Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
బరువు తగ్గటమే కాదు.... సాయంత్రం వరకు అధిక శక్తి?
తక్షణ శక్తి పొందాలంటే ప్రతిరోజూ ఆహారంలో మీ బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉండకండి. మరి ప్రతిరోజూ తినే ఈ బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి? మహిళకు ఉదయం అల్పాహారంలో ఏం చేయాలనేది ఎపుడూ ఒక సమస్యే. ఏ ఆరోగ్య పత్రికలు చూసినా బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు, బ్రెడ్డు, కొన్ని గించ ధాన్యాల ఆహారం తినండి అంటారు. మంచి పోషకాలు కల బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి అనేది పరిశీలించండి. ఇది పూర్తిగా భారతీయ వంటకం, గంటల తరబడి వంటగదిలో ఇద్దరూ కలసి చేయనవసరం లేదు. తేలికగా తయారు చేసుకొని తిని ఆనందించేయవచ్చు. ఆరోగ్యకరమైన జీవన విధానంలో ప్రత్యేకించి బరువు తగ్గాలంటూ కోరేవారికి ఈ భారతీయ వంటకాలు ఎంతో ఆరోగ్యం, రుచి కలిగిస్తాయి. అందుకుగాను కొన్ని సూచనలు చూడండి.

వేడి వేడి మసాలా వడ - వేడి వేడి మసాలా వడనను సాంబార్ మరియు కొబ్బరి చట్నీలతో కలసి తింటే ఎంతో బాగుంటుంది. మసాలా వడ అనేది చిన్న సైజులో ఎర్రగా ఆకర్షణీయంగా గుండ్రంగా ఉండి తినేటందుకు తేలికగా ఉంటుంది. దీనిలో ఉండేది శనగపప్పు,శనగలు, కొన్ని కరివేపాకులు, అల్లం, మరియు పచ్చి మిరపకాయలు మాత్రమే. కొబ్బరి చట్నీ కూడా అధిక కేలరీలు ఇస్తుంది. కనుక దానిని మితంగా తినండి. లేదా టమాటా లేదా కొత్తిమీర చట్నీ గా కూడా చేయవచ్చు. వడ ఎలా తయారు చేయాలి? శనగపప్పును నీటిలో నానపెట్టండి. దానిని బాగా గ్రైండర్ లో పేస్ట్ లా చేసి అందులో మిరపకాయ, అల్లం, కరివేపాకు వంటివి కలపండి. ఈ మిశ్రమాన్ని గుండ్రంగా తయారు చేసి నూనెలో అవి ఎర్రగా వేగేటంతవరకు వేయించండి.
ఆయిల్ లేని పరోటా - రెండు కప్పుల గోధుమ పిండి, ఒక కప్పు నీరు, ఉడికించిన బంగాళ దుంప ఒకటి, కారం, ఉప్పు తగినంత, రుచికి ఛాట్ మసాలా కావాలి. ఎలా తయారు చేయాలి? నీరు గోధుమ పిండి బాగా కలపండి. మెత్తటి పిండి తయారవుతుంది. ఈ పిండిని చిన్న గుండ్రపాటి ముద్దలు చేసి రొట్టెల వలే తయారు చేయండి. ఈ రొట్టెకే బంగాళ దుంపలు ఉడికించిన కూర పెట్టి పెనంపై బాగా వేడి చేయండి. రెండు వేపులా ఎర్రగా కాల్చండి. బంగాళదుంప కుర్మా కు బదులుగా కొన్ని పోషక విలువలు కల కేబేజి, కాలీ ఫ్లవర్ లేదా ఇతర ఆకు కూరలు కూడా ఈ పరోటాలపై పెట్టి కాల్చి తినవచ్చు.
చింతపండు లేదా నిమ్మకాయ పులిహోర - సాదారణంగా మనం పులిహోరలను రకరకాలుగా చేసుకొంటాము. భారతీయ వంటకాల్లో ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో పులిహోర కూడా ఉంటుంది. అయితే టామరిండ్ పులిహోర కూడా ఒక మంచి బ్రేక్ ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఇది పుల్లగా మరియు కారం కారంగా నోరూరిస్తూంటుంది. ఇందులో కొన్ని సువాసనలిచ్చే పదార్థాలను చేర్చడం వల్ల రుచితో పాటు సువాసన కూడా బాగుంటుంది. చింతపండును ఉపయోగించడం వల్ల అందులో ఎక్కువగా మినరల్స్ , విటమిన్స్, జీర్ణశక్తికి ఉపయోగపడే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చింతపండు స్ధానంలో నిమ్మకాయ రసాన్ని కూడా ఉపయోగించి చక్కని విటమిన్ సి పొందవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అంతే కాకుండా ఇందులో చాలా విటమిన్లు ఉంటయి. విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. దీనికిగాను రెండు కప్పుల తెల్లటి బియ్యం, చింతపండు పులుసు కొద్దిగా, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, పల్లీలు, జీడిపప్పు, ఆవాలు, శనగపప్పు అన్ని కొద్ది కొద్దిగా ఉంటే చాలు. ముందుగా బియ్యం నానపెట్టి అన్నంలా అంటే మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా తయారు చేయాలి. దానికి చింతపండు పులుసు కలిపి పోపు పెట్టాలి. చింతపండు ఉపయోగించని వారు నిమ్మ రసాన్ని వాడి పులుపు పొందవచ్చు. ఆ మిశ్రమంలో, వేయించిన పల్లీలు, జీడిపప్పు, పచ్చి మిరప కలపాలి. ఇక మీ పులిహోర రెడీ అయిపోయినట్లే.
ఉదయంవేళ ఆఫీసులకు లేదా ఇతర వ్యాపారాలకు త్వర త్వరగా వెళ్ళాలంటే, ఈ రకమైన ఆహారాలు ఇద్దరూ కలసి తేలికగా తయారు చేసుకొని తమ బ్రేక్ ఫాస్ట్ ముగించేయవచ్చు. వీటిలో మంచి పోషకాలు కూడా అందుతాయి. చేయటం తేలిక, వెరైటీగా తిన్నట్లుగా కూడా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications