మీ కడుపుచుట్టూ పేరుకున్న క్రొవ్వును తొలగించుటకు అత్యుత్తమ మార్గాలు:

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే టైట్ ఫిట్ డ్రెస్సులను వేసుకోడానికి సిద్దంగా ఉండరు ఒకవేళ ఈ బట్టలు వేసుకున్నా కూడా కంఫర్ట్ గా ఉండలేరు మరియు నిటారుగా కూర్చొనుటకు ప్రయత్నిస్తుంటారు. ఒక్కోసారి ఈ ప్రయత్నం వారికి వెన్నునొప్పిని కూడా కలిగిస్తూ ఉంటుంది. నిజానికి నిటారుగా కూర్చోవడం ఆరోగ్య లక్షణమే, కానీ వెన్ను నొప్పి కారణంగా శరీరం సహకరించలేకపోవచ్చు. తద్వారా తమకు బెల్లీ( పొట్ట చుట్టూతా చేరిన కొవ్వు) లేదన్నట్లు భ్రమ కల్పించడానికి ప్రయత్నిస్తుంటారు. నిజానికి ఇది చాలా భాధాకరమైన విషయం.

కానీ కొందరు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోయినా వారిలో బెల్లీ ఫాట్ కనపడదు. బెల్లీ ఫాట్ కి అసలు కారణం, అనారోగ్య అలవాట్లు , ఆహారపద్దతులే.

నిజానికి ఈ బెల్లీ ఫాట్ అత్యంత ప్రమాదకారి, ముఖ్యంగా పొట్టలోని కొవ్వు(visceral fat). ఈ కడుపులో కొవ్వు పేరుకోవడం ప్రారంభిస్తే, ఎంత వీలైతే అంత త్వరగా దీనికి చెక్ పెట్టె మార్గాలు చూడాలి. లేని పక్షంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాన్సర్, గుండె సంబంధ సమస్యలు, నిద్ర లేమి, మధుమేహం, డిప్రెషన్, వ్యంద్యత్వ సమస్యలు, చివరికి మానసిక వైకల్యానికి(చిత్తచాపల్యం అంటుంటారు) కూడా కారణం అవుతుంది.

ఈమద్యకాలంలో ప్రజలను పీడిస్తున్న సమస్యగా ఈ బెల్లీ ఫాట్ అవతరించింది అనడం అతిశయోక్తికాదు. ఒక వివేకవంతమైన వ్యక్తి ఆలోచనల ప్రకారం, ఇంటర్నెట్లో సమస్యల పరిష్కారాలకై శోధన చేయడం, ట్రైనర్స్ అపాయింట్మెంట్స్ తీసుకోవడం, వ్యాయామాలు చేయడం, కొవ్వు తగ్గించే ఆహారాలను తీసుకోవడం మరియు ఆహారప్రణాళికలో మార్పులు తీసుకురావడం వంటివి చేస్తారు.

Heres One Of The Most Effective Ways To Lose Belly Fat

వీటన్నిటికన్నా ముఖ్యంగా ఉదయాన్నే ఏమీ తినకముందే నిమ్మరసం తీసుకోవడం ఉత్తమమైన మార్గంగా సూచించబడినది. ఇది మంచి గృహవైద్యంగా అనేకమంది సూచిస్తుంటారు. దీనికి ప్రధానకారణం నిమ్మలో విటమిన్ C స్థాయిలు అధికంగా ఉండడమే. పైగా ఇది ఖర్చు తక్కువ. ఇది జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, కాలేయ పనితీరుని కూడా పెంచుతుంది.

మీరు ముఖ్యంగా కడుపులో కొవ్వును తగ్గించుకోవాలని భావిస్తున్నట్లయితే, మీరు మీ జీర్ణక్రియలు మరియు కాలేయం పనితీరు మెరుగ్గా జరిగేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. జీర్ణక్రియలు తగ్గడం , జీవక్రియలపై ప్రభావితం చూపిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. తద్వారా పోషకాలు సరిగ్గా అందక, కడుపులో కొవ్వు పేరుకుపోవడం వలన అనేక సమస్యలు చూడాల్సి వస్తుంది.

