Latest Updates
-
మీ భార్యతో ఆ సమయంలోనే ప్రేమగా ఉంటున్నారా.. అది ఎంత పెద్ద తప్పో తెలుసా.? -
కత్రినా కైఫ్ నాజూకైన అందం వెనుక ఉన్న స్పెషల్ డ్రింక్ ఇదే..ఎలా చేసుకోవాలంటే.. -
కిడ్నీల పనితీరు బాగాలేదని తెలిపే ఐదు హెచ్చరిక సంకేతాలు.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.! -
కొందరికి ఫ్రెండ్స్ ఎందుకు ఉండరు? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే! -
వర్షాకాలంలో వీటిని మాత్రమే తింటే సరిపోదు.. బీపీ, డయాబెటిస్ రోగులకు మేలు చేసే సూపర్ ఫుడ్స్.! -
కండరాల పుష్టికి, బరువు తగ్గడానికి బెస్ట్..హై ప్రోటీన్ సోయా పోహా చేసుకోండిలా.. -
జులై 29న ‘గురు పౌర్ణమి’.. మీ గురువులను పూజించడమే కాదు.. వీటిని దానం చేస్తే ఎనలేని పుణ్యం.! -
ఇలా చేస్తే చైన్ స్మోకర్లు కూడా జన్మలో సిగరెట్ ముట్టుకోరు! -
రుచి, ఆరోగ్యం పంచే ఓట్స్ ఉప్మా..బొంబాయి రవ్వ ఉప్మా కంటే 10 రెట్లు రుచి! -
ఆఫీసులో గంటల తరబడి అలాగే కూర్చుంటున్నారా.. స్లిప్ డిస్క్‌తో వెన్నెముకకి ముప్పు తప్పదు.!
శారీరక శ్రమతో అరోగ్యం...యవ్వనం.. అందం..

పిండి తడిపి బాగా మెత్తగా పిసకటం, వత్తటం వేయించటం, కాల్చటం వల్ల చేతులకి వ్యాయామం అవుతుంది. అంట్లు తోమటం, బాత్రూం టైల్స్ శుభ్రం చేయటం, టబ్స్ పాచిని వదలగొట్టడం, గార్డెనింగ్, మొక్కల్ని కొమ్మలు కత్తిరించటం, నీరుపోయటం వల్ల చేతికండరాలు గట్టిపడతాయి. స్వయంగా షాపుకెళ్లి షాపింగ్ చేయటంతో మానసికంగా రిలాక్స్ అవుతారు.
సాద్యమైనంత వరకు పనిమనిషిని మానిపించి, ఆడ,మగ, పిల్ల పెద్ద ఎవరైనా సరే వారి కప్పు, గ్లాసు, కంచం తోమి కడగడం, ఎవరి బట్టలు వారు ఉతికి ఆరేయడం మొదలుపెడితే రోగాలు మటుమాయం సుమా! అలాగే చిన్నా చితకా ఆరోగ్యంగా ఉండాలంటే కుర్చీకి రెస్టు ఇవ్వాలి. ఆ...మమ్మల్ని నేలమీద కూర్చోమంటారా అని కాకుండా . అలా కుర్చీకి అతుక్కుపోతే, లాంగ్‌సిట్టర్ అయితే హార్టు, షుగర్ పేషెంట్స్ అవటం ఖాయం. డెస్క్ జాబ్ చేసే వారి సిట్టింగ్ అవర్స్ ని చూడండి. నిద్రకి ఎనిమిది గంటలు వదిలేస్తే మిగతా 90శాతం అలా కూచుని టి.వి.తో, ఆఫీసుపనితో గడిపేస్తారు. ఇలా కూచోటంతో మెటబాలిక్, కార్డియో వాస్క్యులర్ సిస్టమ్ కి నష్టం కలుగుతుంది. దీనితో హైపర్ టెన్షన్, కార్డియో వాస్కులర్ డిసీజ్, ఒబెసిటీ, టైప్-2 షుగర్, కేన్సర్ వచ్చే ఛాన్సు ఎక్కువ.
అమెరికన్ పరిశోధన ప్రకారం, అలా కుర్చీకి అతుక్కుపోవటం త్వరగా చావుని కొనితెచ్చు కోవటమే. పైగా హిప్, స్పైన్, షోల్డర్, నెక్ పెయిన్‌కి బాధ్యులం మనమే అవుతాం. కండరాలు ఒకే పొజిషన్‌కి అలవాటు పడి పూర్ బాడీ బాలెన్స్, కదలకపోవటం జరిగే ప్రమాదం ఉంది. కీ-బోర్డుపై వంగి టైపింగ్ చేస్తే అలా వంగి నడవటమే అలవాటు అవుతుంది. కాళ్లను క్రాస్ చేసి కూచుంటే హిప్, లోయర్ బాడీ ప్రభావితం అవుతుంది. మరి లాంగ్ సిట్టింగ్‌కి ఎలా బ్రేక్ ఇవ్వాలి? మొబైల్‌లో ప్రతి గంటకీ ఐదునిమిషాలు బ్రేక్ ఇవ్వాలి అనేలా అలారం సెట్ చేయాలి. టి.వి ముందు అలా కూలబడకుండా కాసేపు అటు,ఇటు నడుస్తూ కళ్లకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. కుర్చీలో కాకుండా ఎక్సర్‌సైజ్ బాల్‌పై కూచుంటే మజిల్స్ యాక్టివ్‌గా ఉంటాయి. ఫోన్‌ని ఎప్పుడూ నించునే రిసీవ్ చేసుకుని మాట్లాడండి. రెండు నిముషాలైనా నించునే ప్రయత్నం చేయాలి. ఇక కాస్త దూరం అయినా నడవటం ఫ్రెండ్స్ తో, మెసేజ్ పంపకుండా వారి దగ్గరకు వెళ్లి మాట్లాడటం చేయాలి. లిఫ్ట్‌బదులు మెట్లను ఎక్కి దిగాలి. ఇలా చేస్తే మీ శరీరాకృతి మీ చేతుల్లోనే ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications