For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహ భాదితులకు సూచించబడిన పానీయాలు ఇవే!

మధుమేహ భాదితులకు సూచించబడిన పానీయాలు ఇవే!

|

ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే , ఖచ్చితంగా తీసుకునే ప్రతి ఆహారపదార్ధం పైనా శ్రద్ద ఉండాలి. అది ఎటువంటి రకానికి చెందిన ఆహారం కానీ , పానీయం కానీ ప్రతి అడుగులోనూ జాగ్రత్త తప్పనిసరి. ముఖ్యంగా వీళ్ళు తీస్కునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ శాతం , ప్రోటీన్ , మినరల్స్ , పోషకాలు, చక్కెర నిల్వలు, కాలరీలు ఇలా అన్నీ అంశాలకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. లేకపోతే చాలా సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.

అమెరికా మధుమేహ నివారణా సంస్థ నివేదికల ప్రకారం మధుమేహ రోగులు ముఖ్యంగా సున్నా కాలరీల పానీయాలు తీసుకోవలసి ఉంటుంది. వీరు తీసుకునే పానీయాలు ఏవైనా తక్కువ కాలరీలు ఉండేలా చూసుకోవడం వీరి ప్రధమ భాద్యత. ముఖ్యంగా వీరు కూల్ డ్రింక్స్, కృత్రిమ చక్కెరల పానీయాలను దరిచేరనీయకుండా చూసుకోవడం ఉత్తమం.

health tips in telugu

నివేదికలప్రకారం వీరు సోడా , కూల్ డ్రింక్స్ తీసుకోవడం వలన శరీరంలో గ్లూకోస్ శాతం పెరిగి అనేక సమస్యలు ఉత్పన్నమవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కావున వీటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా టైప్ 1 , టైప్ 2 మధుమేహ రోగులకు ఇలాంటివి ప్రతిభంధకాలుగా ఉంటాయి.

ఈ మధుమేహానికి గురైనవారికి సూచించబడిన పానీయాలు ఇవే:

కాఫీ :

కాఫీ :

2006 నివేదికలప్రకారం, పరిమిత మోతాదులో తీసుకునే కాఫీ టైప్ 2 మధుమేహ భాదితులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే chlorogenic acid రక్తం లో గ్లూకోస్ నిల్వల హెచ్చుతగ్గులను పర్యవేక్షించి నియంత్రిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ దగ్గరలో ఉన్న స్త్రీలకు కాఫీ చాలా మంచిదిగా సూచించబడినది. మరియు కాఫీలో కార్భో హైడ్రేట్స్, కాలరీల నిష్పత్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువ సేవించడం మాత్రం మంచిది కాదు. ఏదైనా పరిమితిలో ఉంటేనే అమృతం, అలా లేని పక్షంలో అమృతం కూడా విషమే.

పాలు:

పాలు:

పాలు ఎప్పటికీ ఆరోగ్యప్రదాయినే , ముఖ్యంగా టైప్ 2 మధుమేహరోగులకు మంచిది గా చెప్పబడినది. ముఖ్యంగా తక్కువ క్రొవ్వు ఉండేలా పాలపదార్ధాలు తీసుకోవడం వలన టైప్ 2 మధుమేహ రొగులు రక్తపోటుకు దూరంగా ఉండవచ్చు కూడా. కావున రోజూ వారీ ఆహారప్రణాళికలలో భాగంగా పాలను చేర్చుకోవడం ఎంతో ముఖ్యంగా సూచించబడినది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీ లో కార్భో హైడ్రేట్స్ మరియు కాలరీల శాతం తక్కువగా ఉంటుంది, కావున టైప్ 2 మధుమేహ రోగులకు సూచించదగ్గ పానీయంగా చెప్పబడింది. రోజులో కనీసం రెండు సార్లు తీసుకోవడం శ్రేయస్కరం. ఇందులో ఉన్న క్రిమిసంహారకాలు , మరియు రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు రక్తంలో గ్లూకోస్ నిల్వలను నియంత్రించుటలో ఎంతగానో సహాయం చేస్తాయి.

