Latest Updates
-
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి! -
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది! -
విజయ్–త్రిష వెడ్డింగ్ వీడియో.. సోషల్ మీడియాలో రచ్చ! అసలు నిజం ఇదేనా? -
ఓట్స్ అంటే ఇష్టం లేదా? ఇలా గంజిలా చేసి చూడండి..బరువు తగ్గడంతో పాటు రుచీ మీ సొంతం! -
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట!
మజిల్స్ బిల్డ్ చేయడానికి 15 సింపుల్ టిప్స్
సాధారణంగా కొంత మంది కండర పుష్టి కోసం వివిధ రకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు. కండరనిర్మాణానికి డైట్ లో మార్పులు మరియు జిమ్ కు వెళ్ళడం వంటివి చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు. అటువంటి వారు అతి తక్కువ సమయంలో వేగవంతంగా కండరాలు నిర్మానికై మీరు ముఖ్యంగా మీ జీవనశైలి మీద ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది.
ఆరోగ్యకరమైన పద్దతిలో కండర పుష్టి పొందాంటే అందులకు సరైన ఆహారం మరియు వ్యాయామం ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. డైట్, జిమ్ కుల వెళ్ళితే సరిపోదు. తీసుకొనే డైట్ లో కండరపుష్టికి అవసరం అయ్యే వాటిని ఎంపిక చేసుకోవడం ప్రధానం. అలాని రాత్రికి రాత్రే మార్పు వచ్చేయదు. ఈ క్రింది పద్దతులను అనుసరించడం వల్ల కొన్ని వారాల్లో తప్పనిసరిగా ఫలితం కనిపించవచ్చు.
కండర నిర్మాణం మరియు కండరాలు పొందడానికి, బాడీ బిల్డ్ చేసే పద్దతులు చాలా కీలకమైనవి. మజిల్ మాస్ పొందడానికి ఇక్కడ, మజిల్ బిల్డ్ చేసే ఆహారాలు మరియు వ్యాయామంతో కూడిన 15 నియమాలున్నాయి. ఒక బలమైన మరియు మంచి ఆకారం ఉన్న కండరాలు పొందడానికి ఈ నియమాలు అనుసరించండి. మజిల్ మాస్ ఆరోగ్యకరమైన శరీరానికి చిహ్నాం అని గుర్తుంచుకోవాలి.

క్యాలరీలు తగినన్ని తీసుకోవాలి
కెలొరీలు తీసుకోవడం : కండర నిర్మాణం కోసం మీరు తీసుకొనే శిక్షణ ముఖ్యంగా బరువులెత్తడానికి మీరు తీసుకొనే ఆహారం ద్వారా క్యాలరీలను పెంచుకోవడం చాలా అసరం. కానీ, మీరు తీసుకొనే క్యాలరీల వల్ల మీరు అధిక శక్తి పొందడమే కాకుండా శరీరంలో అదనపు కొవ్వు చేరడానికి కారణం కావచ్చు. కాబట్టి మీరు తీసుకొనే ఆహారం మీ కండర నిర్మాణానికి ఉపయోగపడాలి, అదే సమయంలో అదనపు కొవ్వు పదార్థాలను ఆహారంగా తీసుకోవడం నివారించాలంటే ఒక ప్రముఖ ఫిట్నెస్ కన్సల్టెంట్ ను సంప్రదించండి.

కాంపౌడ్ వ్యాయామాలు
వ్యాయామం ఒకటి కంటే ఎక్కువ కండరములు గుంపు మరియు కీళ్ళు బలపడే వ్యాయామాలు, సమ్మేళన వ్యాయామాలుగా పిలుస్తారు . సమ్మేళన వ్యాయామాలు కండర నిర్మాణం కోసం పరిపూర్ణంగా ఉన్నాయి . ఈ వ్యాయామాలు, బరువులెత్తడం వల్ల కండరాల మాస్ పెంచడానికి బాగా సహాయపడుతాయి.

ఉదయం చేసే వ్యాయామాలు
ఉదయం శిక్షణ పొందడం అనేది కండర నిర్మానికి ఒక గొప్ప చిట్కా. ఎప్పుడైతే ఉయంపూట, కాలీ కడుపుతో వ్యాయామలు చేస్తారో, అప్పుడు కండారలు ఉత్తేజపరచడం ద్వారా మజిల్ మాస్ పెరుగుతుంది .

డైజెస్టివ్ ఎంజైములు(జీర్ణక్రియకు సహాయపడే ఎంజైములు)
మీరు కండర నిర్మాణానికి ఒక లక్ష్యాన్ని నిర్మించుకొన్నప్పుడు, ఆహారం తీసుకోవడంలో కూడా శిక్షణ పొందడంతో కండరాలను పెంచుకొనుటకు తగినంత శక్తిని పెంచుకోవచ్చు. దాంతో వ్యాయామాలు చేయొచ్చు. అందువల్ల, మీ శరీరానికి అదనపు సహాయం అవసరం అవుతుంది. ఎందుకంటే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవ్వడానికి మరియు పోషకాలు శరీరంలోనికి శోషించడానికి.

