Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
Rajini Birthday : సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికీ చురుకుగా ఉండేందుకు గల కారణాలేంటో తెలుసా...
తమిళ ప్రజలకు తలైవా ఆయన… కానీ దేశం మొత్తానికి మాత్రం ఓ సూపర్ స్టార్. రజనీకాంత్ దేశం మొత్తానికి సూపర్ స్టార్. బస్ కండక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టి సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్నారు.
తమిళ ప్రజలకు తలైవా ఆయన... కానీ దేశం మొత్తానికి మాత్రం ఓ సూపర్ స్టార్. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమానులు మన దగ్గర ఇతర ఏ సినీ నటులకూ లేరేమో..! ఆయన సినిమా వస్తుందంటే చాలు... అప్పుడు ఉండే హడావిడి అంతా ఇంతా కాదు.

సినిమా రిలీజైన రోజైతే అభిమానులకు ఇక పండగే. మరి ఈరోజు తలైవా బర్త్ డే. రజనీకాంత్ ఏడు పదుల వయసు దాటి 71వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తన ఫిట్ నెస్ రహస్యాలేంటో తెలుసుకోండి...

దేశం మొత్తానికి సూపర్ స్టార్
రజనీకాంత్ దేశం మొత్తానికి సూపర్ స్టార్. బస్ కండక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టి సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్నారు. ఈ వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ.. తన స్టైల్ తో అందరిని మెస్మరైజ్ చేస్తున్నాడు రజినీ. అంతటి అభిమానం చూరగొన్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నటించిన కాలా మూవీ త్వరలో రిలీజ్ కానుంది.

చూడడానికి అసలు అలా కనిపించరు
అరవై ఏళ్ల పైబడి ఉన్న రజనీకాంత్ చూడడానికి అసలు అలా కనిపించరు. ఆయన సినిమాలోనే కాదు నిజజీవితంలోనూ యువకులలాగే ఉత్సాహంగా ఉంటారు. అందుకు ఆయన కఠిన దినచర్యే కారణం. మరోవైపు అత్యంత శ్రద్ధతో కూడిన ఆహారపు అలవాట్లు. ఆయన్ను ఇంకా నవయువకునిలాగే ఉంచుతున్నాయి.

యువకుడిలా ఉత్తేజంగా
సూపర్‌స్టార్ రజనీకాంత్ చూసేందుకు వయస్సు మీరి కనబడుతున్నా ఆయన మాత్రం ఇంకా యువకుడిలా ఉత్తేజంగా ఉంటారు. సినిమాల్లో స్టంట్స్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి డూప్ లేకుండానే చేస్తారనే పేరుంది. అయితే ఆయన ఇప్పటికీ అలా ఉత్సాహంగా ఉండడానికి కారణం ఆయన దినచర్యే.

తీసుకోవడం మానేశారు
రజనీ 40 ఏళ్ల వయస్సు నుంచే చక్కెర, అన్నం, పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలను తీసుకోవడం మానేశారు. ఈ ఆహార నియమావళిని ఆయన కచ్చితంగా పాటిస్తున్నారు.
కేవలం ఆహారంలోనే కాదు, వ్యాయామంలోనూ ఆయన కచ్చితంగా శ్రద్ధను కనబరుస్తారు. నిత్యం రెండు పూటలా యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేయడం ఆయనకు అలవాటు.

ముందుగా వాకింగ్
ఉదయం 5 గంటలకే నిద్ర లేచే ఆయన ముందుగా వాకింగ్ చేస్తారు. అనంతరం కొంత సేపు జాగింగ్ చేసి యోగా చేస్తారు. మళ్లీ సాయంత్రం వాకింగ్ కంటిన్యూ అవుతుంది. అనంతరం కొంత సేపు ధ్యానం. దీంతో ఆయన ఒత్తిడి నుంచి బయట పడతారట. ఈ క్రమంలోనే ఆయన తన ప్రతి సినిమా విడుదల అవగానే కొన్ని రోజుల పాటు ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి వస్తుంటారు. దీంతో ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతతను పొందుతారు ఆయన.

మొలకెత్తిన విత్తనాలు
మొలకెత్తిన విత్తనాలు...వంటి కొన్ని ప్రత్యేకమైన పదార్ధాలే తీసుకుంటారట. ఇదీ తలైవా, సూపర్ స్టార్ రజనీ ఉత్తేజం వెనుక ఉన్న అసలు విషయం.
సో ఆయన స్టైల్ ని ఆయన డైలాగ్స్ ని చూసి కాపీ కొట్టిన ఓ అభిమానులు..కాలా ఫిట్ నెస్ మంత్రాని కూడా కాపీ కొట్టేయండి. అప్పుడు ఆరోగ్యం ఆనందం రెండూ మీ వెంటే.

నలభై సంవత్సరాలు పైబడిన తర్వాత
గతంలో ఒక మూవీ ఆడియో విడుదల కార్యక్రమంలో తాను యంగ్ గా కనపడడానికి గల రహస్యాన్ని రజనీ స్వయంగా చెప్పారు. షుగర్, రైస్, మిల్క్, కర్డ్, ఘీ వంటి వాటికి రజనీ దూరంగా వుంటారట. ముఖ్యంగా నలభై సంవత్సరాలు పైబడిన తర్వాత వీటిని దూరం పెట్టిన వారెవరైనా సరే యంగ్ లుక్ సొంతం చేసుకోవచ్చని, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు తాను నిద్రలేస్తానని, గంట పాటు జాగింగ్ చేస్తానని చెప్పారు.

అందుకే యంగ్ గా కనపడతాను
అంతేకాడా, రోజూ మెడిటేషన్ చేయడం, సాయంత్రాల్లో కూడా వాకింగ్ చేయడం, దీంతో పాటు, యోగా కూడా ప్రాక్టీసు చేస్తున్నానని నాడు రజనీ చెప్పారు. యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, రాత్రి నిద్ర బాగా పట్టేందుకు యోగా ఉపకరిస్తుందని.. ఈ ఆరోగ్య సూత్రాలనే తాను పాటిస్తుంటానని, అందుకే, యంగ్ గా కనపడతానని రజనీ అప్పట్లో చెప్పారు. ఆయన ఇప్పటికీ ఆ సూత్రాలే పాటిస్తున్నారు.

సేవా గుణం
రజనీలో ఉండే సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తూత్తుకుడి కాల్పుల మృతుల కుటుంబాలను తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్పారు. తూత్తుకుడి ఘటన ఓ గుణపాఠం వంటిదని తెలిపారు.

జూన్ 7వతేదీన రజనీకాంత్ కాలా
ఈ సంఘటనపై తాను మరేమీ మాట్లాడనని చెప్పారు. అయితే ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుందని చెప్పారు. నిరసనకారులపై కాల్పులు జరపడం చాలా పెద్ద తప్పు అని తెలిపారు. పోలీసుల కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు. కాగా జూన్ 7వతేదీన రజనీకాంత్ కాలా చిత్రం విడుదల కానుంది.



Click it and Unblock the Notifications