నిమ్మ అనేది సిట్రస్ జాతికి చెందినది. అన్నీ సిట్రస్ ఫలాలలో సహజంగా ఉండే లక్షణం ఫైబర్ కలిగి ఉండడం. ఇది ఆకలి కాకుండా చేసి, ఆహారం తక్కువ తీసుకునేలా చూస్తుంది. మరియు కొవ్వు లక్షణాలను కలిగి ఉండదు. సోడియం మరియు కొలెస్ట్రాల్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. కావున శరీరంలోని కొవ్వును హరించుటలో ఉత్తమంగా పనిచేస్తుంది.

Heres One Of The Most Effective Ways To Lose Belly Fat

నిమ్మలో పెక్టిన్ ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ C, సిట్రిక్ యాసిడ్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా కడుపులోని కొవ్వును తగ్గించుటలో కీలకపాత్రను పోషిస్తుంది. శరీరంలోని విషతుల్య పదార్ధాలను బయటకి పంపడం , తద్వారా శరీరంలో రోగనిరోధక స్థాయిలను పెంచడంలో, మరియు హార్మోన్ల నియంత్రణలో ఎంతో సహాయం చేస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో ఎంతగానో దోహదం చేసే ఈ నిమ్మ మార్కెట్లో తక్కువ ఖరీదుకే లభిస్తుంది.

ఖాళీ కడుపుతోనే నిమ్మరసం ఎందుకు తీసుకోవాలి?

ముందు చెప్పినట్లు, నిమ్మలోని పోషకాలు మరియు లక్షణాలు, జీర్ణక్రియలను పెంచడంలో, క్రొవ్వును కరిగించుటలో, మరియు కాలేయం సరిగ్గా పనిచేయడంలో సహాయం చేస్తాయి.

ఉదయాన్నే, ఏ రకమైన ఆహారాన్ని తీసుకోకుండా కేవలం వేడి నీళ్ళతో నిమ్మరసం (మంచి ఫలితాలకై అల్లం, తేనె కూడా కలిపి తీసుకోవచ్చు) తీసుకోవడం మూలంగా కాలేయంలోని విషతుల్య పదార్ధాలు తొలగించబడి, కాలేయంపై ఒత్తిడి లేకుండా చూస్తుంది. తద్వారా రోజంతా కాలేయం అద్భుతంగా పని చేసేలా దోహదం చేస్తుంది. క్రమంగా జీవక్రియలు మెరుగుపడి, అధికబరువు కోల్పోవుటలో, క్రొవ్వు తగ్గుటలో సహాయం చేస్తుంది.

మరియు వేడి నీళ్ళు తీసుకోవడం కూడా బరువు తగ్గించుటలో ఇక్కడ ప్రధానమైనదిగా చెప్పబడింది, జీర్ణక్రియలు వేగవంతంగా పనిచేయుటకు , రోగ నిరోధక శక్తి పెరుగుటకు, శరీరo లో PH స్థాయిల నియంత్రణకు , కాలేయంలోని వ్యర్ధాల తొలగింపునకు కూడా వేడి నీళ్ళు ఎంతో సహాయo చేస్తాయి.

Heres One Of The Most Effective Ways To Lose Belly Fat

ఖాళీ కడుపుతో వేడి నీళ్ళలో నిమ్మ రసం కలిపి తీసుకోవడం మూలంగా జీవక్రియలు మెరుగుపడుతాయి. మరియు ఇందులో ఉన్న పెక్టిన్ ఫైబర్ ఆకలి కానట్లుగా చేసి, ఎక్కువ ఆహారం వైపుకు మొగ్గు చూపకుండా చేయడంలో సహాయం చేస్తుంది. క్రమంగా అధికబరువు తగ్గడంలో, మరియు బెల్లీ నియంత్రణలో తోడ్పాటు అందిస్తుంది.

Read more about: diet and fitness health
English summary

Here's One Of The Most Effective Ways To Lose Belly Fat

Belly fat can lead to numerous ailments like diabetes, cancer, heart ailments, dementia, sexual dysfunction, etc. Apart from providing vitamin C in abundance, lemon juice helps in cutting abdominal fat effectively. Lemon helps in inducing weight loss and also enhances the functioning of liver as well as the digestive system.