Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
7 కష్టంగా జీర్ణం అయ్యే ఆహారాలు!

కష్టంగా జీర్ణం అయ్యే 7 ఆహారాలు
1. బాగా వేయించిన ఆహారాలు - బాగా వేయించిన వేపుడు పదార్ధాలు అజీర్ణం కలిగిస్తాయి. నూనెలో వేయించిన ఆహారాలు చాలా కష్టంగా జీర్ణం అవుతాయి. ఎందుకంటే వాటిలో అధిక నూనె వుంటుంది. అంతేకాక బయట తినే బజ్జీల వంటివి వేయించేటపుడు, వారు అనారోగ్య నూనె లేదా బాగా మరిగిన నూనె అనేక మార్లు ఉపయోగించటం చేస్తారు. అది మీ జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది.
2. మసాలా ఆహారాలు - పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివాటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కనుక ఆరోగ్యానికి మంచివే. కాని అవి కూడా అజీర్ణం కలిగిస్తాయి. నాలిక మండించే ఈ ఆహారాలు మీ ఆహార గొట్టాన్ని కూడా మండించి గుండెమంట కలిగిస్తాయి.
3. పాలలోని షుగర్ పడకపోవటం - లాక్టోస్ అనేది పాలలో వుండే ఒక రకమైన షుగర్. ఇది పాల ఉత్పత్తి. సాధారణంగా 70 శాతం పెద్ద వారికి ఎంతో కొంత లాక్టోస్ సరిపడకపోవటం వుంటుంది లేదా లాక్టోస్ కల ఆహారాలు జీర్ణించుకోలేరు. ఎందుకంటే లాక్టోస్ జీర్ణం చేయగల ఎంజైములు వారిలో లేకపోవటం లేదా అతి తక్కువగా ఉత్పత్తి అవటం జరుగుతుంది.
4. ఆకు కూరలు - కేబేజి, బ్రక్కోలి, ముల్లంగి వంటివి బరువైన ఆహారాలు. ఎందుకంటే, అవి త్వరగా జీర్నం కావు. వీటిలో ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం వుంటుంది. ఈ రకమైన ఆహారాలు జీర్ణం చేయటానికి అవసరమైన లాక్టేస్ మానవులలో వుండదు. అందుకని, ఈ ఆహారాలు తింటే అవి జీర్ణం కాకుండానే చిన్న పేగులలోకి వెళ్ళిపోతాయి. అక్కడ గ్యాస్ తయారై అజీర్ణ ఆహారంతో బాక్టీరియా బలపడుతుంది.
5. గింజ ధాన్యాలు - పప్పులు, రాజ్మా, కిడ్నీ బీన్స్, గింజలు వంటివి పొట్టకు బరువే. వీటిలో కూడా ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం వుంటుంది.
6. సిట్రస్ పండ్ల రసాలు - సిట్రస్ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహార గొట్టం కణాలను ఇబ్బందిపెట్టి ఆహారం వెలుపలికి వచ్చేలాచేస్తాయి. ప్రత్యేకించి వీటిని సరైన సమయంలోనే తీసుకోవాలి. ఉదాహరణకు ఖాళీ పొట్టతో సిట్రస్ పండ్లు లేదా రసాలు తీసుకోరాదు.
7. విత్తన ఆహారాలు - విత్తనాల ఆహారాలు ఏవైనప్పటికి పొట్టకు బరువే. విత్తనాలకంటే కూడా ముందుగానే ఆహారం జీర్నం అయిపోతుంది. టమాటా, వంకాయ, పచ్చిమిరప వంటివాటి గింజలు లోపల జీర్ణం కాకుండానే పేగుల ద్వారా ప్రయాణించి మలంలో బయటకు విసర్జించబడటం చూస్తూనే వుంటాము.
ఈ ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. కాని అవి తినటం మానరాదు. ఎందుకంటే మీ ఆరోగ్యానికి అవికూడా అవసరమే. అయితే, గుండెకు మంట కలుగకనుండా వాటిని తక్కువ మొత్తాలలో తినండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications