Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
షుగర్ ఉన్న వారు పాటించాల్సిన ఆహారం నియమాలు...
షుగర్ (మధుమేహ)వ్యాధి సోకిన తరువాత నియంత్రించుకోవడం కంటే ఆ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకో వడం చాలా ముఖ్యం. మారిన, మారుతున్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, సాంఘిక, ఆర్థిక స్థితిగతులు, లోపించిన దేహ పరిశ్రమ, పౌష్టికాహార లోపం, పర్యావరణంలో కలుగు తున్న మార్పులు, కాలుష్యం - ఇవన్నీ కలిసి మన దేశంలోనూ, ఇతర దేశాలలోనూ మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నాయి.
పెద్దవారికి మాత్రమే పరిమితమైందనుకునే టైప్-2 మధు మేహం ప్రస్తుతం పిల్లలు, యుక్తవయస్కులలో కూడా కనిపిస్తున్నది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేజారిపోతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, వారు పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి కాకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. మధుమేహ వ్యాధిని నయం చేయటంలో ఆహారం ప్రధానపాత్ర వహిస్తుంది. సగం డయాబెటిస్ వ్యాధిని మంచి ఆహార నియమాలు పాటించడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. ఆహార నియమాల విషయంలో ఈ కింది జాగ్రత్తలును తీసుకోవాలి.
చక్కెర, బెల్లం, తేనె, స్వీట్స్, చాక్ లెట్స్, కేక్, గ్లూకోజ్ బిస్కట్స్, ఐస్ క్రీమ్, జామ్, చెరకు రసం, తియ్యటి పానియాలు, కూల్ డ్రింక్స్, తియ్యటిపళ్ళు (అరటి, మామిడి, సపొటా, సీతాఫలం, ద్రాక్ష, పనస లాంటివి) మానేయాలి. కాఫీ, టీ, పాలు, చక్కెర లేకుండా తీసుకోవాలి. శాకరిన్ కూడా వాడకపోవడం మంచిది. శాకరిన్ వాడితే మూత్రకోశ వ్యాధి వచ్చే అవకాశం వుంది.

నీళ్ళు బాగా తాగుతూ నూనె వాడకాన్ని తగ్గించాలి. నూనె తక్కువగా వుండే టిఫీను, ఇడ్లీ, లాంటివి ఎక్కువవాడాలి. బాగా పీచు పధార్థం(ఫైబర్) ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ పరిమాణంలో రోజుకు రెండుసార్లుగా తీసుకోవటం కంటే చిన్న చిన్న మొత్తాలలో తరచుగా తీసుకోవాలి.
పూర్తిగా మానివేయటం మంచిది కాదు. రాత్రిళ్ళు పుళ్కాలు, చపాతీలు తినాలి. రక్తంలో గ్లూకోజ్ తక్కువ కాకుండా ఉండటం కోసం మధ్య మధ్యలో మజ్జిగ, టమాటా రసం, నిమ్మరసం, పళ్ళ రసాలను తీసుకోవచ్చు. పండుగల రోజులలో ఉపవాసం ఉండకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications