Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మార్నింగ్ వర్కవుట్సా లేదా ఈవినింగ్ వర్కవుట్సా? రెండింటిలో ఏది బెటరో తెలుసా..?
ప్రతిరోజూ ఉదయాన్నే చేసే వర్కవుట్స్ లో స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం అనేది ఉదయం చేయాల్సిన మొదటి పనిగా పెట్టుకుంటే.. లేదా దానిని మీరు అలవాటు చేసుకుంటే, మీరు మీ ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకోగలుగుతార
ప్రతిరోజూ చాలా మంది వ్యాయామం చేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం అందరి కంటే భిన్నంగా సాయంత్రం వర్కవుట్స్ చేస్తుంటారు. ఎందుకంటే ఇటీవల తమ ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఈ మధ్యన సిక్స్ ప్యాక్ జోరు కాస్త తగ్గినా తమ బాడీని ఫిట్ గా ఉంటే బ్రెయిన్ కూడా ఫిట్ గా ఉంటుందనే అభిప్రాయంతో ఈ మధ్య చాలా మంది జిమ్, ఫిట్ నెస్ సెంటర్ల బాట పడుతున్నారు.

ఇందులో సినీతారలు, సెలబ్రిటీలు ముందుంటున్నారు. అందుకే సెలబ్రిటీ ట్రైనర్లు, సుప్రసిద్ధ బ్రాండ్లను నగరంలో తమ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫిట్ నెస్ ప్రియులను ఆకర్షించడానికి వినూత్నమైన పరికరాలు తీసుకువస్తున్నారు. ఆఫర్లతో ఊదరగొట్టి మెంబర్ షిప్ లను సైతం తీసుకుంటున్నారు.

అయితే కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు వర్కవుట్స్ కు వెళ్లి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే వ్యాయామం చేయడానికి ఉత్తమ సమయం ఎప్పుడో తెలుసుకోవాలి? ఎందుకంటే అది మీ శరీరంపై ఆధారపడి ఉంటుంది. వ్యాయామం చేయడానికి ఉత్తమ సమయం మీ శరీరంలో అనేక ప్రభావాలను కలిగి ఉంటుంది. అయితే ఉదయం మరియు సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల లాభాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను ఫాలో అవ్వండి.

మార్నింగ్ వర్కవుట్..
రాత్రి నిద్రపోయిన తర్వాత, మీ శరీరం చాలా ప్రశాంత స్థితిలో ఉంటుంది. మీ శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. శరీర శక్తిని సక్రమం చేయడం ద్వారా మీ రోజు ప్రారంభించడానికి ఉదయం వ్యాయామం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రోజంతా మీకు ఉత్సాహాన్ని కలిగి ఉండేందుకు సహాయపడుతుంది. దీని వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలేంటో తెలుసుకుందాం.

ఆరోగ్య ప్రయోజనాలు..
ప్రతిరోజూ ఉదయాన్నే చేసే వర్కవుట్స్ లో స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం అనేది ఉదయం చేయాల్సిన మొదటి పనిగా పెట్టుకుంటే.. లేదా దానిని మీరు అలవాటు చేసుకుంటే, మీరు మీ ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకోగలుగుతారు. ఉదయం వ్యాయామం వల్ల మీ శరీరంలో శక్తి స్థాయిలు బాగా పెరుగుతాయి. పగటి పూట శక్తి లోపం అనేది ఉండదు. ఇది మీరు చేసే పనిలో మీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదయం వ్యాయామం చేయడం, ముఖ్యంగా అల్పాహారం ముందు సాయంత్రం వ్యాయామంతో పోలిస్తే కొవ్వును కరిగించడాన్ని బాగా ప్రోత్సహిస్తుంది. ఇదే కాకుండా ఇది ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. మీ జీవక్రియను కూడా బాగా పెంచుతుంది.

