Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
షుగర్ వ్యాధి నియంత్రణ ఎలా?

షుగర్ వ్యాధి గ్రస్తులు తమ శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. ఎత్తు వారి బరువుకు అనుగుణంగా ఉండాలి. మెంతి పొడి, రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ , బ్లడ్ కొలెస్టరాల్‌ను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. రోజుకు షుమారుగా 20 నుండి 30 గ్రాముల మెంతులు రెండు సార్లుగా మధ్యాహ్నం భోజనానికి ముందు, రాత్రి భోజనానికి ముందు నీళ్ళతోగాని, మజ్జిగతో కాని వేయాలి. మెంతులపొడి తీసుకున్నషుమారు 30 నిమిషాల తర్వాత భోజనం చేయాలి. ఇది చక్కెర వ్యాధికి వాడే మందుల డోసేజీని కూడా తగ్గిస్తుంది.
ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. అవసరాన్నిబట్టి వైద్యుని సలహాలు కూడా పాటించాలి. వైద్యుని సూచనల మేరకు మందులు వాడుతూ ఉండాలి. ఆహారం నిర్దేశించిన సమయానికి తప్పక తీసుకోవాలి. అసలు తినక పోవటం లేదా అధికంగా తినటం వంటివి చేయరాదు. ప్రతిరోజూ అరబిక్ వ్యాయామాలు, లేదా నడక, లేదా జాగింగ్ వంటివి 30-60 నిమిషాల వరకు చేయాలి. సైకిల్ తొక్కడం, బాడ్మింటన్, షటిల్‌కాక్ ఆడడం, స్విమ్మింగ్ లేదా యోగాసనాలు, ప్రాణాయామం ప్రతి రోజూ తప్పక చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే మంచి ఆహారపుటలవాట్లు పాటించాలి. షుగర్ అధికంగా వుండే పదార్ధాలు, పిండి పదార్థాలు, కూల్ డ్రింకులు, ఆల్కహాల్, వేపుడు వంటకాలు మొదలైనవి చాలా వరకు తగ్గించాలి. అలాగే పాలు, పాలఉత్పత్తులు, ధాన్యం అంటే సజ్జలు, బార్లీ, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్న, గోధుమలు, సేమియా వంటివి బాగా తినాలి. అలాగే పప్పుధాన్యాలు, తాజా ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లు ప్రతిరోజూ రాత్రివేళ ఒక భోజనంగా తింటే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి సహకరిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications