Latest Updates
-
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.!
మహిళలు బాడీ స్లిమ్ గా పొందడానికి 11 ఈజీ టిప్స్
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలికి తగ్గట్టుగానే విపరీతమైన బరువును భరిస్తూ... అందవిహీనంగా మారుతున్నారు. మళ్ళీ బరువు తగ్గాలంటూ ఎంతో కష్టపడతారు. ప్రతిరోజూ వ్యాయామం, డైటింగ్ వంటివి చేస్తూనే ఉంటారు. కాని బరువు తగ్గటంలో ఫలితాలు తక్కువగానే ఉంటూ ఉంటాయి. కాని కొన్ని సార్లు వారికి తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతూంటాయి.
సన్నగా కనబడడానికి చాలామంది టీనేజ్ మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. స్లిమ్ గా మారేందుకు రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి. READ MORE: జిమ్ తో పొట్ట తగ్గదు... ఈ ఔషదాలతో పొట్ట మాయం... బాడీ స్లిమ్
సన్నగా, నాజూగ్గా కావాలని కోరుకునేవారు చాలామందే ఉంటారు. అయితే నలుగురూ లావుగా ఉన్నావంటూ వెక్కిరిస్తున్నారనే తొందరలో అప్పటికున్న ఆరోగ్య పరిస్థితులు, శారీరక, మానసిక సామర్థ్యాలను పట్టించుకోకుండా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డైటింగ్ చేసేస్తే నాజూకుతనం మాట ఎలా ఉన్నా, ఉన్న ఆరోగ్యానికే ముప్పు ఏర్పడి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డైటింగ్ చేయబోయే ముందు కొన్ని నియమ నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో చూద్దాం!

సరైన సమయం పాటు నిద్ర
నిద్ర లేకపోవటం వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలతో పాటు బలహీనంగా అవుతారు. ప్రతి రోజు 8 గంటల సమయం నిద్ర అవసరం. నిద్ర సరిగా పోవటం వలన ఆరోగ్యం సరిగా ఉంటుంది మరియు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురవరు.

ఎక్కువ నీటిని తీసుకోండి
కనీసం ప్రతి రోజు 2 నుండి 3 లీటర్'ల నీటిని తాగటానికి ప్రయత్నించండి. కెఫీన్ మరియు టీలను తక్కువగా తాగండి కారణం వీటి వలన నిద్రాభంగం కలిగే అవకాశం ఉంది. ఎక్కువ నీటిని త్రాగటం వలన పేగులు శుభ్రం చెంది జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది మరియు జీర్ణక్రియలో ఎలాంటి సమస్యలు కలుగవు. నీటి వలన ఇలాంటి ఉపయోగాలు మాత్రమె కాకుండా, సరైన స్థాయిలో నీటిని తీసుకోవటం వలన మెరిసే చర్మాన్ని కూడా పొందుతారు.

అల్పహరాన్ని మరవకండి
మీరు రోజు ఉదయాన అల్పహారణ సేకరణను మాత్రం మరవకండి. విటమిన్ మరియు ప్రోటీన్'లు అధికంగా ఉన్న ఆహారాలను అల్పాహారంగా తీసుకోండి. అంతేకాకుండా, మంచి కొవ్వు పదార్థాలను అందించే వాటిని కూడా మీ అల్పహారంలో కలుపుకోవటం మర్చిపోకండి.

చల్లటి ద్రావణాలను తాగకండి
మీ శరీరానికి కావలసిన వాటిని అందించండి, అంతేకాకుండా ఫ్రిజ్'లో ఉండే చల్లటి ద్రావణాల వంటి అవసరం లేని వాటికి కూడా దూరంగా ఉండండి. కారణం ఈ ద్రావణాలు పోషకాలను కలిగి ఉండకుండా, మీ శరీర బరువును మాత్రమె పెంచుతాయి. చల్లటి ద్రావణాలను ఎక్కువగా తీసుకోవటం వలన మీ శరీరంలోని ఎముకలు మరియు దంతాలను క్రమంగా నశింపచేస్తాయి అని పరిశోధనలలో వెల్లడయింది.

