Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఆరెంజ్ తినవచ్చా?
మధుమేహ వ్యాధి గ్రస్తులు వారి ఆహార నియమాలను అనుసరిస్తున్న సమయంలో నారింజ పండ్లను తినవచ్చు. 'అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్' వారు తెలిపిన దాని ప్రకారం (ADA), మిగిలిన ఆహార పదార్థాల కన్నా పండ్లు చాలా ఆరోగ్యకరమని వెల్లడించారు. కారణం పండ్లు అధికంగా ఫైబర్ మరియు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్'లను కలిగి ఉంటాయి. ADA వారు తెలిపిన దాని ప్రకారం అధిక పోషక విలువలు కలిగిన మొదటి 10 రకాల ఆహార పదార్థాలలో ఇది ముందుంటుందని తెలిపారు. నారింజలో ఉండే పోషకాలు మధుమేహ వ్యాధి గ్రస్తులలో ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
మధుమేహ వ్యాధి గ్రస్తుల ఆరోగ్యాన్ని కుదుట పరిచే మరియు వారికి అన్ని విధాల ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలను నారింజ కలిగి ఉంటుంది, వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
యాంటీ-ఆక్సిడెంట్స్
నారింజ పండ్లు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్'ను కలిగి ఉంటాయి, ఇందులో విటమిన్ 'A','C','E', ల్యూటీన్ మరియు బీటా కెరోటిన్'లను కలిగి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మధుమేహ వ్యాధి వలన కలిగే ప్రమాదాల నుండి రక్షిస్తాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు గుండెపోటు, క్యాన్సర్, మరియు గుండె సంబంధిత వ్యాధుల వంటి ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశాన్ని అధికంగా కలిగి ఉంటారు. కారణం ఈ వ్యాధి గ్రస్తులలో రసాయనిక ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉంది వీటిని 'ఆక్సిడేటివ్ స్ట్రెస్' అంటారు. కానీ నారింజలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ వీటికి వ్యతిరేఖంగా పని చేస్తాయి, కావున మధుమేహ వ్యాధి గ్రస్తులకు నారింజ పండ్లు చాలా ఆరోగ్యకరం.

ఫైబర్
రక్తంలో చక్కెర స్థాయిలు అధికం అయినపుడు, నారింజలో ఉండే ఫైబర్'లు జీర్ణాశయం మరియు ప్రేగులలో చక్కెరలను గ్రహించటాన్ని తక్కువ చేస్తాయి. అంతేకాకుండా, నారింజ వలన మధుమేహ వ్యాధి గ్రస్తుల రక్తంలో ఉండే కొవ్వు పదార్థాలు కూడా నియంత్రించబడతాయి, మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇది చాలా ముఖ్యం కారణం, కొవ్వు పదార్థాలు అధికం అయినచో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు మేమిచ్చే సూచన -పండ్ల రసాలను త్రాగటం కన్నా వాటిని తినటం వలన ఎక్కువ ఫైబర్'ను పొందుతారు.

వివిధ పోషకాలు
పోషకాలలో ముఖ్యంగా పొటాషియం, కాల్షియం, మరియు మెగ్నీషియం వంటివి నారింజలో కనుగొనబడ్డాయి. ఇవి శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి ముఖ్యంగా కండరాల కదలికలకు, మూత్రపిండంలో నీటి శాతాన్ని నిర్వహించుటకు, ఎముకల బలానికి, మరియు కణాల విధి నిర్వహణలకు ఇవి తప్పకుండా అవసరం.

మధుమేహ వ్యాధి గ్రస్తులకు సరైన మొత్తంలో నారింజ పండ్లు
మధుమేహ వ్యాధి గ్రస్తులు క్యాలోరీలు తీసుకోవటంలో జాగ్రత్తగా ఉండాలి, నారింజ పండ్లను తినటానికి ముందుగా మీ శరీరంలో ఉన్న క్యాలోరీల స్థాయిలపై పూర్తి అవగాహనను కలిగి ఉండాలి.రోజులో తీసుకునే క్యాలోరీల సంఖ్య 1600 పరిమితిలో ఉండాలి. ఎవరైతే రోజులో 2000 క్యాలోరీలను తీసుకునే స్థితిలో ఉన్నారో, వారు 3000ల కంటే అధికంగా క్యాలోరీలను తీసుకోకుడదు.ఎవరైతే రోజులో 2000 నుండి 2400 క్యాలోరీలను తీసుకోవాలో వారు అధికంగా పండ్లు తినటం చాలా మంచిది.

ఇక్కడ తెలిపిన ప్రతిపాదనలన్ని అమెరికాలో ఉన్న 'నేషనల్ డయాబెటిస్ ఇన్ఫర్మేషన్ క్లీయరింగ్ హౌస్' వారి ప్రకారం వెల్లడించబడినవి. మీరు తీసుకునే క్యాలోరీల సంఖ్యల పై జాగ్రత్తలు మరియు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇది లింగత్వం, మీరు నిర్వహించే భౌతిక కార్యకలాపాల పైన, శరీర పరిమాణం, బరువు తగ్గటంలో మీ లక్ష్యాల పైన ఆధారపడి ఉంటుంది. మీ భోజనంను సరైన పాళ్ళలో నిర్వహిస్తూ, పండ్లను కూడా తినటం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
