కాబోయే పెళ్ళి కుమార్తెను.. స్లిమ్ గా.. సెక్సీగా మార్చే డైయట్ ఫుడ్...

పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. పెళ్లికి కొంతమంది చేసే హడావిడి అంతాఇంతా కాదు. అలాంటి అపురూప క్షణాల్లో పెళ్ళికి వచ్చిన బంధు మిత్రుల సపరివారానికి నవ వధూవరులు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం. అమ్మాయిలు కూడా పెళ్లి కుదిరిన సంబరంలో ఒక్కసారిగా కొవ్వు పదార్థాలు అధికశాతంలో ఉన్న ఆహారం తీసుకుని మరీ లావెక్కిపోతారు. ఎప్పుడో ఎంగేజ్మెంట్లో మల్లెతీగలా కనిపించిన పెళ్లి కూతురు ఒక్కసారిగా పదికిలోలు పెరిగి పెళ్లికూతురుగా బొద్దుగా కనిపించేసరికి పెళ్లికొడుకు అతని తాలూకు బంధువులు అవాక్కయిపోతారు. మరికొందరు పెళ్లి కుదిరిందని మరింత అందంగా కనిపించాలని ఉపవాసాలతో మరీ డైటింగ్ చేసి పెళ్లి సమయానికి నీరస పడిపోవడమో లేక పేషెంట్లానో తయారవుతుంటారు. పెళ్లిలో తప్పనిసరిగా తీసే వీడియో, కెమెరాలలో పెళ్లి కూతుళ్లు అందవిహీనంగా కనిపిస్తుంటారు. మరి ఆ ఫొటోలు, వీడియోలు జీవితాంతం చూసుకోవాల్సిన తీపిగుర్తులు. ఒకరి కోసం కాకపోయినా మనకోసమైనా జాగ్రత్తపడాలి.

పెళ్ళికి ముందు ఎటువంటి ఆహార తీసుకోవాలి. ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి అనేదాని మీద అవగాహాన కల్పించుకోండి. కాబట్టి కాబోయే పెళ్ళికూతరు కోసం కొన్ని డైయట్ ఫ్లాన్ టిప్స్...కాబోయే పెళ్ళి కూతురుకి డైయట్ చాలా అవసరం. ప్రతి రోజూ తినే ఆహారంతో పాటు ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని పాలను తాగితే మంచి నిద్ర వస్తుంది. సరైన నిద్ర లేకుంటే కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడి చూడటానికి అసహ్యంగా తయారవుతారు.

గ్రీన్ వెజిటేబుల్స్

గ్రీన్ వెజిటేబుల్స్

ఆరోగ్యకరమైన డయట్ అంటే అది గ్రీన్ వెజిటేబుల్స్ తోనే సాధ్యం. ఎందుకంటే ఇందులో విటమిన్స్, న్యూట్రిషియన్స్, మరియు ప్రోటీనులు అధికంగా ఉంటాయి. బ్రొకోలీ, క్యాబేజీ వంటివాటిలో ఎక్కువగా ల్యూటినా ఉండటం వల్ల చర్మాన్ని బిగుతుగా ఉంచి చర్మం ప్రకాశావంతంగా మెరిసేలా చేస్తాయి.

గ్రేఫ్ ఫ్రూట్ (సిట్రస్ పండ్లు)

గ్రేఫ్ ఫ్రూట్ (సిట్రస్ పండ్లు)

తినడానికి కొంచెం పుల్లగా ఉండేటటువంటి సిట్రస్ పండ్లు ద్రాక్ష, ఆరెంజ్. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ కు గురికాకుండా కాపాడుతాయి. అంతే కాకుండా వత్తిడిని తగ్గించి బరువును తగ్గిస్తాయి. కాబట్టి రెడ్ లేదా పింక్ గ్రేప్స్ ను పెళ్ళికి ముందు బాగా తినాలి.

బీట్ రూట్

బీట్ రూట్

బీట్ రూట్ లో విటమిన్ సి, బిసి, బి3 మరియు బీటాకెరోటిన్ అధికంగా ఉంటుంది. రక్తకణాలను అధికంగా చేసి చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. దాంతో శరీరంలోని విషాలు బయటకు పంపబడుతుంది. కాబట్టి బీట్ రూట్ ను పచ్చివి లేదా జ్యూస్ చేసి తీసుకోవచ్చు.

తేనె

తేనె

బరువు తగ్గించటంలో అద్భుతంగా పనిచేసే పదార్థాల్లో అత్యద్భుతమైన ఆహారం తేనె. పెళ్ళి ముందు త్వరగా బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వేడి నిమ్మరసం లేదా జ్యూస్ లో కొద్దిగా తేనె కలుపుకొని పరకడుపున తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ

ముఖ చర్మం ఆరోగ్యంగా... కాంతి వంతంగా కనబడాలంటే రెడ్ కలర్ స్ట్రాబెర్రీస్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఇది బరువు తగ్గించడమే కాకుండా సౌందర్యాన్ని పెంపొదిస్తుంది.

రెడ్ మిర్చి

రెడ్ మిర్చి

ఫాట్ బర్నింగ్ స్పైసీ ఫుడ్ లో రెడ్ మిర్చి కూడా ఒకటి. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేందుకు బాగా సహకరిస్తుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో రెడ్ చిల్లి ఉండేలా చూసుకోవాలి.

గుడ్లు

గుడ్లు

డైరీ ప్రొడక్ట్స్ కొంత వరకూ బరువును తగ్గించడానికి ఉపయోగపడుతాయి. గుడ్డు తినడం వల్ల ఆకలి కాకుండా చేస్తుంది. కాబట్టి గుడ్డును పచ్చసొన లేకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి, శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతంది.

నిమ్మకాయ

నిమ్మకాయ

నిమ్మకాయం ఆరోగ్యప్రధాయని అని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఔషదగుణాలు ఎక్కువ. బరువును తగ్గిస్తుంది. అరగ్లాసు వేడినీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు.

నీళ్ళు

నీళ్ళు

ఇది ఘనాహారం కాకపోయినా చాలా ఆరోగ్యకరమైన ద్రవాహారం. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీంలోని విషాలను బయటకు చెమట, యూరిన్ రూపంలో పంపి చర్మాన్ని శుభ్రం చేసి, శరీరానికి కావలసినంత తేమను అంధిస్తుంది.

బ్లోటింగ్

బ్లోటింగ్

పెళ్ళికి ముందే అధిక పొట్ట, గ్యాస్ట్రిక్ సమస్య, పొట్టనొప్పి వంటి సమస్యలను దూరం చేసుకోవాలి. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించుకోవాలి. అందుకు సరైన ఆహారం తీసుకోవాలి. గ్యాస్ ను ఉత్పత్తి చేసే ఆహారాలకు దూరంగా ఉండాలి.

కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆయిల్‌ పదార్థాలు, స్వీట్ల జోలికి మాత్రం వెళ్లకపోవడమే మంచిది. తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోండి. దోస, క్యారెట్లు, బీట్‌రూట్ లాంటివి శక్తినివ్వడమే కాదు మేనిఛాయను మెరిపిస్తాయి. నీరు పుష్కలంగా తాగండి. ఏర్పాట్ల హడావుడిలో అదేపనిగా తిరుగుతారు కాబట్టి మీ వెంట మంచినీటి సీసా ఉండి తీరాల్సిందే. దాహం అధికమనిపిస్తే కొబ్బరి బోండాం తాగాలి కానీ కూల్‌డ్రింకుల జోలికి పోకుండా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. వీలైతే పండ్ల రసాలను సేవించండి. కళ్ళ చుట్టూ నల్లని వలయాలకు క్యారెట్ రసం విరుగుడు. అయితే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల బాడీ స్లిమ్ గా మార్చుకోవచ్చు..

Desktop Bottom Promotion