Latest Updates
-
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్!
మధుమేహ వ్యాధిని కంట్రోల్ చేసే ‘అల్లం’...!
నేటి సమాజంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అధిక శ్రమ వల్ల యుక్తవయసులోనే మనం మధుమేహ వ్యాధిని ఎక్కువగా చూస్తున్నాం. శరీరంలో పాంక్రియాస్ గ్రంధి ఇన్సులిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ రక్తం ద్వారా చక్కెరను శరీరంలోని వివిధ భాగాలకు అందిస్తూ సమర్ధవంతమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గడం లేదా అనియంత్రిత వల్ల రక్తంలో చక్కెర పేరుకుపోయి వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తంలో, మూత్రంలో మధుమేహ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

మానవ శరరీంలో చక్కెర వుండాల్సిన శాతం కన్నా ఎక్కువ వున్నప్పుడు అది వ్యాధిగా పరిణమిస్తుంది. దీనినే షుగర్ లేక డయాబెటిస్ అంటారు. ఓ ప్రముఖ సిడ్నీ యూనివర్సిటీ ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ ఫ్రొఫెసర్ చేసిన పరిశోధన ఆధారంగా మనం రోజువారీ వాడే ఆహారంతోనే చక్కెర వ్యాధికి చెక్ పెట్టొచ్చన్న విషయాన్ని కనుగొన్నారు. అలాంటి వాటిలో ఎక్కువ ప్రభావం చూపించేది 'అల్లం'.
మానవ శరీరంలోని బ్లడ్ గ్లూకోజ్‌ను అదుపు చేయడంతో అల్లం తోడ్పడుతుంది. స్వచ్ఛందంగా గ్లూకోజ్‌ను కండరాల్లోని కణాలకు చేరుస్తుంది. దీర్ఘకాలంగా షుగర్‌తో బాధపడుతున్న రోగులకు ఇది చక్కని మందు. షుగర్ లెవల్స్‌ను అదుపు చేయడం, ఇన్సూలిన్‌ను స్వతహాగా ఉత్పత్తి చేసే లక్షణం కండరాలకు కల్పిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో శరీరంలోని ఎక్కువ శాతం గ్లూకోజ్‌ను స్కెలెటల్ మజిల్స్ క్రమబద్దీకరిస్తాయి. 1% అల్లం తీసుకుంటే కూడా ఫలితం వుంటుంది.
రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకుపోవడం జరుగదు. కీళ్లవారు, ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. శొంఠి ఏండ పెట్టిన అల్లంను శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు. అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది.. నోటిలో చేరిన ప్రమాదక బ్యాక్టీరియల్ను సంహరించి, దంటాలను ఆరొగ్యముగా ఉంచుతుంచి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
