Latest Updates
-
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా?
పండ్లు, కూరలు తింటే కేన్సర్ మాయం!

బ్రిటన్ దేశంలో నిర్వహించిన ఒక సర్వేలో అక్కడి ప్రజలలో ప్రతి అయిదుగురిలో ఒకరు మాత్రమే పండ్లు , కూరగాయలు సిఫార్సు చేసిన స్ధాయిలో తింటున్నట్లు ప్రపంచ కేన్సర్ పరిశోధనా సంస్ధ తెలిపినట్లు రీసెర్చి వెల్లడించింది. వృక్ష సంపద ఆహారమైన గింజలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు కేన్సర్ రిస్కు తగ్గిస్తాయని, వీటిని తరచుగాను అధికంగాను లేదా సిఫార్సు చేసిన స్ధాయిలో కనుక తింటే వారికి ఏ రకమైన కేన్సర్ వచ్చే అవకాశం లేదని రీసెర్చర్లు తెలిపారు. పీచు అధికంగా వుండే ఆహారాలు, పేగు కేన్సర్ నివారణకు కూడా తోడ్పడతాయని సంస్ధ పరిశోధకులు కాటే మెండోజా వెల్లడించినట్లు డెయిలీ ఎక్స్ ప్రెస్ ప్రచురించింది.
కేన్సర్ అరికట్టే వారోత్సవం సందర్భంగా వీరు షుమారు 2,128 మంది వ్యక్తులను పరిశోధించారు. బ్రిటన్ దేశ జనాభాలో షుమారు 22 శాతం మంది రోజుకు అయిదు లేదా అంతకుమించిన పండ్లు, కూరగాయలు తింటే వారిలో 17 శాతం మంది మాత్రమే దిగువ ఆదాయవర్గాలవారు వీటిపై తమ సొమ్ము వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
ఉత్తర ఇంగ్లాండ్ దేశంలో అయితే, పండ్లు, కూరల వాడకం మరింత తక్కువగా వుందట. ఈ ప్రాంత ప్రజలలో షుమారు 18 శాతంమంది మాత్రమే వీటిని తింటున్నారని సర్వే చెపుతోంది. అయితే, దక్షిణ ఇంగ్లాండ్ దేశ ప్రజలు మాత్రం 26 శాతంగా అయిదు భాగాల పండ్లు, కూరగాయలను తింటున్నట్లు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications