Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
Importance Of Shoes: మార్నింగ్ వాక్‌కు షూస్ అంత ముఖ్యమా?
మీరు కొత్తగా వాకింగ్‌కు వెళ్లాలనుకుంటే.. షూ ధరించాలా, వేసుకోకపోయినా పర్లేదా.. వేసుకుంటే ఎలాంటి షూ ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Importance Of Shoes: నడక.. చాలా ఉత్తమమైన వ్యాయామం. ఎవరైనా నడవొచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా సులభంగా నడవొచ్చు. ఒక గంట సేపు నడవడం వల్ల 150 కేలరీలు బర్న్ చేయవచ్చు.

వారానికి కనీసం 5 రోజులు వేగంగా నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే నడకకు వెళ్లే ముందు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నడక వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. సౌకర్యవంతమైన దుస్తులు, మోకాళ్ల నొప్పులు రాకుండా మంచి బూట్ల ధరించడం ముఖ్యమని చెబుతున్నారు.
మీరు కొత్తగా వాకింగ్‌కు వెళ్లాలనుకుంటే.. షూ ధరించాలా, వేసుకోకపోయినా పర్లేదా.. వేసుకుంటే ఎలాంటి షూ ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎలాంటి షూ కొనాలంటే..
షూ కొనేముందు చాలా మంది చూసేది వాటి డిజైన్. ఎలాంటి రంగులో ఉన్నాయనే చాలా మంది చూస్తారు. అయితే వాకింగ్‌కు వెళ్లే వారు షూ డిజైన్ కంటే.. అవెంత సౌకర్యంగా ఉన్నాయి.. మీ బరువుకు సరిపోయేవి ఏవి.. ఎంత మన్నికగా ఉన్నాయి.. వాటి కూషన్ సరిగ్గా ఉందా లేదా అనే విషయాలను చూసుకోవాలి.

2. షూస్ ఎంత బరువు ఉండాలి?
రన్నింగ్ షూస్ సాధారణంగా 184 గ్రాముల నుండి 368 గ్రాముల మధ్య బరువు ఉంటాయని ప్రముఖ షూ తయారీ కంపెనీ చెప్పింది. తేలికపాటి షూస్ అంటే 227 గ్రాముల కంటే తక్కువ ఉండాలి.
మిడ్‌సోల్ బరువు బూడ్ల బరువును ప్రభావితం చేస్తుంది. మిడ్‌సోల్ సాధారణ రన్నింగ్ షూ బరువులో 75 శాతం వరకు ఉంటుంది. మిడ్‌సోల్్ అనేది అవుట్‌సోల్‌కు జోడించబడిన రన్నింగ్ షూలో భాగం. కుషనింగ్, షాక్ శోషణను నిర్దేశిస్తుంది.

3. మంచి బూట్లతో గాయాలయ్యే అవకాశాలు తక్కువ
సరైన బూట్లు ధరించడం వల్ల పాదాలు, మోకాళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. బ్రిస్క్ వాకింగ్ చేసే వాళ్లు సరైన షూస్ ఎంపిక చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. వదులుగా, సరిగ్గా సరిపోని షూస్ వల్ల పాదాలకు మంచి రక్షణ ఉండదు. మడమలు, చీలమండలు, మోకాలు, హిప్స్, దిగువ వెన్నుపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది.

4. కాలి వేళ్ల వద్ద ఖాళీ స్థలం
షూస్ ధరించినప్పుడు కాలి వేళ్లు కదిలించడానికి తగిన స్థలం ఉండాలి. ఇలా ఖాళీ స్థలం ఉండటం వల్ల నడుస్తున్నప్పుడు, పరిగెత్తటప్పుడు బొటనవేలు బూట్ల అరికాలిపై సరైన పట్టు ఉంటుంది.

5. శాండల్స్, స్లిప్పర్స్ ధరించి నడవొచ్చా?
మామూలు చెప్పులు వేసుకుని నడవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. నడక మంచిదే, నడక వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అయితే ఆ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందాలన్నా.. నడక వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా మంచి షూస్ ధరించడం ముఖ్యమని చెబుతున్నారు వైద్యులు.
ఫిట్‌నెస్ కోసం నడవాలనుకుంటున్నట్లైతే ముందుగా మంచి జత షూస్ కొనండి. స్లిప్పర్లు, శాండల్స్ ధరించి నడవడం మానుకోండి. బూట్లు కొనుగోలు చేసేటప్పుడు సౌకర్యం, కుషనింగ్, మంచి పట్టు ఉండేవి తీసుకోండి.



Click it and Unblock the Notifications
