Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
ఇన్సులిన్ చేసుకోవటం ఒక్కసారి ప్రారంభిస్తే?

షుగర్ కు సంబంధించిన అధిక ఆకలి, అధిక దప్పిక, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళవలసి రావటం, తదితర లక్షణాలు ఏ మాత్రం లేకుండా కూడా షుగర్ వ్యాధితో బాధ పడేవారున్నారు. ఆ లక్షణాలు లేనంత మాత్రాన నాకు షుగర్ లేదు అనుకోవటం తప్పు. నాకు దెబ్బతగిలినా, పుండు పడినా, గాయం త్వరగానే మానుతుంది. నాకు షుగర్ లేదేమో అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటారు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ దాన్ని నియంత్రణలో ఏ మాత్రం ఉంచుకోని వారిలో పుండు మానకపోవటం వంటి బాధలు ఉంటాయి. కనుక పుండ్లు సంతోషంగా మానుతున్నాయి కదా అని షుగర్ లేదేమో అనుకోవటం తప్పు.
షుగర్ వున్న వారు గోధుమతో చేసిన ఆహారాలే తినాలని వరి తినకూడదని చాలామంది అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. వరి, గోధుమ, జొన్న, సజ్జ, రాగి వీటన్నింటిలో 70 శాతం పిండి పదార్ధాలే ఉంటాయి కనుక వరి మానేసి గోధుమ, జొన్న తినటం ఏ మాత్రం సమంజసం కాదు. షుగర్ పేషెంట్స్ చాలామంది ఉదయం టిఫిన్ చేసినప్పటికన్నా మధ్యాహ్నం భోజనం తర్వాత షుగర్ ఎక్కువగా ఉంటుందనుకుని ఉదయం మాత్ర వేసుకోకుండా మధ్యాహ్నం భోజనం తర్వాత షుగర్ మాత్రలు వేసుకుంటారు. ఇది పొరపాటు. షుగర్ ఉదయం టిఫిన్ చేశాకనే అధికంగా ఉంటుంది. కనుక ఉదయం టిఫిన్ తో విధిగా మాత్రలు వేసుకోవాలి.
ఇన్సులిన్ చేసుకోవటం ఒక్కసారి ప్రారంభిస్తే, జీవితాంతం ఇన్సులిన్ చేసుకోవలసి వస్తుందని చాలా మంది షుగర్ రోగులు అపోహ పడతారు. ఇది అపోహ మాత్రమే. అత్యవసర పరిస్ధితుల్లో ఇన్సులిన్ ఉపయోగించినా ఆ తర్వాత, పరిస్ధితి చక్కబడ్డాక మరల ఓరల్ మెడిసిన్స్ తో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చనేది ఒక వాస్తవం. మాత్రలు, మందులు వేసుకోగానే బ్లడ్ షుగర్ బాగా తగ్గిపోయిందని, ఇక తాము షుగర్ కు మందులు వాడవలసిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. ఇది ఏ మాత్రం నిజం కాదు. షుగర్ ను అదుపులో ఉంచగలమే తప్ప, షుగర్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే మందులు, వైద్యాలు లేవని గుర్తించాలి.
షుగర్ వ్యాధి నియంత్రించుకోటానికి మార్గం ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించడం. తినే ఆహారం పట్ల శ్రధ్ధ వహించాలి. ఎప్పటికపుడు శరీర పరిస్ధితిని బట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకోవలసిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. అతిగా భుజించరాదు. ప్రతిరోజూ శరీరానికి తగినంత శ్రమ కల్పించే వ్యాయామాలు చేయాలి. అపుడే షుగర్ వ్యాధి నియంత్రణలో వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
