Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటిస్ రాకుండా అరికట్టే.. అమోఘమైన ఆహారాలివి..!
నయం చేయడం కంటే ముందుగానే నిరోధించడం చాలా మంచిదని చాలా మంది చెబుతుంటారు. నిజమే ఎందుకంటే.. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కష్టమవుతుంది. అదే ముందు జాగ్రత్త పాటిస్తే ఎలాంటి సమస్య దరిచేరదు. డయాబెటీస్ లేదా మధుమేహం అనేది అంటువ్యాధిలా మారిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ కంటే ఎక్కువ మంది ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఇది కుటుంబంలో ఎవరికైనా ఉంటే చాలా ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే వంశపారంపర్యంగా ఇది సోకే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ని సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. రోజురోజుకీ.. డయాబెటిస్ సమస్యతో బాధపడేవాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నెమ్మదిగా.. ఈ వ్యాధిన బారిన పడుతున్న వాళ్ల జాబితాలోకి వయసుతో సంబంధం లేకుండా.. యుక్త వయస్కులు కూడా చేరుతున్నారు.
అధిక బరువు ఉండటం, సిడెంటరీ లైఫ్ స్టైల్, వ్యాయామం చేయకపోవడం, హైక్యాలరీ ఫుడ్ తీసుకోవడం, షుగరీ, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల.. డయాబెటిస్ రిస్క్ మరింత పెరుగుతోంది. కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పుకి దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి డయాబెటిస్ రాకుండా అడ్డుకునే ఆహారంలేంటో తెలుసుకుని.. డైట్ లో చేర్చుకోండి.

పసుపు
పసుపులో ఉండే కర్యుమిన్ డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు.. పసుపు వాళ్ల భవిష్యత్ లో కూడా డయాబెటిస్ ముప్పు ఉండదని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

స్ట్రాబెర్రీస్
స్ట్రాబెర్రీస్ టేస్టీగా, డెలిషియస్ గా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తినకూడదు అనడానికి కారణాలు లేవు. స్ట్రాబెర్రీస్ ని తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ ని యాక్టివ్ చేసి.. బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకోకుండా.. అరికడుతుందని.. అధ్యయనాలు చెబుతున్నాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని వివరించారు.

పెరుగు, మీగడ
లోఫ్యాట్ మీగడ, పెరుగు తీసుకోవడం వల్ల.. హెల్తీ బ్యాక్టీరియా అందుతుంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారించే బాధ్యత నిర్వహిస్తుంది. అలాగే.. డయాబెటిస్ నుంచి దూరంగా ఉంచుతుంది.

రెడ్ వైన్
రెడ్ వైన్ లో ఉండే.. పోషకాలు.. బ్లడ్ షుగర్ ఫంక్షన్ ని మెరుగుపరిచి.. ఇన్సులిన్ హార్మోన్ ని రెగ్యులేట్ చేస్తుంది. అయితే.. మోతాదుకి మించి తాగితే ప్రమాదమే.

దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో అనేక ప్రయోజనాలు దాగున్నాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించి, ఇన్సులిన్ ని మెరుగుపరుస్తుంది. కాబట్టి.. కాఫీ, బ్రెడ్ వంటి వాటిపై కాస్త చెక్క పొడి చల్లుకుని తింటే మంచిది.

యాపిల్స్
యాపిల్స్ లో యాంథోసియానిన్ ఉంటుంది. ఇది.. బ్లడ్ షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ చేయడంలో సహాయపడుతుంది.

స్పినాచ్
స్పినాచ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి.. మనల్ని హెల్తీగా మారుస్తాయి. బ్రిటీష్ సర్వే ప్రకారం డైలీ స్పినాచ్ తీసుకోవడం వల్ల.. డయాబెటిస్ రిస్క్ ని 14 శాతం తగ్గిస్తుందట.



Click it and Unblock the Notifications