Latest Updates
-
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.!
బెల్లీ ఫ్యాట్ కరిగించేందుకు సులభ చిట్కాలు
ప్రతి రోజూ నిద్ర లేచినప్పటిపట్టినుండి ఉరుకులు పరుగులతో ఆరోజు మొదలవుతుంది. వ్యాయామం చేసే టైం ఉండదు. ఒక వేళ చేయాలనున్నా దాన్ని కాస్త సాయంత్రానికి పోస్ట్ పోన్ చేస్తారు. అయితే ఆఫీస్ నుండి రాగేనే అలసట, చిరాకు, ఇక వీటితో ఏం వ్యాయామం.? రాత్రి అయ్యేసరికి రేపు తెల్లవారికి ఖచ్చితంగా వ్యాయామం మొదలు పెట్టాలనుకొంటారు. అయితే యాధా రాజ తధా ప్రజా అన్నట్లు మళ్ళ మరుసటి రోజు ఇంత ఉదయాన్నే ఎవరు నిద్రలేస్తారు.. మరికొంత సేపు నిద్రపోదామనే బద్దకస్తులు చాలా మందే ఉంటారు. నిద్రకు ఇచ్చే సమయాన్ని ఆరోగ్యం మీద కొంతైనా వెచ్చించరు. ఇలా ఏదో ఒక రకంగా ప్రస్తుతానికి వ్యాయామం గురించి మర్చిపోయినా.. ఏదో ఒక రోజు దాని పర్యవ్యసనం తప్పక అనుభవించక తప్పదు.
ఎందుకంటే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఊబకాయులుగా మారుతుంటే, మరికొందరేమో పొట్ట పెంచేస్తున్నారు. తర్వాత ఈ పొట్టను, చిరు బొజ్జలను కరిగించే మార్గమేది? అని చింతిస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం.. వీటిని కనుక క్రమం తప్పక పాటించినట్లైతే చిరు బొజ్జ గురించి చింతించే అవసరం ఉండదు. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం...

మ్యాజిక్ అవర్ అంటే ఏ సమయంలో ఏం తినాలి అనేదే మ్యాజిక్. ప్రోటీనులు అధికంగా ఉన్న స్నాక్స్ (ప్రోటీన్ బార్, లోఫ్యాట్ ఛీజ్ లేదా కొన్ని బాదాంలు, ఆపిల్ )ను 3-4గంట మధ్య తప్పనిసరిగా తినాలి. ఇలా ఈ సమయంలో తినడం వల్ల వరీరానికి జీవక్రియకు కావల్సిన శక్తిని అందించి శరీరంలోని చక్కెర స్థాయిని బ్యాలెస్ గా ఉంచుతుంది. అంతే కాకుండా ప్రతి నాలుగు గంటలకు ఒక సారి తినడం వల్ల శరీరంలో చక్కర స్థాయిలు నిర్ధిష్టంగా ఉండే కొవ్వును పెరగనివ్వకుండా చేస్తుంది.

బాల్ వ్యాయమం అంటే బాల్ మార్చు విధానం వారంలో మూడు సార్లన్నా చేయాలి. వెల్లికిలా పడుకొని తల దగ్గర కొంచెం దూరంలో ఉన్న బాల్ ను రెండు చేతులతో పైకి ఎత్తుకోవాలి. ఆ బాల్ ను రెండు చేతులతో అలాగే ముఖం మీద నేరుగా కాళ్ళ వరకూ తీసుకొచ్చి పాదాలను తాకేలా చేయాలి. అలాగే రివర్స్ తో తిరిగి కాలుతో బాల్ పట్టుకొని కాలు పైకి లేపుతూ బాల్ ను చేతికి అందించి బాల్ ఎక్కడ నుండి తీసారో అక్కడికి చేర్చాలి. ఇలా 10-12సార్లు బాల్ ఎక్స్ చేయింజ్ చేయాలి. (ఈ బాల్ వ్యాయామం పూర్తిగా పడుకొని వీపును భూమికి ఆన్చి మాత్రమే చేయాలి. ఏ మాత్రం పైకి లేవకూడదు).

జీరో గ్రాం ఆఫ్ షుగర్ అంటే ప్రతి రోజూ ఉదయం లేచిన దగ్గర నుండి కాఫీ మొదలు చక్కర కలిసిన పదార్థాలు, స్నాక్స్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇలా ఉన్నట్లైతే ఇన్సులిన్ లెవల్స్ ను తగ్గించి గ్లూకోగాన్ ను ఎక్కువ చేస్తుంది గ్లూకగాన్ అనేది ఓ హార్మోన్. ఫ్లాట్ బెల్లీ కరిగించుకోవాలనుకొనే వారు తప్పనిసరిగా చక్కర పదార్థాలకు దూరంగా ఉండాలి.

ప్రతి రోజూ తీసుకొనే ఆహారాన్ని చిన్న మొత్తంలో నిదానంగా బాగా నమిలి తినడం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. దాంతో పొట్ట గ్యాస్ సమస్యను, కడుపు ఉబ్బరాన్ని తగ్గించవచ్చు.

టమ్మీ ఫ్యాట్ కు ముఖ్య కారణం ఉప్పు. సోడియం మోతాదు తక్కువగా ఉన్న సీ సాల్ట్ ను ఉపయోగించాలి. సలాడ్లు వంటి వాటికి ఉప్పుకు బదులు లో సోడియం సోయా సాస్ ను ఉపయోగించవచ్చు.

జీర్ణక్రియకు కష్టం కలిగించే కొవ్వు కలిగిని ఆహారాలకు బదులు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. తీసుకొనే ఆహారంలో ధాన్యాహారం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మోనో సాచురేటెడ్ ఆహారం తీసుకోవడం వల్ల బెల్లీ ప్యాట్ ను అతిసులభంగా తగ్గించవచ్చు.



Click it and Unblock the Notifications