Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
డయాబెటిక్ రోగులలో పంటి చిగుళ్ళ వ్యాధులు!

సాధారణంగా, పంటి చిగుళ్ళకు సంబంధించి షుగర్ వ్యాధి కలిగించే నష్టాలు ఎవరూ పరిశీలించరు. కాని ఈ వ్యాధి మీ పంటి చిగుళ్ళకు సైతం ఎంతో హాని కలిగిస్తుంది. షుగర్ వ్యాధి రోగులలో కనీసం మూడు వంతులమంది పంటి చిగుళ్ళ వ్యాధికి అంటే పెరిడాంటిస్ కు ఏదో ఒక దశలో గురవుతారు. డయాబెటీస్ వ్యాధి పంటి చిగుళ్ళకు నష్టం ఎలా కలిగిస్తుంది? డయాబెటీస్ కనుక సరైన నియంత్రణలో వుండకపోతే, అది పెద్దలైనా, చిన్నవారైనా పెరిడాంటల్ వ్యాధులకు అంటే చిగుళ్ళ వ్యాధులకు గురిచేస్తుంది.
పిల్లలలో కొంతమందిలో 6 సంవత్సరాల వయసు వచ్చిందంటేచాలు ఈ వ్యాధికిగురవుతారు. చిగుళ్ళ వ్యాధి అంటే, పంటిని గట్టిగా పట్టి వుంచే ఎముక దెబ్బతినటం, దానివలన చిగుళ్ళు వాపు, మంట, దెబ్బతినడం వంటివి జరుగుతాయి. శరీరం కనుక డయాబెటీస్ వ్యాధితో వుంటే, శరీరంలోని రక్తనాళాల స్ధితి మార్పు చెందుతుంది. అది రక్త ప్రసరణ సామర్ధ్యతలను తగ్గిస్తుంది. దీని ఫలితంగా పంటిని పట్టి వుంచే ఎముక బలహీనపడుతుంది. చిగుళ్ళు పాడవుతాయి. ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. అవి మరింత చిగుళ్ళను పాడు చేస్తాయి.
డయాబెటీస్ కనుక సరైన నియంత్రణలో లేకుంటే, నోటిలో ఊరే ద్రవాల లో సాధారణంకంటే కూడా అధికస్ధాయిలో గ్లూకోజ్ వుంటుంది. ఈ అసాధారణ గ్లూకోజ్ చిగుళ్ళ వ్యాధులను కలిగించే బాక్టీరియాకు సహకరించి వ్యాధిని ఆ భాగంలో అధికంగా, వేగంగా విస్తరింపజేస్తుంది.
చిగుళ్ళ వ్యాధి లక్షణాలు ఎలా వుంటాయి?
ప్రతి వ్యక్తికి డయాబెటీస్ వుంటే చాలు వారి చిగుళ్ళ వ్యాధి లక్షణాలు పూర్తిగా అవగతమవుతాయి. ఖచ్చితమైన చిగుళ్ళ రోగ నిర్ధారణకు, షుగర్ వ్యాధిగ్రస్తులు దంత వైద్యులను లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. లక్షణాలు ఎలా వుంటాయంటే.....
- బ్రష్ చేసుకునే సమయంలో చిగుళ్ళనుండి రక్తం కారుతుంది.
- చిగుళ్ళు వాపు చూపిస్తాయి. ఎర్రగా వుండి పలుచబడతాయి.
- చిగుళ్ళు సైజులో తగ్గిపోతాయి
- దంతాలు వదులవుతాయి
-దంతాలు లేదా చిగుళ్ళ మధ్య చీము పడుతుంది
- దవడ భాగం తన లైనింగ్ తప్పుతుంది.
- నిరంతరం చెడు శ్వాస వస్తూంటుంది.
కనుక షుగర్ వ్యాధి రోగులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తతగా వుండాలి. శరీర భాగాలకు ఏ చిన్న నష్టం కలిగించిందని గమనించినా, తగిన చికిత్స చేయించుకోవాలి. ఎల్లపుడూ తమ రక్తంలోని గ్లూకోజ్ నిల్వలను సిఫార్సు చేసిన స్ధాయిలో వుంచుకొంటూ ఆహారం, సరైన ఇతర జీవన విధానాలు పాటించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
