Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026
షుగరును నిర్లక్ష్యం చేస్తే ..? కంటి చూపు కోల్పోయే ప్రమాధం..!

కానీ చాలామంది వ్యాధి ముదిరేవరకు తెలుసుకోలేకపోతున్నారు. ఇందుకు అశ్రద్ధ ఒక కారణమైతే అవగాహన లేకపోవడం మరో కారణం. నిజానికి చిన్న కంటిపరీక్షతో మధుమేహ వ్యాధిని కనిపెట్టవచ్చు. కానీ ఈ విషయం తెలియని చదువుకున్నవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. అందుకే వ్యాధి ముదిరి కిడ్నీ వ్యాధులు, గుండెజబ్బుల వంటి అనేక రకాల సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. వీటితో పాటు జీవితాన్ని అంధకారమయం కూడా చేసుకుంటున్నారు. కారణం.. డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిస్ వల్ల వచ్చే కంటిజబ్బు.అశ్రద్ధే అసలు కారణం..
ముందుజాక్షిగత్త లేకపోవడం, వైద్యుల సూచనలు పాటించకపోవడం, ఆహార నియమాలు, వ్యాయామం చేయడంలో అలసత్వం, అశ్రద్ధ... మధుమేహం రోజురోజుకూ పెరుగుతూ సమస్యల వలయంలోకి తోసేయడానికి ప్రధాన కారణం ఇదే. రక్తంలో పెరిగిన చక్కెరలు ఇతరత్రా సమస్యలు అన్నీ కలిగించిన తరువాత తీరిగ్గా కంటి పరీక్షలు, కిడ్నీ పరీక్షలు చేయించుకుంటారు. అప్పటికే అవి సగం దెబ్బతినివుంటాయి. దాంతో ఆయా సమస్యల నుంచి బయటపడే అవకాశం తక్కువ. కొంతమంది ప్రాథమిక సూత్రాలైన జీవనవిధానాన్ని పట్టించుకోకుండా అనేక రకాల వైద్యవిధానాల వెనుక పరిగెత్తి సరైన చికిత్స తీసుకోవడంలో మరింత ఆలస్యం చేస్తుంటారు. ఈలోపే వ్యాధి ముదురు పాకాన పడుతుంది. కాబట్టి డయాబెటిస్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు.
ఎలా వస్తుంది?మన కంటిచూపులో ముఖ్యపాత్ర వహించేది రెటీనా. మధుమేహం వల్ల రక్తంలో పెరిగిన చక్కెర పదార్థాలు ఈ రెటీనా లోని రక్తనాళాలను దెబ్బతీస్తాయి. క్రమంగా రక్తనాళాల నుంచి రక్తం బయటకు లీక్ అవుతుంది. ఇది కంటి మధ్యభాగంలో చేరుతుంది. రక్తనాళాలు వాచిపోతాయి. దానివల్ల చూసే దృశ్యం అస్పష్టమవుతుంది. కన్ను పూర్తిగా దెబ్బతిని అంధత్వానికి కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి రెండు కళ్లకూ కూడా ఒకేసారి రావచ్చు. రెటీనా వాపును గుర్తించడం కొంచెం కష్టమే. పూర్తి లక్షణాలు కనిపించాలంటే వ్యాధి తీవ్రం అయిపోవచ్చు. సాధారణంగా వ్యాధి తొలిదశలో చూసే దృశ్యం అస్పష్టంగా మచ్చలతో ఉంటుంది. ఆ తరువాత క్రమంగా దృష్టి మందగిస్తుంది. కాబట్టి ఏమాత్రం దృష్టి సన్నగిల్లినా మధుమేహం ఉన్నవారు రెటీనా పరీక్షలు చేయించుకోవాలి.
నిర్ధారించడం ఎలా.?మన శరీరంలోని రక్తనాళాలు బయటకు కనిపించే ఏకైక భాగం కన్ను. కాబట్టి కంటి పరీక్షల ద్వారా చాలా రకాల వ్యాధులను కనిపెట్టవచ్చు. డయాబెటిస్ వల్ల దెబ్బతిన్న రక్తనాళాలను కూడా కంటి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. వ్యాధి స్థితిని అంచనా వేయవచ్చు. మధుమేహ వ్యాధిక్షిగ్రస్థులకు కిడ్నీ, గుండె వంటి ఇతర అవయవాలు ఎంతవరకు దెబ్బతిన్నాయో కూడా ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నదని తెలియగానే ముందు కంటిపరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
తీసుకోవలసిన జాగ్రత్తలు..
1. రెటీనా వాపు వల్ల కలిగే దృష్టిలోపాన్ని లేజర్ చికిత్స ద్వారా సరిచేయవచ్చు. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి చికిత్స దాకా రాకముందే ముందుగానే సమస్యను నివారించడం మేలు. ఇందుకు ప్రధాన మార్గం డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడం.
2. ఒక్కసారి తింటే ఏమవుతుందిలే అని స్వీట్లు తినేయడం మంచిది కాదు. దీనివల్ల సమస్య మరింత త్వరగా పెరుగుతుంది.
3. వ్యాయామం చేయడాన్ని నిర్లక్ష్యం చేయడమంటే ఆరోగ్యానికి గుడ్ బై చెబుతున్నట్టే భావించాలి. ప్రతిరోజూ ఉదయం కనీసం అరగంట పాటయినా వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
4. ప్రతి నెలా తప్పనిసరిగా రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి.
5. మూడు నెలలకు ఒకసారి రెటీనాలో వచ్చే మార్పులను పరీక్ష చేయించుకోవాలి.
6. మధుమేహులు ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకుంటే ఇతర సమస్యలుంటే బయటపడతాయి. దాన్ని బట్టి ఆయా సమస్యలకు తగిన చికిత్సలు చేయించుకోవడం సులభం అవుతుంది.
7. మధుమేహం ఉనాన లేకపోయినా నలభయ్యేళ్లు దాటగానే కనీసం ఏడాదికి ఒకసారైనా కంటిపరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రమాదకరమైన సమస్యలను అడ్డుకోవచ్చు. వచ్చినా వాటి నుంచి బయటపడటం సులువు అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications