Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
స్త్రీలు బరువు పెరగడానికి గల 8 కారణాలు
ఈ మధ్య కాలంలో స్త్రీలలో అధిక బరువు సమస్య బాగా పెరిగిపోతోంది.అకస్మాత్తుగా పెరిగిన బరువుతో బాధ పడే స్త్రీలు దాదాపు ఒక మిలియన్మంది ఉన్నారు.ఇలా అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ లాంటి జబ్బులు కూడా పెరుగుతున్నాయి.
వీటిని నివారించాలంటే స్త్రీలు తమ బరువు మీద ఓ కన్నేసి ఉంచాలి.తాను తినే ఆహారంలో ఉన్న కేలోరీల గురించి స్త్రీలు ఒక అవగాహనతో ఉండాలి. ఎన్ని కేలోరీలు అధికంగా తీసుకుంటే అంత అధిక బరువు పెరుగుతారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం హార్మోన్ల అసమతుల్యత, కొన్ని రకాల మందులు స్త్రీలలో బరువు పెరగడానికి ఒక కారణం.అందువల్ల గర్భ నిరోధక మందులు, ఇన్సులిన్ వంటివి వాడేముందు మీ ఫ్యామిలీ డాక్టరుని సంప్రదించి ఈ మందుల దుష్ప్రభావాలని తెలుసుకోవడం మంచిది.మీ శరీరం మీద దుష్ప్రభావం చూపని మందులు తీసుకుంటే బరువు పెరిగే సమస్య ఉండదు.
అందువల్ల లేడీస్,మేము క్రింద ఇచ్చిన కారణాలలో అసలు మీరు బరువు పెరగడానికి గల అంతర్గత కారణాన్ని వెతికి మీ పెరిగిన బరువుకి గల కారణాలు తెలుసుకుని అవసరమయితే వైద్యపరమైన సహాయం తీసుకోండి.

హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి:
మగవారితో పోల్చుకుంటే స్త్రీలలో ఒత్తిడి అధికం.ఈ ఒత్తిడి నిశ్శబ్దంగా హాని కలిగిస్తుంది. ఒత్తిడిని ఎదుర్కోవడానికి అడ్రినల్ గ్రంధులు కార్టిసోల్ ని అధికంగా స్రవించడం వల్ల బరువు పెరుగుతారు.

సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం:
ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే స్త్రీలు చాలా తొందరగా బరువు పెరుగుతారు. మీరు కనుక ఒకసారి భోజనాన్ని మానెస్తే బరువు తగ్గుతారని అనుకోకండి.మీరు మరిన్ని కిలోలు పెరుగుతారు.హై కేలొరీ పదార్ధాలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు.

మందులు:
స్త్రీలు వాడే మందులు కూడ బరువు పెరగడానికొక కారణం. కొన్ని మందులవల్ల దుష్ప్రభావాలుండి బరువు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణుల సూచన.అందువల్ల డిప్రెషన్, మధుమేహం,గర్భ నిరోధక మాత్రల వంటివి వాడేముందు మీ వైద్యుడిని సంప్రదించి ఈ మందులవల్ల కలిగే దుష్ఫలితాలని తెలుసుకోవడం మంచిది.

ఇన్సులిన్:
మహిళల్లో 35 సంవత్సరాలు దాటిన తరువాత తెల్లని పదార్ధాలైన మైదా, పంచదారా వంటి పదార్ధాలు తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం వాటిల్లుతుంది.ఈ తెల్లటి పదార్ధాలలో కేలోరీలు, చక్కెరల శాతాలు అధికంగా ఉంటాయి.ఒకవేళ మీరు కనుక ఇన్సులిన్ తీసుకుంటూ ఈ తెల్లటి పదార్ధాలు కనుక తీసుకుంటూ ఉంటే మీ శరీర కణాలు ఇన్సులిన్ నిరోధకంగా తయారవుతాయి.

బద్ధకం:
శారీరకంగా పెద్దగా శ్రమ కలిగించని వర్కవుట్లవల్ల ఉత్సాహం తగ్గి డల్లు్‌గా అవుతారు. అందువల్ల అకస్మాత్తుగా బరువు పెరిగే అవకాశం ఉంది.అందువల్ల ఎప్పుడూ మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుకుంటూ, ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తే మీ జీవక్రియలు వేగవంతమయ్యి కేలోరీలు కరిగి బరువు పెరిగే సమస్య ఉండదు.

పెరిగిన ఆకలి:
ఆకలి పెరిగితే శరీరానికి చాలా నష్టం.ఆకలి ఎక్కువయ్యి మీరు అతిగా తినడం మొదలెడితే కేలోరీలు కావాల్సిన దానికన్నా అధికంగా శరీరంలో చేరి క్రొవ్వులా రూపాంతరం చెంది బరువు పెరుగుతారు.

వయస్సు మీద పడటం:
వయస్సు పెరిగే కొద్దీ శరీరం నీరస పడిపోతూ ఉంటుంది.అందువల్ల శరీరకంగా శ్రమ తీసుకుని ఎక్సర్సైజులూ అవీ చెయ్యడానికి ఉత్సాహం ఉండదు.జీవక్రియలు మందగించడంవల్ల కూడా కేలోరీలు కరగక క్రొవ్వు రూపంలో నిలువ చేయబడి బరువు పెరుగుతారు.



Click it and Unblock the Notifications











