మీ డైట్ సరైంది కాదనడానికి 15 సంకేతాలు

వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నవారు శరీరంలోనున్న అధిక బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం సహజం. ఈ క్రమంలో సరైన డైట్ ద్వారా తగ్గించడానికి ప్రయత్నించాలి. సాధారణంగా, మీ డైట్ లో న్యూట్రియెంట్స్, ప్రోటీన్స్, ఫైబర్ తో పాటు మరిన్ని అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. శరీరంలోని కొవ్వు సహజంగా, త్వరగా కరిగేందుకు అవసరమైనవన్నీ మీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

పైవన్నీ ఉన్న డైట్ ను తీసుకున్నట్లయితే మీరు త్వరగా బరువును తగ్గుతారు. ఒకవేళ, పైన చెప్పుకోబడినవి మీ డైట్ లో లేకపోతే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. డైట్ చేంజ్ చేయాలనుకుంటే మీ శరీరానికి అవసరమయ్యేవి అందుతున్నాయో లేదో గమనించాలి. మీ డైట్ ను మీరు తప్పక చేంజ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందనడానికి కొన్ని సంకేతాలను గమనించాలి.

ఈరోజు, బోల్డ్ స్కై మీ డైట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలియచేస్తుంది. మీ డైట్ ఆరోగ్యకరంగా లేదని తెలుసుకునేందుకు అలాగే మీరు బరువు త్వరగా తగ్గేందుకు అవసరమైన చిట్కాలను అందిస్తుంది. రాంగ్ డైట్ తో ఇక్కట్లు పడే బదులు సరైన డైట్ తో అధిక బరువును త్వరగా తగ్గించుకోగలుగుతారు. ఈ సంకేతాలను ఒకసారి గమనించి మీ డైట్ ను మార్చాల్సిన అవసరం ఉందో లేదో తెలుసుకోండి. మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి.

అలసటగా ఉంటారు

అలసటగా ఉంటారు

మీ శరీరం వీక్ గా మారినప్పుడు మీరు శారీరకమైన, మానసికమైన ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేరు. మీరు మీ డైట్ ను మార్చవలసిన సమయం దగ్గరపడింది అనడానికి ఇదే ముఖ్యమైన విషయం.

అలెర్జీస్ మొదలవుతాయి

అలెర్జీస్ మొదలవుతాయి

మీ డైట్ సరిగ్గా లేదనడానికి సూచనగా అలెర్జీలు మొదలవుతాయి. అలెర్జీలు మిమ్మల్ని ఇక్కట్లకు గురిచేస్తాయి. ఇది మీరు తప్పక గమనించవలసిన సంకేతం.

విపరీతమైన ఆకలి

విపరీతమైన ఆకలి

మీరు ఆహారం తీసుకున్న తరువాత మీకు ఆకలి మిగలకూడదు. డైట్ తీసుకున్న తరువాత కూడా ఆకలి విపరీతంగా వేస్తుందంటే మీ డైట్ లో ఏదో పొరపాటు ఉందనే అర్థం.

ఒళ్ళు నొప్పులు

ఒళ్ళు నొప్పులు

మీ డైట్ లో ఏదో ప్రాబ్లెం ఉందని తెలియచేసే ముఖ్యమైన సంకేతం, ఒళ్ళు నొప్పులు. ఒళ్ళు నొప్పుల వల్ల మీరు ఇబ్బందులకు గురవుతున్నారంటే మీ డైట్ సరిగ్గా లేదని అర్థం. కచ్చితంగా, మీ డైట్ లో మీరు మార్పులు తీసుకురావాలి.

 డిప్రెషన్

డిప్రెషన్

డైట్ ప్లాన్ సరిగ్గా లేకపోతే డిప్రెషన్ కు కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఆహారం వల్ల ఆరోగ్యం కలగాలి కాని డిప్రెషన్ కాదు. అందువల్ల, సరైన ఆహారానికే ప్రెఫరెన్స్ ఇవ్వాలి. డిప్రెషన్ లక్షణాన్ని కచ్చితంగా గమనించాలి.

 డైట్ నచ్చకపోవడం

డైట్ నచ్చకపోవడం

మీ డైట్ మీకు నచ్చకపోతే కచ్చితంగా మీరు డైట్ లో మార్పులు తీసుకురావాలి. డైట్ ని ద్వేషిస్తూ మీరు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోలేరు. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నా మీ డైట్ మీకు నచ్చినదై ఉండాలి.

