Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
దంపతులిద్దరూ బరువు తగ్గించుకొనే టాప్ 10 సెక్సీ మార్గాలు..
సరైన వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గించుకోవచ్చు. పౌష్టికాహారం తీసుకుంటూ శరీరంలో ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు...కానీ రొమాంటిక్ గా కానీ రొమాంటిక్ గా బరువు తగ్గడం గురించి మీరెప్పుడైనా..ఎక్కడైనా విన్నారా...? ఏముంది..పాట్నర్స్ ఇద్దరూ కలిసి చేసే కొన్ని రొమాంటిక్ పనులు ద్వారా శరీర బరువును కంట్రోల్ చేసుకోవచ్చు అనుకుంటారందరు! అవును, ఖచ్చితంగా అది నిజమనే చెబుతున్నాయి కొన్ని హెల్త్ స్టడీస్..
ఫ్రెండ్లీగా బరువు తగ్గించే టాప్ 10 వెయిట్ లాస్ ఫుడ్స్
శరీరంలో కొవ్వు తగ్గాలని శ్రమ పడుతున్న వారు, ట్రెడ్ మిల్స్, జోగింగ్ వంటివి తగ్గించలేకపోతున్నాయా? మరిక... కొత్త వ్యాయామం ఒకటి మొదలుపెట్టండి. అదే....రొమాంటిక్ క్రీడ! ఇకపై ట్రెడ్ మిల్, దూరం నడవటం, లేదా ఆహారం తగ్గించటం, మీ కిష్టమైన రుచులు కోల్పోవటం వంటివి చేయకండి. తాజాగా ఒక వ్యాయామ నిపుణుడు సూచించిన మేరకు దంపతులిద్దరు కలిసే చేసే వ్యాయామ క్రీడలు ఇద్దరి మద్య బందాన్ని బలపరచడం మాత్రమే కాదు బరువు తగ్గించే మార్గం కూడా ఇదే అంటున్నారు కొందరు పరిశోధకులు.
బరువు తగ్గించుకోవడానికి ఉదయం తీసుకొనే టాప్ 10 ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ...
రొమాటింక్ గా బరువు తగ్గడమనేది కేవలం భార్యాభర్తలిద్దరికి మాత్రమే సంబంధించిన అంశం. అది కలిసి వ్యాయామం చేయడం కావచ్చు.. మరే ఇతర పనుల ద్వారానైనా కావచ్చు...ఇలా రోజువారీ జీవితంలో ఇద్దరూ కలిసి చేసే కొన్ని పనులు, వ్యాయామాలు చేయడం వల్ల వారు మరింత ఫిట్ గా తయారవ్వడం మాత్రమే కాదు, ఇద్దరి మద్య అనుబంధం మరింత రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. మరి పాట్నర్స్ చేయగలిగే బరువు తగ్గించే రొమాటిక్ పనులేంటో తెలుసుకుందాం...

1. డ్యాన్స్ ద్వారా బరువు తగ్గించుకోవడం:
చక్కటి శరీర సౌష్టవాన్ని అందించే ఫిట్ నెస్ డ్యాన్సులు చాలానే ఉన్నాయి. వాటిలో పోల్ డ్యాన్స్ ఒకటి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం మాత్రమే కాదు...శరీరంపై ఒత్తిడి కలిగించి పేరుకుపోయిన అనవసర కొవ్వుల్లి కరిగించడంలో తోడ్పడుతుంది. ఫలితంగా నాజూగ్గా, ఫిట్ గా తయారుకావచ్చు. అందుకే ఆసక్తి ఉన్నవారు దీన్ని ఒక్కరే కాకుండా ఈసారి జంటగా ప్రయత్నించి చూడండి. పోల్ డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చే సంస్థలు ఇప్పుడు చాలానే ఉన్నాయి. ఈ డ్యాన్స్ లోని వివిధ భంగిమలు దంపతులకు సంపూర్ణ ఫిట్ నెస్ ను అందించడంతో పాటు ఇద్దరి మద్య అన్యోన్యతను మరింతగా పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

2. ట్రేడ్ మీల్ పైన పరుగు:
ఇద్దరూ కలిసి జిమ్ కు వెళ్ళడం, అక్కడ ట్రేడ్ మీల్ మీద పరుగు , జాగింగ్ వంటివి ఇద్దరూ ఫిట్ గా ...స్లిమ్ గా కనబడుటకు సహాయపడుతుంది. హెల్తీ మార్గంలో బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి మార్గం.

3. జాగింగ్:
ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేచి కనీసం అరగంట పాటు జాగింగ్ కు వెళ్ళడం వల్ల ఇద్దరూ సమయంగా బరువు తగ్గుతారు.

4. బైక్ రైడ్:
స్టైలిష్ లుకింగ్ కార్లో రైడ్ కు వెళ్లడానికి బదులు, సైకిల్ తొక్కుతూ రొమాటిక్ ప్రదేశాలను చుట్టి రావడంలో ఉండే ఆనందం..ఫిట్ నెస్ మరొకటి ఉండదు . ఈ సైక్లింగ్ తో కాళ్ళు, తొడల వద్ద వేగంగా బరువు తగ్గించుకోవచ్చు.

5. రతి క్రీడ:
దంపతులిద్దరూ రోజూ రతి క్రీడలో పాల్గొనడం వల్ల దీనికి మించిన వ్యాయామం మరొకటి లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది బరువు తగ్గడానికి ఒక నేచురల్ రెమెడీ.

6. యోగసనాలు :
అదే విధంగా యోగా సాధన చేసే వారు కపుల్ యోగా, శ్రుంగార యోగ వంటివి కూడా ప్రయత్నించవచ్చు. వీటిలో వేసి కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు ద్వారా పొట్ట, కటి ప్రదేశంలో కండరాలు క్రమంగా సంకోచ, వ్యాకోచాలకు లోనవుతాయి. ఫలితంగా వాటిపై ఒత్తిడి పడి అవి మరింత ఫిట్ గా మారతాయి. ఫలితంగా దంపతులిద్దరు దాంపత్య జీవితాన్ని మరింత ఆస్వాధించవచ్చు. తద్వారా వారి మధ్య ఉండే అనుబంధం కూడా మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలాంటి వ్యామాలను నేర్చుకోవడం కోసం దంపతులు సంబంధిత యోగా తరగతుల్ని ఆశ్రయించవచ్చు.

7. బాడీ మసాజ్:
శరీరంలో పేరుకున్న అనవసర కొవ్వుల్ని కరిగించడం మాత్రమే కాదు, అన్ని రకాల ఒత్తిళ్లను తరిమికొట్టి విశ్రాంతిని అందించడంలో మసాజ్ కు ఏదీ సాటి రాదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇందుకోసం స్పా సెంటర్లను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే దంపతులిద్దరూ ఒకరికొకరు మసాజ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో మసాజ్ తో పాటు శరీరంపై తేలికపాటి ఒత్తిడి పడేలా చిన్న చిన్న వ్యాయామాలు కూడా కలిపి చేయడం వల్ల కండరాలు బలపడటంతో పాటు, ఇద్దరి మద్య ప్రేమ, సాన్నిహిత్యం, కట్టలు తెచ్చుకుంటుంది. ఇది దాంపత్య జీవితానికి ఎంతో అవసరం కూడా..

8. డైటింగ్:
ఇద్దరూ కలిసి స్ట్రిట్ డైట్ ను ఫాలో అవ్వడం వల్ల కూడా వేగంగా బరువు తగ్గించుకోవచ్చు . డైట్ లో ఫైబర్ అధికంగా...క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి . అంతే కాకుండా ఎనర్జీ ఫుడ్స్ ను కూడా చేర్చుకోవచ్చు.

9. ఇంటిపనులు:
పాట్నర్స్ ఫిట్ నెస్ సొంతం చేసుకోవాలనుకుంటే కేవలం వ్యాయామాలొక్కటే మార్గం కాదు..వీటికి ఇంటిపనుల్ని కూడా జత చేస్తే అటు స్ట్రాంగ్ గా మరియు ఆనందం ఒకేసారి పొందవచ్చు. ఇందులో భాగంగా వంట చేయడం, ఇంటిపనులు, గార్డెనింగ్...వంటి రోజువారి పనుల్ని కూడా కలిసి రొమాంటిక్ గా చేయవచ్చు. ఫలితంగా శారీరక శ్రమ కలిగి..అది శరీర బరువుని క్రమంగా తగ్గించే వీలుంటుంది. అలాగే వీటి వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం, ఆప్యాయత కూడా పెరుగుతాయి. పనికూడా సులువుగా అయిపోతుంది.

10. డిన్నర్ వాక్ :
రాత్రుళ్లు భోజనం తరవ్ాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ బయట కాసేపు అటూ ఇటూ వాక్ చేయడం వల్ల శరీరంలో కొవ్వులు పేరుకోకుండా ఉండటంతో పాటు ఇద్దరూ ఒకరి గురించి మరొకరు విషయాలు తెలుసుకునే వీలుంటుంది.



Click it and Unblock the Notifications