కాకరకాయ జ్యూస్:

కాకరకాయ జ్యూస్:

చాలామంది దగ్గర వినే ఉంటారు, మధుమేహం అంటే కాకరకాయనే సూచిస్తూ ఉంటారు. తద్వారా ఇళ్ళల్లో కాకరకాయ వారోత్సవాలు కూడా చేస్తుంటారు. అంత ప్రయోజనకారి ఈ కాకరకాయ. ఇందులో ఉండే క్రిమిసంహారకాలు, మరియు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అద్భుతం. మరియు కార్బో హైడ్రేట్లను, తక్కువ కాలరీలను కలిగి ఉన్న కారణం గా కాకరకాయ జ్యూస్ సూచించదగ్గ పానీయంగా చెప్పబడింది. మరియు, ఇది గ్లూకోస్ నిల్వలను నియంత్రించుటయే కాకుండా లిపిడ్ ప్రొఫైల్ (కొవ్వు) కూడా నియంత్రిస్తుంది.

కీరా దోస జ్యూస్:

కీరా దోస జ్యూస్:

కీర దోస లో నీటిశాతం ఎక్కువగా కాలరీలు తక్కువగా ఉంటుంది. మరియు ఇది అమినో యాసిడ్స్ , ఐరన్ , విటమిన్ a , విటమిన్ b1 , b2 , విటమిన్ C ల మిశ్రమంగా ఉంటుంది. కావున టైప్ 2 మధుమేహ రోగులకు మంచి ఆహారపదార్ధంగా సూచించబడినది. శరీరానికి కావలసిన పోషకాలను కాలరీలతో సంబంధంలేకుండా ఇవ్వగలిగిన కీరా దోస జ్యూస్ మీ ఆహారప్రణాళికలలో భాగo గా చేర్చుకోవడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

చామంతి టీ:

చామంతి టీ:

మార్కెట్లో పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోయినా సూపర్ మార్కెట్స్ లో దొరికే అధ్బుతమైన టీ పౌడర్ ఇది. కొందరు ఇళ్లలోనే తయారు చేస్తుంటారు కూడా. చామంతి టీ, రోజూవారీ తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోస్ నిల్వలు నియంత్రించబడడమే కాకుండా , కిడ్నీ నియంత్రణకు , మరియు అవయవాలకు రక్త సరఫరాలో కూడా చక్కటి పనితీరుని అందిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరంలో ఇన్సులిన్ నియంత్రణలో సహాయం చేస్తుంది. ఆహారం తీసుకున్నాక ఆహారం ద్వారా శరీరానికి అందే చక్కెర నిల్వలు నియంత్రించుటలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది శరీరంలో రక్తపోటును తగ్గించి, జీవక్రియలు మెరుగుపడడంలో సహాయం చేస్తుంది. ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి అందులో కొంచం నిమ్మరసం, లవంగాలు జోడించడం ద్వారా తీసుకోవచ్చు. ఇది మధుమేహ భాదితులకు సూచించబడిన చక్కటి పానీయం.

టెంకాయ నీళ్ళు:

టెంకాయ నీళ్ళు:

టెంకాయ నీళ్ళలో అనేకరకాల విటమిన్స్, మినరల్స్ , అమినో యాసిడ్స్ ఉంటాయి. ముఖ్యంగా 0.1 mg riboflavin, 5.8 mg vitamin C, 57.6 mg కాల్షియం , 60 mg మెగ్నీషియం , 600 mg పొటాషియం , 252 mg సోడియం , and 0.3 mg మాంగనీస్ ఉన్న కారణంగా శరీరానికి కావలసిన అన్నిరకాల పోషకాలను తక్కువ కాలరీలతో అందివ్వగలము. ఈ టెంకాయ నీళ్ళలో రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించే శక్తివంతమైన లక్షణాలు కూడా ఉన్నాయి. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూచించబడిన పానీయంగా చెప్పబడుతున్నది.

English summary

10 Healthy Drinks For Diabetes You Should Know

According to the American Diabetes Association, it is recommended to consume zero-calorie drinks. Diabetic patients should not drink a can of soda or a glass of soft drinks, as this can increase the blood glucose levels. The healthy drinks for diabetes are cucumber juice, bottle gourd juice, milk, green tea, chamomile tea, apple cider vinegar, etc.
Story first published:Tuesday, April 3, 2018, 14:35 [IST]
Desktop Bottom Promotion