Latest Updates
-
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా!
పార్టీలో మందు ఎక్కువైతే?ఈ ఆహారాలు తినడం ఉత్తమం
ప్రస్తుత రోజుల్లో నగరాలతో పాటు, చిన్న చిన్న పట్టనాలు, నగరాల్లో కూడా పార్టీ కల్చర్ బాగా అలవడుతోంది. వీకెండ్స్ లో లేదా మ్యారేజ్ పార్టీలు, బర్త్ డే పార్టీలు, బ్యాచురల్ పార్టీలు,వివిధ రకాలైన పార్టీలకు హాజరయ్యే సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. పార్టీల్లో ఫ్రాశ్చాత్య పోకడలకు కూడా క్రమంగా అలవాటు పడుతూ డ్రింక్ మీద ఎక్కువ మోజు పెంచుకుంటున్నారు. కొద్దికొద్దిగా ప్రారంభమైన ఈ అలవాటు తర్వాత తర్వాత ఖచ్చితంగా పార్టీలకు వెళ్ళే హ్యాబిట్ గా మారుతుంది. పార్టీలు మరియు పబ్బల్లో బాటిల్ బాటిల్ త్రాగేసి హ్యాంగోవర్ కు గురి అవుతుంటారు. హెవీ బీర్, వోడ్కాలతో హ్యాంగోవర్ చిక్కులు తప్పవు.
ఇలా పార్టీలో సాప్ట్ డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్ అలవాటు పడినప్పుడు కొందరి ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలియదు. డ్రింక్ చేయని వారి ఏదైన మంచి ఆరోగ్యకరమైన ఆహారం కోసం చూస్తారు. అటువంటప్పుడు ఏదైనా కొత్తగా ఆర్డర్ ఇవ్వాలని చూస్తారు. అదే విధంగా మరికొందరు డ్రింక్ చేసే సమయంలో మరే ఇతర ఆహారాలు తీసుకోవడాని ఇష్టపడరు. అయితే డ్రింక్ చేసిన తర్వాత ఆరోజంతా హ్యాంగోవర్ సమస్య ఉండకుండా ఆ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే, డ్రింక్స్ తో పాటు ఏదో ఒక ఆహారాన్ని తీసుకోవాలి.
అలాంటి వారికోసం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు, ఉత్తమ ఆహారాలు కొన్ని ఉన్నాయి. మీరు ఎక్కువగా డ్రింక్స్ తీసుకొన్నప్పుడు తీసుకోవల్సిన కొన్ని కొన్ని ఉత్తమ ఆహారాలు..

ఆస్పరాగస్
డ్రింక్ చేసిన తర్వాత ఆస్పరాగస్ తో తయారుచేసి వంటలు తీసుకోవడం వల్ల శరీరంలో ఎంజైమ్స్ ను పెంచుతుంది. మరియు ఇది ఆల్కహాల్ ఎఫెక్ట్ ను తగ్గిస్తుంది

అరటిపండ్లు
ఆల్కహాల్ శరీరంలో పొటాషియం స్థాయిని తగ్గిస్తుంది. కాబట్టి డ్రింక్ చేసిన తర్వాత అరటిపండ్లు తినడం వల్ల ఆ కోల్పియిన పొటాషియంను తిరిగి పొందవచ్చు.

టమోటో జ్యూస్
డ్రింక్ చేసిన తర్వాత తీసుకోవల్సిన ఆహారాల్లో టమోటో కూడా ఒకటి. మీరు టమోటోలను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది మీ శరీరంలోని షుగర్ లెవల్స్ ను తిరిగి భర్తీ చేస్తుంది.

గుడ్లు
మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన ఆహారాల్లో గుడ్డ ప్రధానమైనది. ఎందుకంటే ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్ శుభ్రం చేయడానికి బాగా సహాయపడుతాయి.

చికెన్ నూడిల్ సూప్
ఒక టిపికల్ మదర్స్ రిసిపి మరియు డ్రింక్స్ మోతాదు మించినప్పుడు తప్పనిసరిగా తీసుకోవల్సినటువంటి ఒక సూప్ రిసిపి ఇది. ఇది సోడియం మరియు నీటిని శరీరానికి అందిస్తుంది.

మిసో సూప్
డ్రింక్స్ హైలో ఉన్నప్పుడు తీసుకోవల్సిన మరో ఆహారం మిసో సూస్, ఇది ఒక జపనీస్ రిసిపి. ఇది కూడా శరీరానికి సోడియం మరియు నీళ్ళు అందించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

టోస్ట్ అండ్ హనీ
ఇది చూడటానికి ఒక చిన్న పిల్లల ఆహారంగా అనిపించినా, మీరు హైగా ఉన్నప్పుడు ఈ ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచుతుంది మరియు ఆల్కహాల్ ను బర్న్ చేస్తుంది.

కొబ్బరి నీళ్ళు
నీళ్ళు తర్వాత ఎక్కువుగా తీసుకోవల్సిన మరో ఆహారం కొబ్బరి నీళ్ళు, డ్రింక్ చేసిన తర్వాత ఆహారం తీసుకొన్న తర్వాత తీసుకోవల్సిన కొబ్బరి నీళ్ళు తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.

కాఫీ
ఇదిమరో టిపికల్ ఫుడ్ . మీ శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు ఇది డ్యూరియాటిక్ ఫుడ్. కాబట్టి, నీళ్ళతోపాటు, కాఫీని కూడా తప్పకుండా తీసుకోవాలి.

ఓట్స్
ఎప్పుడైతే హైగా ఉంటారో, అప్పుడు ఓట్స్ బాగా సహాయపడుతాయి. ఇది శరీరంలో నిల్వ ఉండే ఎటువంటి ఎసిడిక్స్ అయినా నీరసపడేలా చేస్తుంది. మరియు ఇది తక్షణ ఎనర్జీని అందిస్తుంది.

కివి
డ్రింక్ మరియు ఆహారం తిన్న తర్వాత డైట్ లో చేర్చుకోవల్సిన మరో ఆహారం కివి, ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కోల్పోయిన ఆల్కహాల్ కంటెంట్ ను తిరిగి పొందడానికి సహాయపడుతుంది.

ఆకుకూరలు
డ్రింక్ చేసిన తర్వాత పొటాషియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. ఆకుకూరల రుచి మీకు ఇష్టం లేకపోతే తినడానికి ముందు వీటిని పెరుగుతో మిక్స్ చేసి తీసుకోవచ్చు.

అల్లం
డ్రింక్ చేసిన తర్వాత బ్యాడ్ హ్యాంగోవర్ ను నివారించడానికి అల్లం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరియు ఇతర జీర్ణ సమస్యలను కూడా నివారిస్తుంది.



Click it and Unblock the Notifications
