Latest Updates
-
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా!
పొట్ట కొవ్వును గణనీయంగా తగ్గించే ఉత్తమ ఆహారాలివి..!
శారీరకంగా పురుషులకు మహిళలకు తేడా వుంటుంది. మహిళలకు వారి శరీరాన్ని మంచి షేప్ లో వుంచే ఆహారాలు కావాలి. కాని పురుషులకు శరీరాలను బలంగా వుంచే ఆహారాలు కావాలి. బరువు తగ్గేటందుకు ఆహారాలు అనేకం. కాని మహిళలకు తగినవి కొన్ని మాత్రమే.
ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవిన శైలితో పాటు అలవాట్లు ఆరోగ్యం మీద చాలా చెడు ప్రభాన్ని చూపెడుతున్నాయి. ప్రస్తుత కాలంలో అధికంగా బాధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం. చాలా మంది ఈ సమస్యకు వివిధ రకాల ప్రయత్రాలు మరయు డైటింగ్ చిట్కాలు పాటించినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకు మరింత స్మార్ట్ గా పనిచేయాలి. ఉడికించిన ఆహారం తీసుకోవడానికి బదులు కొద్దిగా చురుకుగా పనిచేయాలి. చురుకుగా పనిచేయాలంటే వర్క్ ఔట్స్ చేయాలని కాదు. మీరు తీసుకొనే చురుకైన పద్దతులే మిమ్మల్ని కొన్ని పౌండ్ల బరువును తగ్గడానికి సహాయపడుతాయి. అయితే మనం బరువు తగ్గడానికి కొన్నిసీక్రెట్ ఫుడ్స్ ఉన్నాయి.
పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు: క్లిక్ చేయండి
బరువు తగ్గాలంటూ ఆహారం తినకుండా పస్తులుంటున్నారా? అసలు ఆహారం మానేయటం కన్నా...సరైన ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించండి. మరి మీ కొరకు మేము 20 రకాల ఆహారాలను ఎంపిక చేశాము. వీటిని మీ జాబితాలో పై వరుసలో పెట్టండి. ఈ ఆహారాలు మీకు తగిన పోషకాలను అందించటమే కాదు, మీ పొట్ట కొవ్వు గణనీయంగా తగ్గేలా చేస్తాయి
బొజ్జతో అనర్థాలు: బొజ్జ కరిగించే చిట్కాలు: క్లిక్ చేయండి

టమాటాలు -
విటమిన్ సి టమాటాలలో అధికం. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కేలరీలు తక్కువ. సూప్, సలాడ్, పప్పు లేదా పండుగా కూడా తినేయవచ్చు. కేన్సర్, గుండెజబ్బులను నివారిస్తాయి. చర్మం మెరిసేలా చేస్తాయి.

నిమ్మకాయ -
దీనిలో విటమిన్ సి అధికం. మీ జీవప్రక్రియ పెంచుతుంది. స్లిమ్ గా ఉంచుతుంది. ఎసిడిటీ తగ్గించి మొండి రోగాలను దూరం చేస్తుంది.

గ్రీన్ టీ -
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కొవ్వును కరిగించి మెటబాలిజం అధికం చేస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు కప్పులు తాగితే చెడు కొల్లెస్టరాల్ స్ధాయిలు తగ్గిస్తుంది.

ఆరెంజస్ -
విటమిన్ సి బాగా ఉంటుంది. వింటర్ జలుబులు అరికడతాయి. తక్కువ కేలరీలు. తీపి కోరిక తగ్గిస్తాయి.

అరటి పండ్లు -
నీటి శాతం అధికం. పీచు ఉంటుంది. కడుపు నింపుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. మూడ్ మంచిగా ఉండేలా చేస్తాయి.

కేరట్లు -
కార్బో హైడ్రేట్లు అధికంగా ఉండి త్వరగా ఆకలినిస్తాయి. పీచు, విటమిన్ ఎ మరియు బి కాంప్లెక్స్ అధికం. ఇవి సాఫీగా విరోచనం చేస్తాయి.

