Latest Updates
-
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.?
పెద్దప్రేగు సమస్యకు ఆహారంతో చిన్నపాటి చికిత్స
పేరుకూ, విధులకూ... ఈ రెండిటి విషయంలోనూ పెద్దది... పెద్దపేగు. దీన్నే ఇంగ్లిష్‌లో కోలన్ అంటారు. ఈ అవయవానికి క్యాన్సర్ వస్తే దాన్ని ‘కోలన్ క్యాన్సర్' అని పిలుస్తారు. మనం తిన్న ఆహారంలో అన్ని పోషకపదార్థాలను ఒంటికి పట్టేలే చేసేవి చిన్న పేగులైతే... శరీరానికి అవసరమైన నీటిని, పొటాషియం లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను ఒంటికి పట్టేలా చేసే బాధ్యత పెద్దపేగుదే. ఆ తర్వాత వ్యర్థాలను మల ద్వారం గుండా బయటికి పంపివేయడం కూడా దానిపనే. మలద్వారాన్ని రెక్టమ్ అంటారు. పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే దాన్ని కోలన్ క్యాన్సర్ అని, మలద్వారానికీ అది సోకితే రెక్టల్ క్యాన్సర్ అనీ అంటారు. ఇప్పుడు ముందుగానే గుర్తిస్తే కోలన్ క్యాన్సర్‌కు సమర్థంగా చికిత్స చేయవచ్చు.
క్యాన్సర్ సోకినప్పుడు పెద్దపేగుకు కండపెరిగినట్లుగా కొన్ని బొడిపెలు వస్తాయి. వాటినే పాలిప్స్ అని చెప్పవచ్చు. కొందరిలో ఎలాంటి బొడిపెలూ లేకుండా కూడా క్యాన్సర్ రావచ్చు. ఇది వంశపారంపర్యంగా రాదు. కాకపోతే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఉంటే ఇది వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ. అందుకే ఇలా వచ్చిన వారి పిల్లలకు 15 ఏళ్ల వయసు నుంచే తరచూ స్క్రీనింగ్ చేయడం అవసరం. ఎందుకంటే కోలన్ క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత బాగా నయమవుతుంది.
లక్షణాలు / గుర్తించడం ఎలా...
కోలన్ క్యాన్సర్ లక్షణాలు పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన ప్రదేశం, దాని పరిమాణం, ఏయే భాగాలకు అది వ్యాపించింది వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కోలన్ క్యాన్సర్ మనం తీసుకొనే ఆహారం ద్వారా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కోలన్ క్యాన్సర్‌ను నివారించడం సులువే.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అంటే... కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, తాజా ఆకుకూరలను, పండ్లను ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారాన్ని పరిమితంగా తినడం అందులోనూ కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలను మాత్రమే తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలోనూ పీచు ఎక్కువగా ఉండే కాయధాన్యాల వంటివాటికి ఆహారంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
వీటితో పాటు మరికొన్ని ఆహారాలు ఈక్రింది స్లైడ్ లో ఇవ్వబడినది...

బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్ లో ఉండే అధిక ఫౌబర్ కంటెంట్ కోలన్ క్యాన్సర్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, బ్రౌన్ రైస్ ను మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. క్యాన్సర్ సెల్స్ అభివృద్ధిని నిరోధించగలిగి ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి, కోలన్ క్యాన్సర్ నివారించే ఈ ఆహారాన్ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

సాల్మన్
కొన్ని పరిశోధనల ప్రకారం విటమిన్ డి లోపం వల్ల కోలన్ క్యాన్సర్ కు దారితీస్తుంది. విటమిన్ డి కి ప్రధాన మూలం నేచురల్ సన్ లైట్, అయితే, సాల్మన్ ఫిష్ లో అధిక శాతంలో విటమిన్ డి ఉండటం వల్ల, ఇది మీ రెగ్యులర్ డైట్ లో చాలా అవసరం అవుతుంది.

పీనట్స్ (వేరుశెనగలు)
వేరుశెనగల్లో కూడా అధిక శాతం ఫైబర్ కలిగి ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, వీటిలో 6గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుందని నిర్ధారించారు. వేరుశెనగలు నట్స్ కాదు, లెగ్యుమ్స్. అధిక ఫైబర్ కంటెంట్ కలిగిన ఈ లెగ్యుమ్స్ కోలన్ క్యాన్సర్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

అల్లం
అల్లం నేచురల్ ఆంటీబయాటిక్ ఇది కోలన్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కొన్ని ట్యూమర్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ తో క్యాన్సర్ కు కారణం అవుతుంది. రెండు గ్రాముల అల్లం సప్లిమెంట్ లేదా రెండు టేబుల్ స్పూన్ల అల్లం ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు.

వైట్ టీ
వైట్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేయడంలో అద్భుతంగా సహాయపడుతాయి. గ్రీన్ టీలో కంటే వైట్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో వైట్ టీని తీసుకోవడం వల్ల చాలా డిఫరెన్స్ ను మీరు చూడవచ్చు.

ఆకుకూరలు
మీ డైలీ డైట్ లో ఆకు కూరలు లేదా పచ్చి కూరగాయలకు ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వాలి. ఆకుకూరల్లో అధిక శాతంలో న్యూట్రీషియన్ విలువలు కలిగి ఉంటాయి. ఆకు కూరల్లోని బీటా కెరోటిన్ క్యాన్సర్ సెల్స్ తో పోరాడటానికి సహాయపడుతాయి. మరియు క్యాన్సర్ సెల్స్ అభివృద్ది చెందకుండా అడ్డుకుంటాయి.



Click it and Unblock the Notifications