Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే ఆయుర్వేదిక్ రెమెడీస్ ..
ప్రస్తుతం ఎక్కడ చూసినా అధిక బరువు, స్థూలకాయం సమస్యలతో బాధపడుతున్న వారు అధికంగానే కనిపిస్తున్నారు. కారణాలేమున్నా ఒకసారి బరువు పెరిగితే దాన్ని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిత్యం వ్యాయామం, వేళకు తగిన పౌష్ఠికాహారం తీసుకోవడం తప్పసరి అయింది. ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, హెల్తీగా బరువు తగ్గించుకోవాలనుకుంటే ఆయుర్వేదం చాలా ఫర్ఫెక్ట్ అని చెప్పవచ్చు .
ఆయుర్వేదం ప్రకారం బరువు తగ్గించుకోవడానికి, పొట్ట కరిగించుకోవడానికి ముందుగా ఆయుర్వేదం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆయుర్వ్ అంటే ఆయుష్యు(దీర్ఘకాలం జీవించడం). వేద అంటే సైన్స్ . ఈ రెండు పదాలను చేర్చితే సైన్స్ ఆఫ్ లైఫ్ ని అర్ధం వస్తుంది,. ఆయుర్వేదాన్ని మన ఇండియాలోనే కనుగొనడం జరిగింది. ఇది పురాత కాలంలోని ఔషధ పద్దతి .
బరువు , ఫ్యాట్ కరిగించుకోవడానికి పురాతన పద్దతులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . ఆయుర్వేదం ప్రకారం వ్యాధులకు మూలకారణం గుర్గించడం ద్వారా శాస్వతంగా పరిష్కరించుకోవడానికి మార్గాలను సూచిస్తుంది. బరువు తగ్గించుకోవడంలో ఆయుర్వేదంలో బాడీ టైప్ ను బట్టి, వారికి సూటబుల్ గా ఉండే పదార్థాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. రువు సమస్యలతో పోరాడటం కోసం ఆయుర్వేద పధ్ధతులు బాగా సహాయపడి ఆరోగ్యకరమైన జీవనశైలి మొదలుపెట్టువచ్చు. అంటే మీరు ప్రతి రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, మరియు రాత్రి కూడా త్వరగా నిద్రకు ఉపక్రమించాలి. ఎందుకంటే మన శరీరం కూడా ఒక గడియారంలా పనిచేస్తుంది. ఈ టైమ్ లో ఇదేచేయాలి, అని నిర్ధేశించుకుంటుంది. ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి మీ ఆహారపు అలవాట్ల ద్వారా తెలుస్తుంది.
ఆయుర్వేదంలో , కాలానుగుణ లభించే పండ్లు మరియు కూరగాయలు తీసుకోమని ఊబకాయగ్రస్తులకు నిపుణులు సలహా ఇస్తుంటారు . అధిక ప్రోటీనులుండే నేచురల్ ఫుడ్స్ మరియు పండ్లు ద్వారా ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారు. ఆయుర్వేదంలో బరువు తగ్గించే పద్దతులను పాటిస్తున్నట్లైతే ప్రిజర్వేటివ్స్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు తప్పనిసరిగా నివారించాలి. అదనపు కొవ్వును త్వరగా మరియు ఎఫెక్టివ్ గా కరిగించుకోవడానికి ఇక్కడ కొన్ని ఆయుర్వేద స్పూర్తితో ఇచ్చిన చిట్కాలు ఉన్నాయి. కింద పేర్కొన్న 'ఆయుర్వేద' సూచనలు పాటిస్తే అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

కరివేపాకు:
కరివేపాకు సౌత్ ఇండియన్ కుషన్స్ చాలా ముఖ్యమైనది. కరివేపాకు శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. దాంతో ఆటోమాటిక్ గా టమ్మీ వద్ద ఉండే కొవ్వు కరగడం ప్రారంభమౌతుంది.

ఫ్లాక్స్ సీడ్స్ :
ఫ్లాక్ సీడ్స్ లేదా ఫ్లాక్స్ ఆయిల్ హార్ట్ కండీషన్ సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ లెవల్ తగ్గిస్తుంది, బరువు తగ్గిస్తుంది. ఫ్లాక్సీడ్ ఆయిల్ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెటబాలిజం పెంచడానికి సహాయపడుతుంది, దాంతో ఫ్యాట్ కరుగుతుంది . బరువు తగ్గించుకోవడంలో ఫ్లాక్సీ ఆయిల్ బెటర్.

