Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
Ranbir Kapoor: బీస్ట్ తరహా బాడీ కోసం రణ్ బీర్ ఏం తిన్నాడు? వర్కవుట్స్ ఏమేం చేశాడు?
బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన 'సంజు' మూవీ తర్వాత రణ్ బీర్ కపూర్ నటిస్తున్న సినిమా 'షంషేరా'. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది ఈ చిత్రం. హిస్టోరికల్ బ్యాక్ గ్రౌండ్ గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. 'షంషేరా' సినిమా ట్రైలర్ లో తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు రణ్ బీర్. ఈ చిత్రంలో తండ్రి షంషేరా పాత్రలో, అలాగే కొడుకు బల్లి పాత్రలోనూ నటిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు ఈ బాలీవుడ్ కండల హీరో. రణ్ బీర్ ఒకే మూవీలో రెండు పాత్రల్లో కనిపించడం ఇదే మొదటి సారి.
యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై లార్జర్ దెన్ లైఫ్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం కోసం రణ్ బీర్ కండల రాయుడిగా మారాడు. బల్క్ అప్ ఫిజిక్ లుక్.. ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ హీరోగా రణ్ బీర్ బాడీ ఇమేజెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.రణ్ బీర్ షంషేరాలో సిక్స్ ప్యాక్ చూపించడానికి బీస్ట్ మోడ్‌లోకి ఎలా వెళ్లాడు.

బీస్ట్ బాడీ కోసం కష్టాలు
షంషేరా చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. మల్హోత్రా రణ్ బీర్ కు ఈ కథను వివరిస్తున్నప్పుడు బల్లి పాత్ర గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాల గురించి చెప్పాడు. షంషేరా 1800 సంవత్సరం నాటి సినిమా. బల్లి పాత్ర క్రూరమైన జైలులో పుట్టి పెరుగుతాడు. ఎంతో కష్టం అనుభవిస్తాడు. అలాంటి వ్యక్తి బాడీ కావాలని రణ్ బీర్ ను డైరెక్టర్ కరణ్ మల్హోత్రా అడిగాడు. బీచ్ బాడీ కాకుండా, కండలు తిరిగిన వర్కర్ బాడీ ఉండాలని గట్టిగా చెప్పాడు డైరెక్టర్. కథ నచ్చితే ఎలాంటి కష్టానికైనా వెనకాడని రణ్ బీర్.. దీనిని ఓ ఛాలెంజ్ గా తీసుకున్నాడు. దాని కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేసినట్లు స్వయంగా రణ్ బీర్ చెప్పాడు.

బరువు తగ్గొచ్చు.. కండలే కష్టం
అయితే తాను సన్నగా ఉంటాడు కాబట్టి షంషేరా పాత్ర కోసం బరువు పెరిగానని చెప్పాడు రణ్ బీర్. అలాగే బల్లి పాత్ర కోసం బరువు తగ్గడంతో పాటు కండలు తిరిగిన బాడీ కావాలి. బరువు తగ్గడం చాలా సులభమేనని, కానీ కండలు తెచ్చుకోవడమే కష్టమని చెబుతున్నాడు రణ్ బీర్.

రణ్ బీర్ ఎలా కష్టపడ్డాడు
షంషేరా చిత్రం కోసం కసరత్తులు చేసే సమయంలో రణ్ బీర్ రోజుకు ఐదు సార్లు తినేవాడు. భోజనంలో అధిక ప్రోటీన్, అలాగే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేట్లు జాగ్రత్త పడే వారు. కఠినమైన శిక్షణ తీసుకుంటూ డైట్ ను పాటించేవాడు రణ్ బీర్. వారానికి ఒకసారి మాత్రం ఇష్టమైన ఫుడ్ లాగించేవాడు.వారానికి ఐదు రోజులు కఠినమైన శిక్షణ ఉండేది. గంట నిడివితో వర్కవుట్ సెషన్ ఉండేది. ప్రతి సెషన్ తర్వాత, కఠినమైన కార్డియో సెషన్ ఉంటుందని రణ్ బీర్ పర్సనల్ ట్రైనర్ కునాల్ గిర్ చెబుతున్నాడు.

సంజయ్ దత్ తో స్క్రీన్ షేరింగ్
బ్లాక్ బస్టర్ హిట్ 'సంజు' సినిమా తర్వాత రణ్ బీర్ సుదీర్ఘ గ్యాప్ తీసుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. షంషేరా సినిమాలో శుద్ధ్ సింగ్ అనే పాత్రలో కనిపించనున్నాడు సంజయ్ దత్. క్రూరమైన, కనికరం లేని, శక్తిశాలిగా కనిపించనున్నాడు సంజు. ఈ సినిమాపై సంజయ్ దత్, రణ్ బీర్ కపూర్ పోటీ పడటం ప్రేక్షకులను వీనుల విందు కానుంది. వీరిద్దరి పోటీ ఈ ఏడాది క్లాష్ ఆఫ్ ది ఇయర్ కానుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
షంషేరా స్టోరీ
షంషేరా సినిమా కోసం కాజా నగరాన్ని సృష్టించింది చిత్రబృందం. ఈ కాజా నగరంలో నుంచే కథ మొదలు అవుతుంది. ఇక్కడ అధికార జనరల్ శుద్ధ్ సింగ్.. యోధులకు చెందిన కొంత మందిని ఖైదీలుగా, బానిసలుగా మార్చి హింసిస్తుంటాడు. ఇలా బానిసగా ఉన్న ఓ వ్యక్తి నాయకుడిగా ఎదిగి, తిరగబడే కథే షంషేరా. ఆ వ్యక్తి తన వారి స్వేచ్ఛ, గౌరవం కోసం పోరాడతాడు. అతని పేరు షంషేరా.
1800 సంవత్సరంలో భారత దేశంలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా షంషేరా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ కోసం షంషేరా పాత్రలో నటించాడు రణ్ బీర్ కపూర్.గతంలో ఎన్నడూ చేయని విభిన్న పాత్రలో కనిపించనున్నాడీ బాలీవుడ్ హీరో. తిరుగుబాటు, ఉద్యమం, యుద్ధం అంశాలు ఉన్న చిత్రంలో రణ్ బీర్, సంజయ్ దత్ పోరును వీక్షించవచ్చు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. జులై 22, 2022న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 'షంషేరా' విడుదల కానుంది. సంజు లాంటి సూపర్ హిట్ తర్వాత రణ్ బీర్ నుండి వస్తున్న చిత్రం కావడం.. అందులోనూ హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ గా సినిమా తెరకెక్కడంతో షంషేరాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమాలో రణ్ బీర్ నటన, దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఎలా ఉండనుందో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.



Click it and Unblock the Notifications