హైడ్రేషన్ తో ఉండటం
రోజంతా మీ శరీరానికి సరిపడే ద్రవాలు మరియు నీళ్ళు తీసుకోవడం బాడీ బిల్డింగ్ మరియు మజిల్ బిల్డింగ్ కు చాలా అవసరం. రోజంతా సాధ్యమైనంత నీరు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నిస్తే వ్యాయామం చేయడానికి, ఎనర్జీతో ఉండటానికి సహాయపడుతుంది . ప్రతి 10-20నిముషాలకొకసారి నీళ్ళు త్రాగాలి. వ్యాయామ సమయంలో కూడా తాగవచ్చు. దాంతో మీ శరీరం మీద డీహైడ్రేషన్ ప్రభావం ఉండదు.

స్క్వాట్స్ (Squats)
కండరనిర్మాణానికి స్క్వాట్స్ చాలా అవసరం, కానీ సగం స్క్వాట్స్ చేయడం లేదా తప్పులు చేయడం వల్ల మోకాలి సమస్యలకు కారణం కావచ్చు.

డెడ్ లిప్ట్స్
మజిల్ మాస్ పొందడానికి డెడ్ లిప్ట్స్ మరో మార్గం. మీ రెగ్యులర్ బాడీ బిల్డింగ్ వ్యాయామంలో బరువులు ఎత్తడాన్ని క్రమంగా చేయండి. మజిల్ బిల్డ్ చేయాలనుకొనే వారికి వెయిట్ ట్రైనింగ్ చాలా ముఖ్యం.

ప్రోటీన్
మీరు వ్యాయామం చేసేటప్పుడు, ముఖ్యంగా వెయిట్ ట్రైనింగ్ , మరియు మీరు మీ శరీరం అధిక ఒత్తిడికి లోనవుతుంది. వర్కౌట్స్ చేసేటప్పడు ఎక్కువ ఒత్తిడిని మీ శరీరం మీద పెట్టాల్సి వస్తుంది. అందువల్ల వ్యాయామాలు చేసే వారికి ప్రోటీనులు చాలా అవసరం . ఒకసారి ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల ఇది శరీరంలో అమైనో ఆసిడ్స్ గా విడగొట్టబడుతుంది,అది శక్తిగా మారి ప్రతి రోజూ వ్యాయామం చేయడానికి అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది.

సరైన క్రమం
కండర నిర్మాణం కోసం, వెయిట్ ట్రైనింగ్ చాలా అవసరం. కానీ, వ్యాయామాన్ని ప్రతి రోజూ ఒకే క్రమంలో మరియు ఒకే పద్దతిలో సాధన చేయాలి.

శిక్షణ తర్వాత తినాలి
కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీనుల కాంబినేషన్ కలిగి ఆహారాలు మంచి బాడీబిల్డింగ్ కు, వ్యాయం తర్వాత తీసుకోవడం ఒక మంచి మార్గం. కార్బోహైడ్రేట్స్ ఇన్సులిన్ ను పెంచుతుంది, అమైనో ఆసిడ్స్ వల్ల కండరాల పెరుగుదల జరుగుతుంది.

సరైన నిద్ర
ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా బాడీ బిల్డ్ చేయడానికి కూడా శరీరానికి తగినంత విశ్రాంతి మరియు నిద్ర చాలా అవసరం . వ్యాయామాలు చేస్తారు కాబట్టి మీ శరీరానికి కావల్సినంత నిద్ర చాలా అవసరం.

మజిల్ బిల్డ్ చేయడానికి ఆహారం
కండర పుష్టికోసం రెడ్ మీట్ తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే రెడ్ మీట్ లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. బాడిబిల్డ్ కు గుడ్లు కూడా చాలా ముఖ్యమైన ఆహారం. వివిద రకాలా ప్రోటీన్ ఆహారం తీసుకొని వివిధ రకాల పోషకాలను పొందండి.

హెల్తీ ఫ్యాట్స్ ను దూరం చేసుకోకండి
హెల్తీ ఫ్యాట్స్ అంటే నట్స్ మరియు ఫిష్ వంటివి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ను అందివ్వడం మాత్రమే కాదు, తగినంత శక్తిని కూడా అంధిస్తాయి. కాబట్టి వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అంతే కాదు మీ శరీరంలో జీవక్రియలు సరిగా పనిచేయాలంటే కొవ్వులు చాలా అవసరం.

కార్డియో అవసరం
మీ రెగ్యులర్ వ్యాయామాల్లో, కార్డియో వ్యాయామాలను చేర్చుకోవాలి.

బాడీ బిల్డ్ చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది
బాడీ బల్డింగ్ వెంటనే సాధ్యం కాదు; సీజన్డ్ బాడీబిల్డర్ తోపోల్చితే ట్రైనింగ్ తీసుకొనే వారి చాలా భిన్నంగా ఉంటారు కాబట్టి వారి ట్రైనింగ్ అవసరం. మీరు బాడీ బిల్డ్ చేసుకోవడానికి శిక్షణ ఇప్పుడే కనుక మొదలుపెట్టింటే ప్రాథమిక అంశాల నుండి తెలుసుకోవాలి. మీకు ఒక మంచి ఆరోగ్యకరమైన కండరపుష్టిని పొందడానికి కొంత సమయం పడుతుంది.



Click it and Unblock the Notifications