Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
షుగర్ వస్తే గుండె జబ్బులు ఎలా ఉంటాయి?
డయాబెటీక్ రోగులలో రెండు రకాల గుండెజబ్బులు వస్తాయి. వాటిలో ఒకటి కరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే ఈ వ్యాధిలో గుండెకు రక్తం తీసుకు వెళ్ళే రక్తనాళాలలో రక్తం గట్టిపడిపోతుంది. దీనితో రక్తనాళాలు సన్నపడి గుండెపోటు వస్తుంది. రెండవది, గుండె విఫలత. ఇది మొదటి దానికంటే తీవ్రమైనది. గుండె రక్తాన్ని సరిగా బయటకు పంప్ చేయలేదు. అలాగని గుండె పని చేయటంలేదనరాదు. కాలక్రమేణా లక్షణాలు మరింత ముదిరిపోతాయి.

షుగర్ వ్యాధి లేని వారికంటే షుగర్ వ్యాధి వున్న వారికి గుండె జబ్బుల రిస్క్ అధికం. అధికంగా ఏర్పడే గ్లూకోజ్ రక్తనాళాలను, గుండె కండరాన్ని డ్యామేజ్ చేస్తుంది. గుండె కొట్టుకోవడంలో అసమతుల్యతలు ఏర్పడతాయి. నొప్పి సంకేతాలు నరాల ద్వారా మాత్రమే తెలుస్తాయి. కనుక ఇటువంటి వారికి నొప్పిలేని గుండె పోటు వచ్చే అవకాశాలుంటాయి. దీని లక్షణాలు ఎలా వుంటాయంటే...ఛాతీలో అసౌకర్యం అనిపించడం, చేతులు, వీపు, నోటి దవడ లేదా పొట్ట భాగాలనుండి నొప్పి రావడం వుంటుంది. శ్వాస సరిగా ఆడదు, చెమట పట్టటం, వికారం అనిపించడం వుంటుంది. మహిళలకు ఈ లక్షణాలు తక్కువగా చూపుతాయి.
డయాబెటిక్ రోగులలో గుండె జబ్బు అరికట్టటానికి సంవత్సరానికి ఒక సారి తప్పక గుండెను పరీక్షింపజేయాలి. కొల్లెస్టరాల్, రక్తపోటు వంటివి చెక్ చేయాలి. అవసరపడితే ఇతర పరీక్షలు కూడా చేయించాలి. డయాబెటీస్, గుండె జబ్బులు రెండూ కూడా షుగర్, రక్తపోటులను అరికడుతూ, రెగ్యులర్ వ్యాయామాలు చేయడం ద్వారా నియంత్రించవచ్చు. ప్రతిరోజూ పదివేల అడుగులు నడిస్తే డయాబెటీస్ దగ్గరకు రాదంటున్నారు నిపుణులు. ఈ నడక శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని 3 శాతం పెంచుతుందని, బాడీ మాస్ ఇండెక్స్ 1 శాతం తగ్గిస్తుందని కూడా చెపుతున్నారు.
ఇండియాలో ఇప్పటికి 71 మిలియన్న జనాభా డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇంటర్నేషనల్ డయాబెటిక్స్ ఫెడరేషన్ వెల్లడించింది. ఇది చాలా ఎక్కువని వీరు భావిస్తున్నారు. గత కొద్ది దశాబ్దాలనుండి భారతీయుల జీవన విధానం, ఆహార అలవాట్లు తీవ్రస్ధాయి మార్పులకు గురయ్యాయని, సాంప్రదాయక వంటకాలనుండి కార్బో హైడ్రేట్లు అధికంగా వుండే పాశ్చాత్య వంటకాలకు మొగ్గు చూపటమే దీనికి కారణమని వీరు భావించారు. దీనితో పాటుగా జీవనంలోని దైనందిన ఒత్తిడి కూడా ప్రధాన కారణమన్నారు. ప్రతిరోజూ 30 నిమిషాల నడక, లేదా ఇతర వ్యాయామాలు గ్లూకోజ్ స్ధాయిని నియంత్రిస్తాయని తెలిపారు.
నడిస్తే, మన కండరాలు రక్తంలోని షుగర్ ను నియంత్రిస్తాయి. రక్తంలో బాగా కలిసేట్లు చేస్తాయి. ఫలితంగా గ్లూకోజు స్ధాయి తగినట్లుగా వుండి దాని ప్రభావం కొన్ని గంటలపాటు వుంటుంది. అయితే, అది ఎప్పటికి వుండేదికాదు. మరల భోజనం తర్వాత బ్లడ్ గ్లూకోజ్ స్ధాయి పెరుగుతుంది. విటమిన్ బి స్ధాయి తక్కువగా వున్నవారు ప్రత్యేకించి బ్లడ్ షుగర్ టెస్టులు చేయించుకోవాలని అందుకు తగిన విటమిన్లు వాడాలని కూడా నిపుణులు చెపుతున్నారు. సంతులిత ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు నడక వంటి వ్యాయామాలు చేయడం మాత్రమే షుగర్ వ్యాధి నియంత్రణకు తోడ్పడగలవని నిపుణుల అభిప్రాయం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications