Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
డైటింగ్ లో సన్న బడ్డా....?

బరువు తగ్గిన తర్వాత వీరు తాము అదే బరువులో వుండటానికిగాను తమ బరువు కల మనుషులు ఎంత తింటున్నారో లేదా అప్పటివరకు బరువు పెరగకుండా సన్నగా వున్నవారు ఏం తింటున్నారో అంతే ఆహారాలు తినాలి. వారు ఆచరించే వ్యాయామాలు చేయాలి, ఇతర జీవన విధానం పాటించాలి అని గుర్తు పెట్టుకోవాలి.మరో రకంగా చెప్పాలంటే, వీరు కనీసం రోజుకు 300 అంతకు తక్కువ కేలరీలు మాత్రమే తీసుకోవాలి.మరో మారు సన్నగానే కదా వున్నామంటూ క్రమేణా కూల్ డ్రింకులు, లేదా బేకరీ ఆహారాలు తింటూ పోతే ఫలితం వుండదు. మరోమారు లావు ఎక్కటం ఖాయంగా చెప్పవచ్చు.
న్యూయార్క్ నగరంలోని కొలంబియా యూనివర్శిటీ ప్రొఫెసర్ మైకేల్ రోజ్ సుమారుగా ఒక సంవత్సరంపాటు డైటింగ్ చేసిన వారిని పరిశీలించి, కేలరీలు అధికంగా తీసుకొనటం వలననే వీరు మరోమారు బరువు పెరిగిపోతున్నట్లు తన పరిశోధనలో నిర్ధారించారు. వారి బరువులో షుమారు 10 శాతం తగ్గించటానికిగాను ఆయన పురుషులను స్త్రీలను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు. వారి బరువులను రికార్డు చేశారు. అదే బరువు వద్ద వుండేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
డైటర్లు తాము డైటింగ్ తో సుమారు 22 శాతం తగ్గారని అయితే, తాము కోరుకునే వెయిట్ కల వారికంటే కూడా అధికంగా 300 కేలరీలు రోజుకు తగ్గించి తినటం జరిగిందని, తర్వాతి రోజులలో తమలో తగ్గిన ఈ కేలరీలను భర్తీ చేసేటందుకు మరింతగా తినటంతో మరోమారు బరువు పెరిగి పూర్వపు సైజులు సంతరించుకున్నారని తెలియపరచారు.
కనుక డైటర్లు తాము డైటింగ్ మొదలు పెట్టే ముందు, తాము కోరుకున్న బరువు కలవారు ఎంత తింటే అంతే తిని ఫలితాలను సాధించాలని, అంతకంటే తక్కువ తిన్నట్లయితే, మరల బరువు పెరిగే అవకాశం వుంటుందని, తగ్గిన బరువును నియంత్రించుకోటానికి గాను మరోమారు ఆహార నియమాలు పాటించాలని రీసెర్చర్ సూచించారు. హార్మోన్లు, మెటబాలిజం, ఆకలి వంటివి కూడా బరువు తగ్గటంలోను, ఆహారం తీసుకోవడంలోను ప్రధాన పాత్ర వహిస్తాయని, ప్రతి వారూ వాటిని కూడా పరిగణలోనికి తీసుకోవాలని ఆయన తెలిపారు.
డైటింగ్ తర్వాత బ్రెయిన్ లోని భాగాలు చాలా చురుకుగా వుండి అధిక ఆహారం కోరతాయని తెలిపారు. ఈ కారణంగా మాజీ డైటర్లు బ్రెయిన్ ను తృప్తి పరచటానికిగాను అధికంగా వారికి తెలియకుండానే తినేస్తారన్నారు. ఖర్చు చేసే ఎనర్జీ తక్కువగావుంటుంది. తినాలనే కోర్కె పెరిగిపోతుంది. అయితే, బరువు తగ్గాలనే ప్రక్రియలో ఆహార నియమాలు జీవితాంతం పాటించవలసిందేనన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications