Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో అద్భుతాలు చేసే.. టీ ఫ్లేవర్స్..!!
ఫ్యాట్ అనేది చాలా కామన్ విషయం. ఎందుకంటే.. ప్రతి ఒక్కరూ దీన్ని ఫేస్ చేస్తున్నారు. ఫ్యాట్ వల్ల ఒక వ్యక్తి ఆకర్షణపై ప్రభావం చూపుతుంది. మీరు అందంగా కనిపించాలంటే.. ఫ్యాట్ లేకుండా.. ఫ్లాట్ టమ్మీ కలిగి ఉండాలి. చాలా కొద్దిగా తిన్నా, కొంచెమే తాగినా కూడా.. పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకుంటుంది.
అన్నింటిలోకెల్లా బెల్లీ ఫ్యాట్ కరిగించడం చాలా కష్టం. మీకు తెలుసా.. ? కొన్ని డ్రింక్స్ వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడతాయి. వ్యాయామం కంటే.. రెండు రెట్టు వేగంగా బరువు తగ్గించడంలో సహాయపడతాయి.. కొన్ని డ్రింక్స్. ఇక్కడ 10 డ్రింక్స్ ఉన్నాయి. ఇవి బెల్లీ ఫ్యాట్ తో పాటు, బాడీ ఫ్యాట్ ని కూడా చాలా వేగంగా, సాధారణంగా తగ్గించడానికి ఎఫెక్టివ్ గా సహాయపడతాయి. మరి ఆ డ్రింక్స్ ఏంటో మీరే చూడండి..

నల్ల మిరియాల టీ
నల్ల మిరియాల్లో పిపెరైన్ ఉంటుంది. ఇది ఫ్యాట్ ని కరిగించడంలో సహాయపడుతుంది. నల్లమిరియాలు, అల్లంను నీటిలో 5 నిమిషాలు ఉడికించాలి. వడకట్టిన తర్వాత.. తేనె కలిపితే.. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ టీ తాగడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.

గ్రీన్ టీ
గ్రీన్ టీలో కెటాచిన్ ఉంటుంది. ఇది ఫ్యాట్ సెల్స్ ని తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ ని కరిగిస్తుంది. ఒక కప్పు హాట్ వాటర్ తీసుకుని అందులో గ్రీన్ టీ బ్యాగ్ వేసి.. 2 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు టీ బ్యాగ్ తీసేసి.. తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే.. మంచి ఫ్లేవర్ టేస్ట్ చేయడంతో పాటు, ఫ్యాట్ కరిగిస్తుంది.

లెమన్ టీ
లెమన్ టీలో డి లెమనిన్ ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ని తగ్గిస్తుంది. టీ ఆకులు, నిమ్మకాయ, చెక్కను ఉడికించాలి. వడకట్టి.. తీసుకోవాలి. అంతే.

బ్లాక్ టీ
బ్లాక్ టీలో ఫోలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా ఉపయోగపడతాయి. నీళ్లు మరిగించి, కొన్ని టీ ఆకులు కలపాలి. 3 నుంచి 4 నిమిషాలు ఉడికించి.. వడకట్టి.. తీసుకోవాలి.

పుదీనా టీ
పుదినలో మెంతాల్ ఉంటుంది. ఇది ఫ్యాట్ సెల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. హాట్ వాటర్ లో పుదీనా ఆకులు వేసి.. 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టి.. తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.

దాల్చిన చెక్క టీ
దాల్చిన చెక్కలో పోలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి క్యాలరీలు కరిగించడంలో సహాయపడతాయి. మరుగుతున్న నీటిలో కొన్ని టీ ఆకులు, దాల్చిన చెక్క పొడి, పాలు కలపాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత.. వడకట్టి తీసుకోవాలి.

జీరా టీ
జీలకర్రలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. మరుగుతున్న నీటిలో కొన్ని జీలకర్ర సీడ్స్ కలపాలి. తేనె, నిమ్మ చుక్కలు కలపాలి. టేస్టీగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. బరువు తగ్గడం తేలికవుతుంది.

అల్లం టీ
అల్లంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. మరుగుతున్న నీటిలో అల్లం ముక్కలు కలపాలి. అలాగే కొన్ని తులసి ఆకులు కలపాలి. తర్వాత తేనె కలుపుకుని తీసుకోవడం వల్ల ఫ్యాట్ కరిగించడం తేలికవుతుంది.

తులసి టీ
తులసిలో ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి ఫ్యాట్ సెల్స్ కిల్ చేయడంలో సహాయపడతాయి. టీ ఆకులు, అల్లం, పాలు, తులసి ఆకులు నీటిలో కలిపి.. మరిగించాలి. తర్వాత వడకట్టి.. తీసుకోవాలి.

వాము టీ
వామునే అజ్వైన్ అని పిలుస్తారు. ఇందులో రైబో ఫ్లేవిన్స్ ఉంటాయి. ఇవి ఫ్యాట్ కరిగించడంలో సహాయపడతాయి. వాము, సోంపు గింజలు, యాలకులు, అల్లంను నీటిలో కలపాలి. అన్నింటినీ బాగా మరిగించి.. వడకట్టి.. సేవించాలి. అంతే.. బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications