Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
జిమ్ చేసేప్పుడు చేయవల్సిన & చేయకూడని పనులు
జిమ్మింగ్ చేస్తున్నప్పుడు ఏమి చేయవొచ్చో, ఏమి చేయకూడదో అన్న విషయం మీద వారివారి సొంత సిద్ధాంతం కలిగి ఉంటారు. మనం ఊక నుండి గోధుమలను వేరు చేద్దాము.
మీకు ఫిట్నెస్ గురించి చాలా తెలుసు అనుకోవచ్చు, కాని నిపుణులు చాలా గాయాలు - స్నేహితుడు,సహచరుడు ఇచ్చిన తప్పుడు సమాచారం వలన లేదా టీవీలో చూసినదాని వలన ఏర్పడుతుంటాయని చెపుతున్నారు. మీరు విన్న ప్రతి విషయం నమ్మవొద్దు.
మీరు వ్యాయామం యొక్క ఉత్తమ ఫలితాన్ని పొందకుండా కారణాలయిన అడ్డంకులు మరియు గాయాలకు కారణాలయిన పురాణాలు చాలా ఫిట్నెస్ లో ఉన్నాయని నిపుణులు చెపుతున్నారు. గాయాలను తప్పించుకోండి. ఇక్కడ జిమ్మింగ్ గురించి కొన్ని విషయాలను పొందుపరుస్తున్నాము. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండటానికి వీటిని జాగ్రత్తగా చదవండి.

మైత్ 1: రోడ్డు మీద పరుగెత్తటం కన్నా ఒక ట్రెడ్మిల్ పై నడవటం వలన మీ మోకాళ్ళపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మీరు రోడ్డుపై గాని లేదా ట్రెడ్మిల్ పైగాని పరుగెత్తటం లెక్కలోకి రాదు. మీ శరీర బరువు మీ కీళ్ళపై ఆధారపడి ఉంటుంది, అందువలన ఈ ప్రభావం వలన మీ మోకాళ్ళపై ఒత్తిడిని కలుగచేస్తుంది. ఒకేసారి ఎక్కువ సమయంలో పరుగెత్తటం వలన కలిగే ఈ ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నించండి.
మైత్ 2: Ab యంత్రాలు బొడ్డు కొవ్వు వదిలించుకోవటం సహాయపడతాయి. మీ నడుము చుట్టూ ఉండే అనవసరమైన కొవ్వును వదిలించుకోవటానికి మార్కెట్లో చాలా ప్రకటనలు వెలువడుతున్నాయి. వాటిని నమ్మవొద్దు. ఒక AB-క్రంచింగ్ యంత్రం మీ చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయటంలో సహాయపడి, మీ ఆకృతిని మెరుగుపరుస్తుంది, కాని మీరు పాటించే కఠిన ఆహార నియంత్రణ నియమాలు మరియు వ్యాయామం మాత్రమే కొవ్వును కరిగించటంలో సహాయపడతాయి. హృదయ మరియు శక్తి శిక్షణ అంశాలు కలిగిఉన్న రెండు వ్యాయామాలను అనుసరించటం వలన మీ మొత్తం శరీరంలో ఉన్న కొవ్వును తగ్గిస్తాయని నిపుణులు చెపుతున్నారు.
మైత్ 3: మీరు ఒక ఏరోబిక్ వ్యాయామం పూర్తి చేసిన తరువాత దాని ప్రభావం వలన మీలో జీవక్రియ ఉత్తే జితమవుతుందని ఒక నమ్మకం. ఇది కొంతవరకు నిజమే! మీరు నమ్మినంత కాదు. ఒక ఏరోబిక్ వ్యాయామం పూర్తి చేసిన తరువాత మనకు కావలసినదానికన్న ఎక్కువ పరిమాణంలో మనలో జీవక్రియకు ప్రేరణ కలుగుతుంది. మీరు రోజులో కేవలం 20 నుండి 30 అదనపు కేలరీలు మాత్రమే ఖర్చు చేయవలసి ఉంటుంది.
మైత్ 4: స్విమ్మింగ్ త్వరగా బరువు కోల్పోవటంలో సహాయపడుతుంది.
