Latest Updates
-
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం!
తియ్యటి మాటలే కాదు.... వీటిని తినిపించండి!
సాధారణంగా వంట గదిలో ఏ వంటకంలో తీపి వేయాలన్నాషుగర్ టిన్ లోకి చేయి వెళ్ళిపోతుంది. ఎపుడూ తీపి తినటానికి ఇష్టపడేవారికి ఆ డబ్బా దగ్గర లేకుంటే ఎంతో సమస్యగా ఉంటుంది. అది వుండి వాడుతూంటే సమస్యలు మరింత అధికంగా ఉంటాయి. వాటిలో ఊబకాయం ఒకటి. మరి మీరు డయాబెటిక్ లేదా బరువు తగ్గాలని అనుకుంటున్నంత మాత్రాన జీవితాంతం తీపికి దూరంగా ఉండాల్సిన పనిలేదు. మేము పేర్కొనే సహజ తీపి పదార్ధాలను మీ ఆహారంలో చేర్చి తియ్యగా ఏ సమస్యా లేకుండా వంటకాలన్ని ఆనందించేయండి.

మీ ఆహారంలో ఆరోగ్యకరమైన తీపి పదార్ధాలను వేయటం మీకు గల తీపి తినాలనే వాంఛను ఎట్టి హాని లేకుండా తీర్చేస్తుంది. ఇవి సహజ పదార్ధాలు కనుక సమస్య ఉండదు. ఉన్నా ఎంతో అరుదుగా అనారోగ్యం ఇస్తాయి. కనుక ఈ సహజ తీపి పదార్ధాలను గుర్తుపెట్టుకోండి.
1. బెల్లం - మీ రోజువారీ ఆహారంలో పంచదారకు బదులుగా బెల్లాన్ని వాడండి. ఎంతో మంచిది. వాస్తవానికి ప్రాచీన కాలంలో భారతదేశంలోని వంటకాలలో బెల్లాన్ని అధికంగా వాడేవారు. తర్వాతి రోజులలోనే పంచదార లేదా షుగర్ వెలుగులోకి వచ్చి స్వీట్లు తయారు చేస్తున్నారు. పలుకులుగా ఉండే షుగర్ చైనా నుండి ఇండియాకు వచ్చి హింది భాషలో ఛిని అనే పేరు కూడా పడింది. బెల్లం చెరకు రసాన్నించి తయారు చేస్తారు లేద తాటి పండ్లనుండి కూడా తయారు చేస్తారు. షుగర్ కంటే తక్కువ రిఫైనింగ్ చేయటం వలన, దీనిలో కార్బోహైడ్రేట్లు, పీచులు కూడా ఉంటాయి. ఫ్రక్టోస్ అనే ఫ్రూట్ షుగర్ ఉంటుంది. ఆరోగ్యకరమైనది.
2. తేనె - తేనెను తీపి వస్తువుగా వాడేస్తే అది మీ బరువును నియంత్రించటమే కాదు, తగ్గేలా కూడా చేస్తుంది. వేడి నీటిలో ఒక స్పూన్ తేనె వేసుకుని తాగితే వేగంగా బరువు తగ్గుతారు. తేనె తాగితో అది మీ దగ్గు రొంప, ఇతర చిన్నపాటి అలర్జీలను నివారిస్తుంది. చర్మానికి తేనె ఎంతో మేలు చేస్తుంది. మీ వంటకాలు, పానీయాలలో షుగర్ కు బదులు తేనె వేసి తేడా చూడండి. గ్రీన్ టీ లో వేసే హనీ డైటర్లకు ఎంతో మేలు చేస్తుంది.
3. డ్రై ఫ్రూట్స్ - కస్టర్డ్ లేదా పాయసం తాగాలా? ఆర్టిఫిషియల్ ఛాక్రెన్ వంటివి వేసేకంటే, మీ వంటకానికి తక్కువ కేలరీలు కల ఎండు ఫలాలను వేయండి. ఒక గుప్పెడు కిస్ మిస్, ఖర్చూరం లేదా జీడిపప్పు వంటివి మంచి రుచినిస్తాయి. తీపిగాను ఉంటాయి. కేలరీలు చేరవు.
4. ఖర్జూర పండు - ఇవి ఎండువి లేదా పండువి ఎలా వాడినప్పటికి షుగర్ స్ధానంలో ధారాళంగా వాడి మీ వంటకాలకు తీపిని తీసుకురావచ్చు. ఇవి ఎంతో ఎనర్జీని అందిస్తాయి. వీటిలో ఐరన్ కూడా ఉండి మీకు బలాన్నిస్తుంది. వర్కవుట్ల తర్వాత స్వీట్ తినాలనుకునేవారను ఖర్జూర పండును తినేయండి.
5. పండ్లు - పండ్లలో ఉండే తీపి ఎంతో మంచిది. కావలసినంత పీచు కూడా ఉండి, విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ఆపిల్, మామిడిపండు వంటివి ఆరోగ్యకరమైన తీపి కలిగి ఉంటాయి. వీటితో పాయసం లేదా ఇతర వంటకాలు, అరటి పండు రసం, వంటి రసాలు చేసుకుని తాగితే షుగర్ కల పానీయాల తీపికంటే కూడా ఇవి ఎంతో బాగుంటాయి.
తియ్యగా తింటూనే ఆరోగ్యం కాపాడుకోవాలంటే, ఈ అయిదు సహజ తీపి వస్తువులు తిని ఆనందించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications