Latest Updates
-
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం!
స్థూలకాయం మరియు అధిక బరువు తగ్గడానికి ఆయుర్వేదం సూచించే మార్గాలు ..
స్థూలకాయం మరియు అధిక బరువు తగ్గడానికి ఆయుర్వేదం సూచించే మార్గాలు
అధిక బరువు మరియ స్థూలకాయంతో బాధపడే వారి సంఖ్యరోజు రోజుకు పెరిగిపోతుంది. అందకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామ లేమి, నిద్రలేమి జంక్ ఫుడ్ వినియోగం మరియు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వడం. స్థూలకాయం మరియు అధిక బరువు వల్ల శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది, స్థూలకాయం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సమస్యలు, కాళ్ల నొప్పులు వంటి అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. సాధారణంగా అయితే ప్రజలు అధిక బరువును తగ్గించుకోవడానికి వివిధ మార్గాలను అనుసరించి ఉంటారు. వాటితో ఎలాంటి ప్రయోజనాలు పొందక విస్తుపోయారా? అయితే ఒకసారి ఆయుర్వేద మార్గాలను కూడా అనుసరించండి. ఆయుర్వేద చిట్కాలు కాస్త ఆలస్యం అయినా ఫలితాలు మాత్రం ఎఫెక్టివ్ గా ఉంటాయి. మరి ఆ నివారణా మార్గాలు ఏంటో చూద్దాం:

ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం మన శరీరం గురించి ఏం చెబుతుంది ?
మానవ శరీరంలో మూడు దోషాలు ఉంటాయి. అవి వాతం, పిత్తం, కఫం . ఈ మూడు ప్రధానమైనవి. మన శరీరంలో జీవిక్రియలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతాయి. ఈ మూడు దోషాలు పరిమితంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఎక్కువ అయినా ఊబకాయం మరియు అధిక బరువుతో పాటు అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అలా జరగకూడదంటే దినచర్యలో మంచి పోషకాహారం తీసుకోవాలి.

శరీరం వాతానికి గురి అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
* రోజు మొత్తంలో రెండు లేదా మూడు సార్లు అధిక మొత్తంలో మీరు తినే ఆహారాన్ని 4 లేదా 5 సార్లు తినేటట్లుగా ప్లాన్ చేసుకోండి. తక్కవు పోర్షన్లలో 4 నుండి 5 సార్లు తినడం అలవాటు చేసుకోండి
* ఎక్కువగా ఉడికించి, కాల్చిన, ఆవిరి పట్టించిన ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. పచ్చి ఆహారాలకు దూరం ఉండండి.
* శరీరం వాతానికి గురైనప్పుడు శరీరంలో వేడి పుట్టించే పచ్చిమిర్చి, వంకాయ, మునగకాయ, వంటి ఆహారాలకు దూరంగా ఉండండి
* నిమ్మ, నారింజ, బత్తాయి మరియు పుల్లగా ఉండే సిట్రస్ పండ్లకు దూరంగా ఉండండి
* తృణధాన్యాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఇస్తాయి. అయితే వీటిని పరిమితంగా తీసుకోండి
* ముక్యంగా ధూమపానం, మద్యం, షుగర్ డ్రింక్స్ దూరంగా ఉండండి
* ఇంకా ఫ్రిజ్ లో స్టోర్ చేసినవి , మరీ చల్లగా ఉండే పదార్థాలను తినకుండా ఉండండి.

పిత్త దోషం ఉన్నప్పుడు
* పిత్త దోసం ఉన్నప్పుడు పండ్లు, కూరగాయలను ఎక్కువగా వాడండి. వీటిని సలాడ్ రూపంలో తీసుకోండి
* పిత్త దోషం ఉంటే మాంసాహారాలు ఎక్కువగా తీసుకోకండి. పరిమితంగా తినండి.
* అలాగే రోజు వారి పానీయాల్లో కాఫీ ట, ఆల్కహాల్ కు దూరంగా ఉండా. స్పై సీ ఫుడ్స్ తినకుండా ఉండటమే ఉత్తమం.
* పిత్త దోషం ఉన్నవారికి కాయధాన్యాలు, కాయలు, విత్తనాలు అంత మంచివి కావు
* అలా తినాల్సి వస్తే తృణధాన్యాలు మరియు పప్పులను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి
* పాలు పదార్థాలను ఉపయోగించండి.

కఫ దోషం ఉంటే
* కఫ దోషం ఉంటే , కఫం నివారించే మార్గంలో ఆహారం ముఖ్య పాత్రను పోషిస్తుంది. కాబట్టి ఆహారంను మితంగా తినాలి
* డైరీ ప్రొడక్ట్స్ మరియు ఫ్యాట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి
* ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి
* ఆకుకూరలు మరియు దుంపలు, వేర్లను ఎక్కువగా వాడండి.
* మాంసాహాం ఎక్కువ తినకూడదు.

బరువు తగ్గడానికి ఆయుర్వేదం సూచించే పదార్థాలు:
త్రిఫలం: ఉసిరికాయ, కారక్కాక, మొదలైన వాటితో తయారుచేసే త్రిఫల చూర్ణం బరువు తగ్గడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. త్రిఫల చూర్ణం శరీరంలోని చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు సమతుల్య శరీర బరువును సాధించడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహవ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది.

సోంపు నీళ్లు :
రోజూ నీళ్లు తాగే బదులు సోంపు నీళ్లు తాగండి. ఒక లీటర్ నీటిని వేడి చేసి అందులో సోంపు వేసి ఉడికించి, గోరువెచ్చగా చేసి తాగండి . ఈ నీరు ఆకలిని తగ్గిస్తుంది. జంక్ ఫుడ్ తినాలనే కోరిక ఉండదు, రక్తంలో యూరిక్ యాసిడ్ ను తొలగించి రక్తాన్ని శుభ్రపరిస్తుంది. చెడు కొవ్వును తొలగించి శరీర బరువును తగ్గిస్తుంది.

మెంతులు
మెంతి గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయని మీకు తెలుసా?ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో ఇది ముఖ్యం. ఇందులోని కరిగే గెలాక్టోమన్నన్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఇది మీకు చాలా సేపు ఆకలిగా అనిపించేలా చేస్తుంది. ఇది శరీరం జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. మెంతి గింజలను దోరగా వేయించి పొడి చేసుకోవాలి. మీరు ఖాళీ కడుపుతో కొద్దిగా గోరువెచ్చని నీటిలో మెంతిపొడి తాగవచ్చు. లేదా మెంతి గింజలను నానబెట్టి ఖాళీ కడుపుతో నమలవచ్చు.

జీలకర్ర :
జీలకర్ర జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. కరివేపాకులో అనేక ఔషధగుణాలున్నాయి. ఈ రెండింటి కలయిక బరువు తగ్గడంలో ప్రభావంతంగా సహాయపడుతాయి.

మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి ఈ సాధారణ చిట్కాలను అనుసరించండి
* ఆహారం మితంగా తినాలి
* రాత్రిపూట కొద్దిగా ఆహారం తీసుకోవాలి
* ఉదయాన్నే వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి రోజు ప్రారంభించండి
* రోజూ వ్యాయామం చేయండి
* సరిగ్గా నిద్రపోండి. చాలా తక్కువ లేదా ఎక్కువ నిద్ర మంచిది కాదు.



Click it and Unblock the Notifications