Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
డయాబెటిక్ రోగుల ఆహార విధానం ఎలావుండాలి?

ఇతరులవలెనే, డయాబెటిక్ రోగులకు కూడా అన్ని రకాల ఆహారాలు కావాలి. అయితే, వీరు త్వరగా జీర్ణం అయ్యే కార్బో హైడ్రేట్స్ తీసుకోరాదు. దీనివలన బ్లడ్ షుగర్ స్ధాయి పెరుగుతుంది. షుగర్, స్వీట్లు, అరటిపండు, పండ్ల రసాలు,చాక్లెట్లు, ద్రాక్ష, కూల్ డ్రింక్, అన్నం వంటివి తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
ఇతర ఆహారాలు అంటే గోధుమ, కార్న్, వెజిటబుల్స్, పండ్లు వంటివి కార్బోహైడ్రేట్లు వున్నప్పటికి తీసుకోవచ్చు. డయాబెటిక్ రోగులకు ప్రొటీన్లు అత్యవసరం. గింజధాన్యాలు, బీన్స్, ఆకు కూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, సోయా, పనీర్, క్రీమ్ లలో ప్రొటీన్లు వుంటాయి. మాంసాహారులైతే, బీఫ్, ఫోర్క్, లివర్, కిడ్నీ, తినవచ్చు. ఎండుఫలాలైన బాదం, మొదలైనవి తినవచ్చు వీటిలోని కొవ్వు మంచిదే. అయితే నూనెలు, మేక మాంసం వదిలివేయాలి. ఒకే రకమైన నూనె ఎల్లపుడూ వాడకుండా, వేరుశనగ, సోయా, వంటివి మార్చాలి. పచ్చళ్ళు, కొబ్బరి, మసాలా ఆహారాలు తినరాదు.
ప్రతిరోజూ ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వుండే ఆకు కూరలు, సలాడ్లు వంటివి చేర్చండి. పీచు అధికంగా వుంటే రక్తంలో కొల్లెస్టరాల్ నియంత్రించబడుతుంది. పీచు అధికంగా వుండే కూరలు, జొన్నలు మొదలైనవి తినండి. అయితే తక్కువ కేలరీలు వున్న ఆహారాలు ఎంచుకోవాలి. నల్లని ద్రాక్ష మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి రోగ నిరోధకతను పెంచుతాయి. వ్యాయామం అశ్రధ్ధ చేయరాదు. ప్రతిరోజూ అరగంట నుండి గంట వరకు నడక లేదా వ్యాయామం తప్పనిసరిగా ఆచరించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
