Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తెల్లని బియ్యపు అన్నం కలిగించే హాని..... !

తెల్లటి బియ్యం బదులుగా బ్రౌన్ రైస్, లేదా ఇతర గింజధాన్యాలు తింటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు మూడొంతులు తగ్గుతాయన్నారు. తెల్లటి అన్నం రక్తంలో షుగర్ స్ధాయి పెంచేస్తుందని, బ్రౌన్ రైస్ లేదా ఇతర గింజ ధాన్యాల ఆహారం క్రమేణా మెల్లగా ఎనర్జీలను వదిలి రక్తంలోని షుగర్ స్ధాయిని సాధారణంగా వుంచుతాయన్నారు. వీరు చేసిన పరిశోధనలో షుమారు రెండు లక్షలమంది అమెరికన్లను వినియోగించారు. వారానికి 150 గ్రాముల తెల్లని అన్నం తినే వారిలో 17 శాతం డయాబెటీస్ అధికంగా వచ్చే అవకాశం వున్నట్లు తేలింది. డయాబెటీస్ నిరోధించాలంటే, తాజా పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు వుండే ఆహారాలు, తక్కువ షుగర్ ఆహారాలు చక్కని పరిష్కారమని డా. విక్టోరియా కింగ్ డయాబెటీస్, ఇంగ్లాండ్ సంస్ధ తెలిపింది.
ప్రధానంగా మనం తినే ఆహారం ఎటువంటిదనేది శ్రధ్ధ పెట్టాలని తెల్లని అన్నంలో అధికమైన గ్లైసీమిక్ ఇండెక్స్ వుందని అది ఒక్కసారిగా ఎనర్జీని రక్తంలోకి వదిలేసి షుగర్ స్ధాయి పెంచుతుందని వీరు వెల్లడించారు. ఇప్పటికే అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో షుమారు 70 శాతం తెల్లటి అన్నం తింటున్నారని దీనిని బ్రౌన్ రైస్ లేదా గింజ ధాన్యాల ఆహారంతో మార్పు చేస్తే టైప్ 2 డయాబెటీస్ రాకుండా వుంటుందని పరిశోధకులు రుజువు చేసినట్లు లండన్ లోని డైలీ డయాబెటీస్ న్యూస్ ఇన్ సైడర్ జర్నల్ పేర్కొంది.
అయితే, దంపుడు బియ్యంలో పీచు ఎక్కువగా ఉంటుంది. తక్కువ మోతాదులో బ్రాన్ నూనె కూడా ఉంటుంది. తవుడు నుంచి తయారైన నూనెలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే కేవలం అన్నంగా కాకుండా బియ్యాన్ని ఇతర రూపాల్లో కూడా వినియోగించడానికి ప్రయత్నించాలి. పిల్లలకు బియ్యంతో పాయసం చేసి పెట్టవచ్చు. బియ్యప్పిండి, బియ్యపురవ్వలతో పిండి వంటలు చేసి వారికి చిరుతిండిగా పెట్టవచ్చు. కొనిపెట్టే ఫాస్ట్‌ఫుడ్‌లకంటే ఇవి ఎంతో మేలు కదా! ఇక పెద్ద వారు ఈ దంపుడు లేదా ముడి బియ్యం వంటివి ఎంత తిన్నా షుగర్ వ్యాధి ఆమడ దూరం అనే చెప్పాలి! మరి నేటినుండే ముడి బియ్యం తినటం ఆచరిద్దామా?
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications