Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
ఒకే ఒక్కనెలలో బెల్లీ ఫ్యాట్ కరిగించే.. ఫ్యాట్ రిచ్ ఫుడ్స్..!!
ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ ఏంటి.. బరువు తగ్గించడం ఏంటి అని చాలా మంది షాక్ అవుతూ ఉంటారు. బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ నిజంగానే సహాయపడతాయా అన్న డౌట్ వస్తుంది. అయితే.. ఫ్యాట్ ఫుడ్స్ చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఫ్యాట్ ఫుడ్స్.. హెల్తీ ఫ్యాట్స్ ని అందిస్తాయి.
హెల్తీగా ఉండటానికి, శరీరానికి హెల్తీ ఫ్యాట్స్ చాలా ముఖ్యమైనవి. కాబట్టి.. బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి మీరు ఇబ్బందిపడుతుంటే.. మీకో సింపుల్ డైట్. ఎంత కష్టపడినా.. ఫలితం పొందడం లేదంటే.. మీ డైట్ లో ఖచ్చితంగా.. హెల్తీ ఫ్యాట్స్ ని చేర్చుకోవాలి.
మీకు చాలా పెద్ద నడుము ఉందంటే.. అన్ హెల్తీగా కనిపిస్తుంది. మీ ఫిజిక్ నే అసహ్యంగా మారుస్తుంది. అలాగే బెల్లీ ఫ్యాట్ ఉంటే.. ఒబేసిటీ, కార్డియోవాస్క్యులర్ డిసీజ్, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్ , కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
కాబట్టి మీరు న్యాచురల్ గా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలని భావిస్తే.. ఈ హెల్తీ ఫ్యాటీ పుడ్స్ ని డైట్ లో చేర్చుకోండి. ఈ డైట్ తో పాటు, వ్యాయామం కూడా చేస్తే.. మీరు ఊహించనిరీతిలో నెలలోనే.. మీ బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.

కొబ్బరి
కొబ్బరినూనె, కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి అన్నింటిలోనూ.. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగుపరిచి.. బెల్లీ ఫ్యాట్ వేగంగా కరగడానికి సహాయపడుతుంది.

ఓలివ్
ఓలివ్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు.. బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి ఎఫెక్టివ్ గా ఉపయోగపడతాయి. అలాగే ఆలివ్స్ టైప్ టు డయాబెటిస్ ని నివారిస్తాయి.

బీఫ్
బీఫ్ ని హై క్యాలరీ ఫుడ్ గా పరిగణిస్తారు. ఇది లినోలీక్ యాసిడ్ కలిగి ఉంటుంది. ఇది.. బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది. ఆర్గానిక్ బీఫ్ బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది.

అవకాడో
ఈ అవకాడో ఫ్రూట్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బెల్లీ ఫ్యాట్ ని కరిగించడంలో సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఒలెక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ.. బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.

చేపలు
సాల్మన్ వంటి చేపలను ఫ్యాటీగా భావిస్తారు. కానీ.. వాటిల్లో ఆస్తాక్సియాంథిన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి.. బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో చాలా సహాయపడతాయి.

బాదాం
బాదాంలో విటమిన్ ఈ, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. వీటిని.. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ని ఎఫెక్టివ్ తగ్గించి, కణాలకు పోషణ అందిస్తాయి.



Click it and Unblock the Notifications