Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
మార్నింగ్ ఫుడ్స్: బరువు తగ్గించే టాప్ 10 ప్రోటీన్ రిచ్ ఫుడ్స్
నిత్య జీవితంలో హెల్తీగా మరియు ఫిట్ గా ఉండటానికి మరియు అనారోగ్యాలకు దూరంగా ఉండటానికి ప్రోటీన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కావున మనం రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ల స్థాయిలు తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి. శరీరానికి అవసరమయ్యే స్థాయిలో ప్రోటీన్ లను తీసుకునే వారిని, ప్రోటీన్లను తీసుకోని వారితో పోలిస్తే, తీసుకునే వారు ఎక్కువ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం మంచి అలవాటుగా, మార్గంగా చెప్పవచ్చు. వీటి వలన కడుపు నిండినట్లుగా అనిపించి, రోజంతా లోరీలు ఎక్కువగా అందించే ఆహార సేకరణకు దూరంగా ఉండేలా చేస్తాయి.
అంతేకాకుండా, ప్రోటీన్లు శరీరాన్ని మరమ్మత్తులకు గురి చేసి, బాడీ మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. మీ శరీర కండరాలను పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ప్రోటీన్లు మంచి మార్గంగా చెప్పవచ్చు. అదేవిధంగా మీ శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా?అయితే రోజు ఉదయాన్నే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, కండర అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. వీటిని కనుక మీరు అనుసరించినట్లైతే తప్పనిసరిగా బరువు తగ్గించుకోగలుగుతారు.

పెరుగు:
ప్రోబయోటిక్ ఫుడ్స్ డైట్ లో ఎనర్జిటిక్ ఫుడ్స్ . అంతే కాదు బరువు తగ్గించడంలో కూడా ముఖ్యపాత్రపోషిస్తుంది. ఉదయం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ ట్రాక్ శుభ్రపడుతుంది . దాంతో వ్యాధులను దూరం చేస్తుంది.

గుడ్డు:
బరువు తగ్గించే ప్రోటీన్ ఫుడ్స్ లో శక్తివంతమైనది గుడ్డు. గుడ్డులోని పచ్చసొన కంటే తెల్ల సొన ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ప్రోటీన్స్, క్యాల్షియం పుష్కలంగా అంది, ఎనర్జినీ అందివ్వడంతో పాటు, బరువు తగ్గిస్తాయి.

త్రుణ ధాన్యాలు:
లెంటిల్స్ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించడంతో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

బ్రౌన్ రైస్:
బ్రౌన్ రైస్ ను డైలీ డైట్లో చేర్చుకవోడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు . ప్రోటీనులు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కూడా బ్యాలెన్స్ చేసుకోచ్చు.

బాదం:
బాదం ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం సాల్ట్ లేని బాదంపప్పును తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం తీసుకుంటే మరింత ప్రయోజనకరం.

పచ్చిబఠానీలు:
పచ్చిబఠానీలు: 1 కప్పు పచ్చిబఠానీల్లో 3గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి . ఇది బెస్ట్ వెయిట్ లాస్ ఫుడ్. ఇది శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్స్ మరియు ఫైబర్ ను అందిస్తుంది . వీటిని పచ్చిగా లేదా ఉడికించి తీసుకోవచ్చు.

పీనట్స్:
1/4కప్పు పీనట్స్ లో 9గ్రాములు ప్రోటీనులున్నాయి . ఈ పీనట్స్ బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తుంది మరియు మూడ్ పవర్ పెచంుతుంది. ఫొల్లెట్ అధికంగా ఉండటం వల్ల గ్రేట్ గా సహాయపడుతుంది.

మష్రుమ్:
ఒక సర్వింగ్ కు 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్స్ మాత్రమే కాదు, మష్రుమ్ లో సెలీనియం మరియు ఫెర్టిలిటి మరియు మజిల్ బిల్డింగ్ మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

లోఫ్యాట్ డైరీ మిల్క్:
మీరు బరువు తగ్గించుకోవాలని చూస్తుంటే మీ రెగ్యులర్ డైట్ లో పనీర్, టోఫు స్లిమ్ మరియు లోఫ్యాట్ మిల్క్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. జిమ్ లో కోల్పోయిన క్యాలరీలను ఇలా డైరీప్రొడక్ట్స్ తో బ్యాలెన్స్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications