Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
Dates For Weight Loss: ఖర్జూరా ఇలా తింటే బరువు తగ్గడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
బరువు తగ్గడానికి వ్యాయామం, అంతకుమించి డైట్ పాటించడం చాలా చాలా ముఖ్యం. రెండింటిలో ఏ ఒక్కదాంట్లో అయినా మీరు పట్టు విడిస్తే బరువు తగ్గరు. మీ శరీర బరువు తగ్గించాలనుకుంటే ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం.. ఎప్పుడు తింటున్నాం అన
Dates For Weight Loss: బరువు తగ్గడానికి వ్యాయామం, అంతకుమించి డైట్ పాటించడం చాలా చాలా ముఖ్యం. రెండింటిలో ఏ ఒక్కదాంట్లో అయినా మీరు పట్టు విడిస్తే బరువు తగ్గరు. మీ శరీర బరువు తగ్గించాలనుకుంటే ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం.. ఎప్పుడు తింటున్నాం అనే విషయాలపై దృష్టి పెట్టాల్సిందే.

తీసుకునే ఆహార పదార్థాల్లో పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉండేలా, కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఖర్జూరాలు ఈ కోవకు చెందినవే. ఖర్జూరాల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే తక్కువ కేలరీలు ఉంటాయి. ఖర్జూరా తినడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి మంటను తగ్గించడానికి ఖర్జూరాలు సహాయపడతాయి.

ఖర్జూరాలోని పోషకాలు
* పిండి పదార్థాలు: 44% - 88%
* డైటరీ పైబర్: 6.4% - 11.5%
* ప్రోటీన్: 2.3% - 5.6%
* కొవ్వులు: 0.2% - 0.5%
ఇందులో ఐరన్, మెగ్నీషియం,కాపర్, కాల్షియం, సోడియం మరియు శరీరానికి అవసరమైన విటమిన్లు కూడా ఉంటాయి.

బరువు తగ్గడంలో ఖర్జూరాలు:
ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలు పెద్ద ప్రేగుల్లో శోషణ ప్రక్రియను నెమ్మదిస్తాయి. తద్వారా ఎక్కువ సమయం పాటు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఫైబర్స్ జీర్ణక్రియ ప్రక్రియలో, జీవక్రియను మెరుగు పర్చడంలో సహాయపడతాయి. ప్రేగుల్లో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తిలో కూడా సహాయపడతాయి.
ఖర్జూరాలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఉండే అసంతృప్తి కొవ్వు ఆమ్లాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. గాయం, వాపు, అనారోగ్యకరమైన ఆహార పదార్తాల వినియోగం వంటి వివిధ కారణాల వల్ల సంభవిస్తుంది.
బరువు తగ్గించే డైట్‌లో ఉన్నప్పుడు చక్కెర పదార్థాలు తినాలన్న కోరికను నియంత్రించడం అతిపెద్ద సవాలు. ఖర్జూరా అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోకుండా చేస్తుంది.

ఎన్ని ఖర్జూరాలు తీసుకోవాలి
ఖర్జూరాలు మితంగా తీసుకుంటే మాత్రమే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఏదైనా అధిక బరువు పెరగడానికి దారి తీస్తుంది. ప్రతి రోజూ 4 నుండి 5 ఖర్జూరాలు తినండి. ఆకలి బాధ్లను తగ్గించుకోవడానికి ఖర్జూరాలు తీసుకోండి.
ఫ్రూట్ సలాడ్ లేదా డెజర్ట్‌లో తరిగిన ఖర్జూరాలను జోడించుకోవచ్చు. ఒక గ్లాసు వెచ్చని పాలతో తినవచ్చు. పెరుగు, సీతాఫలం, చట్నీ, డిప్స్, కేకులు మొదలైన వాటిలో కూడా ఖర్జూరాలు తినవచ్చు.

ఖర్జూరాతో మరిన్ని ప్రయోజనాలు:
* 100 గ్రాముల ఖర్జూరాల నుండి 144 గ్రాముల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు తక్కువ, ఐరన్, జింక్, పొటాషయం, ఫాస్ఫేట్ ఖనిజాలతో పాటు దీంట్లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది.
* ఖర్జూరా తింటే ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. రుచే కాదు ఆరోగ్యాన్ని పరిరక్షించే పండు ఖర్జూరం.
* ఖర్జూరాలను తరచూ తింటే మలబద్ధకం నుండి దూరం కావొచ్చు.
* ఖర్జూరాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని పరిమితంగా తీసుకుంటే బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
* ఖర్జూరాల్లోని ఖనిజ లవణాల వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే ఆరోగ్యంగా ఉంటాయి.
* ఖర్జూరాలను తరచూ తింటే జీర్ణ సమస్యలు రావు
* ఖర్జూరాల్లోని ఐరన్ కంటెంట్ జుట్టు ఊడకుండా చేస్తుంది.
* ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం పండ్లతో పాటు తీసుకుంటే మలబద్ధకం సమస్య రానే రాదు.
* విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులూ ఖర్జూరాల్లో సమృద్ధిగా ఉంటాయి. వీటిలోని గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌లు తక్షణ శక్తి వస్తుంది.



Click it and Unblock the Notifications