బీట్ రూట్ -
పీచు అధికం, ఆరోగ్యకర షుగర్ వుండి ఆకలి తీరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. అవిసె గింజలు - వీటిని సలాడ్లపై చల్లుకు తినవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కొల్లెస్టరాల్ అదుపులో ఉంచి జీర్ణక్రియ పెంచుతాయి.

ఆకు కూరలు -
కేలరీలు తక్కువ, పీచు ఎక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ కనుక డయాబెటిక్ రోగులు కూడా తినవచ్చు. కడుపు నింపుతాయి. రక్తాన్ని శుభ్ర పరుస్తాయి.

పచ్చని కూరగాయలు -
బచ్చలికూర, బ్రక్కోలి, తోటకూర, మెంతికూర వంటివి మహిళలకు కావలసిన ఐరన్ అందిస్తాయి. హెమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. కేలరీలు లేని పీచు బాగా లభిస్తుంది. బరువు తగ్గాలంటే ఇది మంచి చిట్కా.

బ్రక్కోలి -
బ్రక్కోలిలో విటమిన్ ఎ మరియు సి మరియు కాల్షియం కూడా ఉంటాయి. వీటితో సూప్ సలాడ్ వంటివి చేసుకోవచ్చు. కేలరీలు తక్కువ.

పెరుగు -
పెరుగులో మంచి కాల్షియం, ప్రొటీన్లు ఉంటాయి. కొవ్వు కరిగిస్తుంది. మేలు చేసే బాక్టీరియా మీ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

మొలకెత్తిన విత్తనాలు -
పెసలు, శనగలు, వేరు శనగ పప్పులు, అలచందలవంటివి నానపోసి మొలకలు వచ్చిన తర్వాత తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని శక్తి గుళికలు అంటారు. కడుపు నింపుతాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు సమకూరుతాయి.

ఓట్లు -
ఆరోగ్యకర చిరుతిండి. పీచు అధికం, కడుపు నింపుతాయి. పోషకాలు వంటికి పట్టేలా చేస్తాయి.

గుడ్లు -
ప్రొటీన్లు అధికం. ఎమినో యాసిడ్లు బరువు తగ్గించేస్తాయి. బ్లడ్ షుగర్ స్ధిరీకరించబడుతుంది. ఊబకాయం ఏర్పడకుండా చేస్తాయి.

చేపలు -
చేపలను గుండె ఆహారంగా చెపుతారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండి ఎంతో మేలు చేస్తాయి. కొవ్వు కరిగిస్తాయి.

కాటేజ్ ఛీజ్ -
ప్రొటీన్లు అధికం. కాల్షియం బాగా ఉంటుంది. ఈ కాల్షియం కొవ్వును కరిగించి మీరు స్లిమ్ గా ఉండేలా చేస్తుంది.

గోంగూర -
గోంగూరలో పీచు, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు గోంగూర లో 35 కేలరీలు ఉంటాయి. పప్పులు, పులుసు, సలాడ్ అన్ని చేసుకోవచ్చు.

వాల్ నట్స్ -
దీనిని బ్రెయిన్ ఫుడ్ అంటారు. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన చిరుతిండి. కడుపు నింపుతుంది.

ఆలివ్ నూనె -
ఆలివ్ నూనె - ఈ నూనెతో చేసే వంటకాలు ఎంతో ఆరోగ్యం. మంచి కొలెస్టరాల్ పెంచుతాయి. కడుపు నింపి అధిక ఆకలి కాకుండా చేస్తాయి.ఆపిల్స్ - ఆపిల్స్ లో కేలరీలు తక్కువ. పీచు అధికం. తిన్నది బాగా జీర్ణం చేస్తుంది. దీనిలోని పెక్టిన్ మీకు కడుపు నిండినట్లు భావించేలా చేస్తుంది.

కొబ్బరి -
కొబ్బరి కడుపు నింపుతుంది. ఆరోగ్యకర కొవ్వును ఇస్తుంది. పోషకాలు అధికం.



Click it and Unblock the Notifications