బలహీనంగా అనిపించొచ్చు..
చాలా మందికి ఉదయాన్నే లేవడం అనేది అతి పెద్ద సవాల్. మీరు ఉదయం మేల్కొన్నప్పుడు మీకు బలహీనంగా ఉన్నట్లు అనిపించవచ్చు. మీ శక్తి స్థాయిలు కూడా చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే వ్యాయామం చేయడం కష్టమవుతుంది. మన శరీర విధులు ఉదయాన్నే చురుకుగా ఉండవు. ముఖ్యంగా ఊపిరితిత్తులు సరిగా పని చేయవు. అందువల్ల ప్రజలు తరచుగా ఉదయం ఊపిరిపీల్చుకోవడం మరియు వ్యాయామం చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది.

అవి గట్టిపడతాయి...
అంతేకాదు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కీళ్లు మరియు కండరాలు గట్టిపడతాయి. అందువల్ల వ్యాయామం చేసే ముందు ముఖ్యంగా ఉదయం వేడెక్కడం అనేది చాలా ముఖ్యం. వ్యాయామం వల్ల కొవ్వు ఎక్కువగా కరుగుతుంది. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కొన్ని ప్రమాదకర పరిణామాలు సంభవిస్తాయి.

ఈవినింగ్ వర్కవుట్స్..
మీరు రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటే, మీకు ఈవినింగ్ వర్కవుట్స్ చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఉదయం కాకుండా, మీ శరీరం సాయంత్రం చాలా బాగా పని చేస్తుంది. ఇది మీకు ఎక్కువ శక్తిని ఇస్తుంది. కానీ ఫ్లిప్ వైపు మీరు అలసిపోవచ్చు. మీరు రోజంతా పని చేయడం వల్ల మీ శరీరానికి విశ్రాంతి అవసరం కావచ్చు. ఆ సమయంలో వ్యాయామం చేయడం సరైన పని కాదు.

ఈవినింగ్ బెనిఫిట్స్..
ఈవినింగ్స్ వర్కవుట్స్ సమయంలో కీళ్లు మరియు కండరాలపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. కాబట్టి గాయాల ప్రమాదం తగ్గిపోతుంది. ఈవినింట్ టైములో వర్కవుట్ కు మీ బాడీ ఈజీగా సహకరిస్తుంది. కాబట్టి మీకు కావాల్సిన ఫలితాలను పొందడానికి సాయంత్రం సరైన సమయం అవుతుంది. అలసిపోయిన రోజు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీ శరీరం బాగా మెరుగ్గా రిఫ్రెష్ అవుతుంది. మీరు డీప్ గా నిద్రపోయేందుకు సహాయపడుతుంది. సంతృప్తికరమైన వ్యాయామం తరువాత, మీరు బాగా తినవచ్చు. బాగా నిద్రపోవచ్చు.

ఈవినింగ్ వర్కవుట్ ప్రాబ్లమ్స్..
ప్రస్తుత రోజుల్లో చాలా మంది వేర్వేరు ఉద్యోగాలు చేస్తుంటారు. అందుకే ఈవినింగ్ టైమ్ లో ఎక్కువగా విందులు, కుటుంబ వినోదం, స్నేహితులతో చాట్ చేయడం మరియు బహిరంగ ప్రదేశాల్లో సమావేశం వంటి వివిధ కార్యక్రమాలలో మీరు మునిగిపోవచ్చు. ఇవన్నీ వ్యాయామం చేయకుండా ఉండటానికి ఒక కారణం కావచ్చు. అలాగే కొంతమందికి వ్యాయామం చేసే ముందు నిద్రతో సమస్యలు ఉన్నా సాయంత్రం వ్యాయామం అంత ప్రభావవంతంగా అనిపించదు.

ఏది ఉత్తమ సమయం అంటే...
అయితే ఉదయం మరియు సాయంత్రం వర్కవుట్స్ చేయడం వల్ల లాభాలు మరియు నష్టాలు రెండూ ఉన్నాయి. కాబట్టి మీ శరీరానికి ఏ సమయం మంచిది అని మీరు మాత్రమే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీ శరీరం గురించి మీకు మాత్రమే బాగా తెలుసు కాబట్టి.



Click it and Unblock the Notifications