 ఫలితం లేకపోవడం

ఫలితం లేకపోవడం

ఒక నెల డైటింగ్ చేసినా మీ బరువులో ఏ మాత్రం మార్పు లేకపోతే కచ్చితంగా మీ డైట్ ను మార్చుకోవలసి వస్తుంది. డైట్ సరైనదిగా లేకపోవడమే ఇందుకు కారణం.

నలుగురితో ఆనందంగా తినలేకపోవడం

నలుగురితో ఆనందంగా తినలేకపోవడం

కుటుంబసభ్యులతో గాని, ఫ్రెండ్స్ తో గాని కలిసి భోజనం చేయడం ఏ మాత్రం ఇబ్బందిగా ఉండకూడదు. ఒక వేళ, మీ డైటింగ్ మీకు అటువంటి ఇబ్బందికి కలుగచేస్తోంది అంటే మీ డైట్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే.

పస్తులుండడం

పస్తులుండడం

పస్తులుండడం వల్ల బరువు తగ్గుతారనుకోవడం అపోహ. అనవసరంగా ఆరోయం మరింత పాడవుతుంది. మరిన్ని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్న వారవుతారు.

 మాటిమాటికీ మూడ్ మారిపోవడం

మాటిమాటికీ మూడ్ మారిపోవడం

మూడ్ మాటిమాటికీ మారిపోతోంది అంటే డైట్ లో ఏదో లోపం ఉందని అర్థం. ఇది మీ డైట్ ఆరోగ్యకరంగా లేదనడానికి ముఖ్య లక్షణం. మీరు తీసుకునే ఆహారం మీకు ఆనందాన్ని కలిగించాలి ఇబ్బందుల్ని కాదు.

మరిన్ని ఆరోగ్య సమస్యలు

మరిన్ని ఆరోగ్య సమస్యలు

మీరు తీసుకునే డైట్ మీ శరీరాన్ని సమతుల్యంగా ఉంచాలి. ఆరోగ్యంగా ఉంచాలి. కొన్ని రకాల ఆహారల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అటువంటి వాటి నుంచి దూరంగా ఉండాలి.

త్వరగా వయసు మీరతారు

త్వరగా వయసు మీరతారు

ముడతలతో, మొటిమలతో మీరు ఎంతో డల్ గా కనిపిస్తూ వయసైన వారిలా కనిపిస్తారో మీ డైట్ లో కచ్చితంగా లోపముందని గ్రహించాలి. ఈ లక్షణాన్ని విస్మరించకుండా మీ డైట్ లో కచ్చితంగా మార్పులు తీసుకురావాలి.

 కీళ్ళ నొప్పులు

కీళ్ళ నొప్పులు

ఒళ్ళు నొప్పులు పెరిగి కీళ్ళ నొప్పులు కూడా తలెత్తుతాయో అప్పుడు మీరు కచ్చితంగా మీ ఆహారంపై తగిన శ్రద్ధ వహించాలి. మీ డైట్ ను మార్చుకోవాలి. లేకపోతే మరిన్ని ఇబ్బందులకు లోనవుతారు.

 రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది

రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది

సమతులమైన ఆహారాన్ని తీసుకోకపోతే దాని ప్రభావం రోగనిరోధక శక్తిపై ఉంటుంది. జీవక్రియ మందగిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ లక్షణాలను తెలుసుకున్న తక్షణమే మీరు మీ డైట్ లో మార్పులు తీసుకువస్తే ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వారవుతారు. మీకు శక్తినిచ్చే ఆహారానికి ప్రాధాన్యతనివ్వాలి. శక్తిని నశింపచేసే ఆహారాలకు దూరంగా ఉండాలి.

జీర్ణకోశ సమస్యలు

జీర్ణకోశ సమస్యలు

సరైన ఆహారం తీసుకోకపోతే జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. కచ్చితంగా మీరు డైట్ మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది అనడానికి ఇది గమనించదగ్గ లక్షణం.

Culantro Cilantro
It is also known as spiny coriander or long-leaf coriander. In India, it is known as 'bandhania'. It is also known as Mexican coriander or Mexican parsley. In India, it is known as 'dhania.'
It is a biennial plant with a life span of two years. It is an annual plant.
The leaves are more pungent (around 10 times) compared to cilantro. The leaves are less pungent than culantro.
The leaves are tougher and can be boiled at a high heat without damage. The leaves are delicate and soft, the reason why it is added only after the food is prepared.
The leaves are long with several small yellow spines. The leaves are small and lacy with no spines
The leaves grow on thick short stem and are arranged spirally. The leaves grow higher above the ground on a thin stem.
The flowers of culantro are blue and have spines too. The seeds are naturally present in the flower, making the plant self-seeding. The flowers are whitish and have no spines.

Desktop Bottom Promotion