Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
షుగర్ వ్యాధికి జతగా వచ్చే అనర్ధాలు!

మరి ఊబకాయం ఉన్నవారికి డయాబెటీస్ వస్తే ఏం చేయాలి? ఊబకాయం ఉన్నవారికి శరీరంలోని ఇన్సులిన్ సాధారణంగా పనిచేయదు. శరీరం బరువు తగ్గే కొలది ఇన్సులిన్ పనిచేయటం మొదలుపెడుతుంది. వ్యాయామాలలో కూడా అదే జరుగుతుంది. కనుకనే డయాబెటీస్ రోగులు ఊబకాయం వున్నవారు బరువు తగ్గటం కొరకు వ్యాయామాలు, మంచి ఆహారాలు తీసుకోవడం చేస్తారు. పిల్లలకు ప్రత్యేకించి బరువు ఎక్కరాదనే విషయం తెలియజేయాలి. బరువు ఎంత తక్కువైతే అంత వేగంగా డయాబెటీస్ తో వచ్చే అనర్ధాలు వెనుకపడతాయి. పిల్లలు కొంతమేర ఆరోగ్యంగా కూడా వుండగలరు.
ఊబకాయం ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలోవిరివిగా వ్యాపించింది. మన దేశంలోని నగరాలలో కూడా మారుతున్న జీవన విధానాలకుగాను ఊబకాయం చిన్నతనంలోనే పిల్లలకు వచ్చేస్తోంది. అయినప్పటికి పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో బాడీ మాస్ ఇండెక్స్ తక్కువగా వుందని రీసెర్చి తెలుపుతోంది. అయితే, నడుము, పిరుదులకు సంబంధించిన గణాంగాల నిష్పత్తులు మాత్రం అధికంగా వుండి అధిక గుండెజబ్బులను తెలియజేస్తున్నాయి. ప్రత్యేకించి మహిళలు నలభై సంవత్సరాల వయసు దాటిందంటే చాలు తగిన శారీరక శ్రమ లేక ఊబకాయం బారిన పడుతున్నారు.
సాధారణంగా వ్యక్తులకు 40 సంవత్సరాల వయసు పైబడే సరికి తమ జీవక్రియ రేటు తగ్గుతుంది. అప్పటికి వీరు టైప్ 2 డయాబెటీస్ వ్యాధి ఒకటి కలిగి వుంటే చాలు, మిగిలిన వ్యాధులైన, రక్తపోటు, గుండెజబ్బు, కొల్లెస్టరాల్, కంటి చూపు మందగించడం, కిడ్నీ విఫలతలు, వంటి వాటికి తేలికగా గురయ్యే అవకాశం వుంది. కనుక వయసు తక్కువగా వున్నపుడే సరైన శారీరక బరువును నియంత్రించుకుంటూ ఆరోగ్యకర ఆహారాలు తింటూ, తగిన వ్యాయామం చేస్తే, ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
