Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఫలితం అధికం - తినటం తేలిక!

పండ్ల రసాల వలన ప్రయోజనాలు అనేకం. సాధారణంగా సెలిబ్రిటీలు, మోడల్స్, సైజ్ జీరో అవ్వాలనుకునేవారంతా పండ్లు, కూరల రసాలు ఆహారం బదులుగా 4 లేదా 5 వారాలపాటు తాగి బరువు తగ్గించేసుకుంటారు. కొంతమందికి 4 మరికొంతమంది 5 లేదా 6 కిలోల బరువు కూడా తగ్గిపోతూంటుంది. మీరు తీసుకునే పండ్ల రసాలు మీ పోషకాహార నిపుణుడి సలహాపై వుండాలి. రసాల ఆహారం మీ జీర్ణ వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలినాలు వెలికి తీస్తుంది. చర్మం మెరిసేలా, తల వెంట్రుకలు బలపడేలా చేస్తుంది.
రసాల ఆహారం కండ్లకు కూడా మేలు చేస్తుంది. చూపు మెరుగవటం, గోళ్ళు గట్టిపడటం, శరీరం దుర్గంధం లేకుండా చేయటం, శరీరంలో ఎపుడూ తేమ వుండేలా చేయటం చేసి చర్మాన్ని సంరక్షిస్తుంది. రసాల ఆహారంపై వుంటే మీరు ఉపవాసం చేసినట్లే లెక్క. కాని అపుడపుడూ కోసిన పండ్లు కూడా తీసుకోవటం మంచిది.
రసాల ఆహారంపై వుండే వారు, ఎపుడు తీసుకున్నా తాజా పండ్ల రసం లేదా కూరల రసం తీసుకోవాలి.
ప్యాకేజీ పండ్ల రసాలలో కృత్రిమ రంగులు, వాసనలు వుంటాయి. ఇవి మీ బరువును పెంచటమే కాక బ్లడ్ షుగర్ స్ధాయి పెంచుతాయి.కనుక ఆరోగ్యంగా వుండాలంటే సహజ పండ్ల రసాలే తీసుకోండి. నిమ్మజాతి పండ్లు రసాలు కొవ్వును తేలికగా కరిగిస్తాయి. నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష, బెర్రీ మొదలైన పండ్లు రసంగా తాగవచ్చు. వెజిటబుల్ జ్యూస్ లో మంచి పోషకాలుంటాయి. కడుపు నింపుతుంది. బరువు తగ్గటమే కాదు. చర్మకాంతి పెరుగుతుంది. కాకర, కేరట్, గుమ్మడి, మొదలైన కూరల రసాలు తాగవచ్చు.
పండ్లు, ఉడికించిన కూరలు - అప్పటికపుడు కోసిన పండ్లు లేదా ఉడికించిన కూరలు కూడా మీ రసాల ఆహార ప్రణాళికలో లేనప్పటికి తీసుకోవచ్చు. ఇది మీ శరీరం బలహీనపడకుండా చేసై్తుంది. ఆకలి వేయకుండా కడుపు నింపుతుంది. కొంతమంది పెరుగు తినటానికి కూడా ఇష్టపడతారు.
ఇవన్నీ రసాల ఆహారం తినటం వలన వచ్చే ప్రయోజనాలు
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
