు. లెప్టిన్ అనేది ఒక హార్మోన్ అని అది శరీరం తీసుకున్న ఆహారాన్ని , చేసిన ఎనర్జీ వ్యయాన్ని సమతుల్యత చేస్తుందని, ఈ హార్మోను సహకరించకపోతే శరీరం లావెక్కిపోవటం, షుగర్ వ్యాధి ఏర్పడటం జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లారిడా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చర్లు వెల్లడి చేశారు. ఫ్రక్టోస్ అనేది తాజా పండ్లలో వున్నప్పటికి వాటిని తింటే సమస్య లేదని, అయితే స్వీటు తినుబండారాలలో కలిపే సాధారణ స్వీటనర్లు అయిన టేబుల్ షుగర్, ఫ్రక్టోస్ అధికంగా వుండే కార్న సిరప్ మొదలైనవాటి వలననే వ్యక్తులు అధిక బరువు సంతరించుకోడం, షుగర్ వ్యాధి పాలవటం జరుగుతోందని వారు తెలిపారు.
ఈ వ్యాధి గతంలో పెద్ద వారిలోనే వుండేది అలాంటిది ఇప్పుడు పిల్లలో కూడా కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చక్కెర వ్యాధి అనేక ఇతర వ్యాధులకు కారణం అవుతోంది. జీవన విధానంలో వస్తున్న మార్పుల కారణంగా గత రెండు దశాబ్దాలలో ఊబకాయ సమస్య అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూడు రెట్లు పెరిగింది. అలాంటి వారందరికీ చక్కెర వ్యాధి 'బహుమతి'గా అందుతుంది. ముప్పై రెండు వర్ధమాన దేశాలలో 75 సామాజిక తరగతులలో చక్కెర వ్యాధి లక్షణాలు లేవని వెల్లడైంది. వారి జీవన విధానమే అందుకు కారణంగా తేలింది. పశ్చిమ దేశాలను అనుకరించే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