క్రమం తప్పకుండా స్విమ్మింగ్ చేయటం అనేది ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచడానికి ఒక మంచి మార్గం,మీ కండరాలు చక్కగా పని చేయటంలో మరియు మీలో ఒత్తిడిని తగ్గించటంలో తోడ్పడుతుంది.ఏదిఏమైనా, దీనివలన మీరేమి పౌండ్ల కొద్దీ బరువేమి తగ్గరు. దీనివలన మీకు నీటి మద్దతు దొరుకుతుంది,కాబట్టి ఎక్కువగా కష్టపడనవసరం లేదు. ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది కావున స్విమ్మింగ్ చేసిన తరువాత మామూలుగా తీసుకునే ఆహారంకన్న ఎక్కువగా ఆహారం తీసుకుంటారు.
మైత్ 5: యోగ వెన్నునొప్పి యొక్క అన్ని రకాల ఉపశమనానికి సహాయపడుతుంది.
మీ వెన్నునొప్పి కండరాల సంబంధించినవై ఉన్నప్పుడు యోగ సహాయపడుతుంది ఎందుకంటే యోగాలో ఉన్న సాగతీతలు,బిగింపులు,మరియు స్థానాలు నొప్పి తగ్గటానికి సహాయపడతాయి. మీ వెన్నునొప్పి సమస్యలు అరిగిన డిస్క్ లేదా ఇతర సమస్యల వలన ఏర్పడినట్లయితే, అప్పుడు యోగా సహాయపడదు. మీరు మీ డాక్టరును సంప్రదించి మీకు యోగా నిజంగా సహాయపడుతుందని ధ్రువీకరించుకోండి మరియు సాధన చేయండి.
మైత్ 6: చెమట పట్టేంత పని తప్పనిసరి
మీరు పని చేసినప్పుడల్లా చెమట పట్టటం తప్పనిసరి అనుకోవొద్దు. చెమట పట్టకుండానే అనేక కాలరిలను తగ్గించుకోవొచ్చు. ఉదాహరణకు లైట్ వెయిట్ ట్రైనింగ్ లేదా వాకింగ్.
మైత్ 7: విరామం తర్వాత మీ సాధారణ రొటీన్ తిరిగి మొదలు పెట్టవొచ్చు
అతితక్కువ వ్యవధిలో అత్యధికంగా పొందాలనే ప్రయత్నం ఎప్పుడు చేయవొద్దు. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు మంచి అనుభూతి కలిగినా, మీ శరీరానికి తొందరగా మార్పు రావాలని హాని చేయవొద్దు. మీరు వ్యాయామం మధ్యలో కొన్ని రోజులు / వారాలు విరామం తీసుకుంటే మరల మీరు సాధారణంగా ఎలా ఉండేవారో అలానే ఉన్నట్లుగా భావన కలుగుతుంది. వెంటనే మీకు అలసట కలుగదు, కాని ఆ సమయంలో ఆ అనుభూతి ఉంటుంది.
మైత్ 8: మీరు మిషన్లపైన తప్పుగా వెళ్ళవొద్దు
ఒక వ్యాయామం యంత్రం మీ ఎత్తు, బరువుకు సరిగా అమరి ఉంటే, ఆ యంత్రం స్వయంచాలకంగా మీ శరీరాన్ని సరిఅయిన స్థానంలో ఉంచుతుంది. మీరు వేరే వారిలాగా ఉండాలని అనుకునేబదులు, మీ శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచుకోవటానికి ప్రయత్నిచందని నిపుణులు చెపుతున్నారు. మీరు గాయాలు కలిగే ప్రమాదాన్ని ఈ విధంగా నివారించవొచ్చు.
మైత్ 9: నొప్పి మంచిది
నొప్పి లేదు-లాభం లేదు అనే సిద్ధాంతం నమ్మవొద్దు. పని తర్వాత ఒక రోజు నొప్పి సాధారణం, కాని పుండ్లు పడి, బాధ పడటం సరిఅయిన విషయం కాదు. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు గాయాలు అయి బాధపదకూడని నిపుణులు చెపుతున్నారు. మీకు వ్యాయామం వలన బాధ కలుగుతున్నట్లయితే మీరు సరిగా చేయటంలేదని అర్థం లేదా మీకు అంతకుముందే తగిలిన గాయానికి ఒత్తిడి కలిగిస్తున్నారని,అందువలన బాధ కలుగుతున్నదని అర్థం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











