For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొప్పాయి మితంగా తింటే డయాబెటిస్ ను నియంత్రించవచ్చు!!

|
Why Is Papaya Good For Diabetics? || బొప్పాయి ఎక్కువగా తినండి!!

సహజంగా ప్రకృతి అందించే చాలా రకాల పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయా సీజన్ బట్టి అందుబాటులో ఉండే అన్ని రకాల పండ్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. ఒక్కొక్కో రకమైన పండులో ఒక్కో విధమైన పోషకాలు లభ్యం అవుతాయి. కాబట్టి, సీజన్ బట్టి వచ్చే అన్ని రకాల పండ్లను తినడం మంచిది. వీటి వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. పండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యంతో పాటు శక్తి సామర్థ్యాలను పెంచడంలో సహాయపడుతాయి. కొన్ని రకాల పండ్లు ప్రత్యేకంగా కొన్ని వ్యాధులకు చికిత్సగా పనిచేస్తాయి. మరికొన్ని రకాల పండ్లు వ్యాధులను ధరి చేరనివ్వకుండా చేస్తాయి, కొన్ని వ్యాధులు నివారించబడుతాయి. అలాంటి పండ్లలో బొప్పాయి ఒకటి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు తినే ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు చాలా ఎక్కువ ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వారు కొన్ని ఆహారాన్ని తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించలేరు. ముఖ్యంగా ఎక్కువ తీపి ఉన్న పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులు తిన దగినవి కావు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు తినడానికి ఎంపిక చేసుకోవడానికి కొన్నిరకాల పండ్లు ఉన్నాయి. వాటిలో బొప్పాయి ఒకటి. ఇతర పండ్లతో పోలిస్తే బొప్పాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన పండు మరియు డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బొప్పాయి మితంగా తింటే డయాబెటిస్ ను నియంత్రించవచ్చు

కొన్నిసార్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బంది ఉంటుంది. ఈ సమయంలో బొప్పాయి డయాబెటిస్ లక్షణాలను సమర్థవంతంగా నిర్వహించగలదు. బొప్పాయి యొక్క ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇతరులకు మాదిరిగానే డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడతాయి. డయాబెటిక్ వారి కోసం బొప్పాయి: డయాబెటిస్ ను నియంత్రించడంలో ఎలా సహాయపడుతుందో ఇక్కడ మీరు తెలుసుకోండి.

బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

బొప్పాయిలో లభించే వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు మధుమేహ వ్యాధిగ్రస్తుల ఎంపికకు కారణమవుతాయి. డయాబెటిస్ ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నప్పటికీ, బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు ఆ రోగాలను సహజంగా నయం చేయడంలో సహాయపడతాయి.

బొప్పాయిలో తక్కువ కేలరీలు ఉంటాయి

బొప్పాయిలో తక్కువ కేలరీలు ఉంటాయి

ఊబకాయం మధుమేహం భారిన పడటాన్ని వేగవంతం చేస్తుంది. కాబట్టి బొప్పాయిని క్రమం తప్పకుండా మితంగా తినడం మంచి ఎంపిక. ఇందులో కేలరీలు తక్కువగా ఉన్నందున, బొప్పాయి బరువు పెరగనివ్వదు. కాబట్టి, మధుమేహం ఉన్న వారు, లేని వారు కూడా నిస్సందేహంగా బొప్పాయిని మితంగా తినవచ్చు.

బొప్పాయిలో ఫైబర్ ఉంటుంది

బొప్పాయిలో ఫైబర్ ఉంటుంది

మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంలో తగినంత ఫైబర్ ఉండాలి. కరిగే ఫైబర్ మరియు కరగని ఫైబర్, రెండూ జీర్ణక్రియను సులభతరం చేస్తాయి మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. మీ రోజువారీ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవడం వల్ల ఉత్తమైన ఫైబర్ కంటెంట్ ను పొందవచ్చు. దీని ద్వారా అనవసరమైన ఆహారాన్ని తినకుండా నిరోధించవచ్చు. అంతేకాక, ఇది ప్రేగులలో ఆహార కదలికను సులభతరం చేస్తుంది మరియు ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది.

మీరు డయాబెటిక్ అయితే

మీరు డయాబెటిక్ అయితే

మీరు డయాబెటిక్ అయితే, బొప్పాయిని మీ రెండు ప్రధాన భోజనాల మధ్య చిరుతిండిగా తినడం అత్యుత్తమ ఎంపిక అవుతుంది. అయితే, బొప్పాయిని ఈ సమయంలో ఒక పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. పొప్పాయిలోనూ సహజ చక్కెరలు ఉన్నందున పెద్ద మొత్తంలో తినకూడదు.

English summary

Papaya for Diabetes: Here's how it can help you manage diabetes

Diabetic patient should be very careful about what to eat and what not to. He or she has to think about the effect of the food consumed on blood sugar levels. Diabetic friendly fruits are also a great option which you can choose. When it comes to summer fruits, papaya is one such fruit which will can help you control diabetes as well.
Story first published: Friday, September 13, 2019, 19:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more