ఒత్తిడి తగ్గించటం
ఈ మారుతున్న కాలంలో మన పనిలో కానీ లేదా ఇతరేతర సమస్యల వలన ఒత్తిడికి చాలా సాధారణంగా గురవుతుంటాము వీటి వలన మన జీవన శైలిలో మార్పులు కూడా సహజం అని చెప్పవచ్చు. కావున, ఈ ఒత్తిడులను జయించి, మీ కండరాలను విశ్రాంతి పరచి, ఆరోగ్యాకరమైన శరీరాకృతిని పొందటం చాలా అవసరం. ధ్యానం, యోగా, మరియు శ్వాస సంబంధిత వ్యాయామాల వంటి పద్దతులను అనుసరించటం వలన ఒత్తిడి నుండి ఉపశమనం పొంది మీ ఆరోగ్యాన్ని మరియు శరీరాకృతిని పొందవచ్చు

వ్యాయామాలు
వారంలో కనీసం 4-5 సార్లు, 30-40 నిమిషాల వరకు వ్యాయామాలు చేయాటం తప్పని సరి. జాగింగ్, వాకింగ్ వంటి సాధారణ వ్యాయమాల ద్వారా మీరు మంచి శరీర ఆకృతిని పొందవచ్చు. ఇలా చిన్న చిన్న వ్యాయమాల ద్వారా మీ శరీరంలో ఉండే అధిక కొవ్వు స్థాయిలు కరిగిపోతాయి.

పచ్చని ఆకుకూరలను మరవకండి
పచ్చని ఆకుకూరలు మరియు పాల ఉత్పత్తులు మీ రుచి గ్రంధులను సంతృప్తి పరుస్తాయి, అంతేకాకుండా ఇవి మానవ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. పచ్చని ఆకుకూరలు ఐరన్, విటమిన్ 'B' మరియు కాల్షియం వంటి మూలకాలను కలిగి ఉంటాయి. కనీసం వారానికి రెండు సార్లు ఆకుకూరలను మరియు రోజులో ఒకసారైన పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోండి

వివిధ రకాలను కలపండి
ఆరోగ్యకరమైన ఆహరం తినటం చాలా ముఖ్యం కానీ తినే ఆహారంలో వివిధ రకాలు ఉండటం కూడా చాలా అవసరం. మీరు తినే ఆహారానికి వివిధ రకాలను కలపడం వలన, శరీరానికి కావలసిన మరియు శరీరానికి అందని పోషకాలు కూడా పొందవచ్చు. కావున రోజు ఒకే రకమైన ఆహర పదార్థాలను మాత్రమె కాకుండా మీ ఆహరంలో వివిధ రకాల ఆహార అంశాలను కలపండి

ఆహరం సరిగ్గా తినండి
మీ జీర్ణాశయం సహాయం అందించుటకు మీరు తినే ఆహరాన్ని సరిగ్గా నమలండి. ఆహరాన్ని మింగటానికి ముందుగా కనీసం 32 సార్లు నమలటం తప్పని సరి. కావున ఆహరం తినేటపుడు నెమ్మదిగా తినండి. మీరు తినే ఆహర పరిమాణం పెద్దగా ఉన్నట్లయితే జీర్ణం చెందించుటకు చాలా సమయం పట్టవచ్చు

మీ ఫోన్ ఆఫ్ చేయండి
మీరు పాడుకోటానికి ముందుగా ఫోన్ మరియు ఇతరేతర విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయండి. వీటి వలన వచ్చే రేడియేషన్ వలన ఆరోగ్య సమస్యలు మాత్రమె కాకుండా నిద్రాభంగం అయ్యే అవకాశం ఉంది.

నవ్వే ముఖంతో మేల్కొండి
నిన్నటి రోజులో ఉండే సమస్యలను గుర్తు తెచ్చుకుంటూ లేవటం వలన ప్రస్తుత సమయాన్ని నాశనం చేస్తుంది. కావున మీ రోజును చిన్న నవ్వుతో ప్రారంభించండి మరియు మీ సమస్యలను అధిగమిస్తాను అనే ఉద్దేశ్యంతో నిద్రలోంచి మేల్కొనండి. మంచి ఆశతో, శక్తివంతమైన దృడ నమ్మకంతో రోజును ప్రారంభించండి.



Click it and Unblock the Notifications