సోంపు:
సోంపు ఇంట్లో ఉండే ఔషది. ఇందులో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇది మెటబాలిక్ రేట్ పెంచుతుంది. ఆకలి తగ్గిస్తుంది. టాక్సిన్ ఫ్లష్ అవుట్ చేస్తుంది. బ్లడ్ ఫ్యూరిఫై చేస్తుంది. సోంపుగింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి మార్నింగ్ పరగడపున తాగాలి.

నీళ్ళు:
రోజుకు సరిపడా నీరు తాగాలి. బరువు తగ్గడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక రోజుకు కనీసం 8 గ్లాసుల నీరైనా తాగాల్సిందే . ఇది ఫ్యాట్ ను ఫ్లష్ చేయడం మాత్రమే కాదు చర్మానికి మంచి షైనింగ్ గ్లో అందిస్తుంది. హెయిర్ హెల్తీగా పెరుగుతుంది. మొత్తం బాడీ రేడియంట్ గా మెరిసిపోతుంది.

మెంతులు:
ప్రతి ఇండియన్ వంటింట్లో మెంతులను, మెంతి ఆకులను తరచుగా వాడుతూ ఉంటారు. అయితే బరువు తగ్గించడానికి మెంతి ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కొంతమందికే తెలుసు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యాట్ ని కరిగిస్తుంది. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. దాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అలాగే మెంతులను కొద్దిగా వేయించి..సలాడ్స్, పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.

గుగ్గుల్:
బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో గుగ్గుల్ ఒక ముఖ్యమైన రెమెడీ. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. మెటబాలిక్ రేటు పెంచుతుంది , లివర్ లో ఫ్యాట్ కరిగిస్తుంది . థైరాయిడ్ గ్రంథిని క్రమబద్దం చేస్తుంది. రెగ్యులర్ డైట్ లో గుగ్గుల్ చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు . కరెక్ట్ డోస్ తీసుకోవడానికి ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి..

త్రిఫల:
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడంలో త్రిఫల పౌడర్ ను రెకమెండ్ చేశారు. 2 టేబుల్ స్పూన్ల త్రిఫల చూర్ణాన్ని అరలీటరు నీటిలో కలపాలి. దీన్ని 5 నిమిషాల వరకు వేడి చేయాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టగా వచ్చే నీటికి తేనెను కలపాలి. దీన్ని రోజుకి 2 సార్లు తీసుకోవాలి.

అల్లం:
అల్లంను వేడినీటిలో వేసి మరిగించి, దీనికి తేనె, పెప్పర్ మిక్స్ చేసి, మరో 5నిముషాలు మరిగించి తాగడం వల్ల పొట్టబాగంలో కొవ్వు ఎఫెక్టివ్ గా కరుగుతుంది,. అల్లం మరియు మిరియాలు జోడించడం వల్ల మెటబాలిక్ రేట్ పెరుగుతుంది.

దాల్చిన చెక్క:
ఫ్యాట్ బర్నర్ గా దాల్చిన చెక్క గ్రేట్ గా సహాయపడుతుంది,. అరటీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ను నీటిలోమిక్స్ చేసి 5 నిముషాలు మరిగించి తర్వాత వడగట్టి, బ్రేక్ ఫాస్ట్ కు ముందే గోరువెచ్చగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే బెడ్ టైమ్ లో కూడా తాగవచ్చు.

అలోవెరా జ్యూస్
అలోవెరా జ్యూస్ చాలా త్వరగా బెల్లీ ఫ్యాట్ కరిగించాలని మీరు భావిస్తే.. ఆలో వెరా జ్యూస్ తాగడం మంచిది. అలోవెరా జెల్ అబ్డామినల్ ఫ్యాట్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

లెమన్ మరియు హని మ్యాజిక్
లెమన్ మరియు హని మ్యాజిక్ చేస్తే ఈ కాంబినేసన్ వాటర్ కు పెప్పర్ పౌడర్ జోడించడం వల్ల అద్భుతం జరగుతుంది . ఇది కంపల్సరీ కాకపోయినా.. వేగంగా బరువు తగ్గించుకోవాలనుకొనే వారు ప్రతి రోజూ ఉదయం తాగే లెమన్ హనీ వాటర్ లో పెప్పర్ పౌడర్ జోడించాలి.



Click it and Unblock the Notifications











