Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
‘పుష్ప’ పోరికి అవంటే అస్సలు నచ్చవట...! కానీ ఓసారి టేస్ట్ చేసేసిందట...!
తెలుగు, కన్నడ చిత్రాలతో బిజీగా మారిపోయిన రష్మీక మందాన తన హెల్త్ పై చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టిందట. షూటింగ్ ముగిశాక లేదా షూటింగుకు ముందు కచ్చితంగా జిమ్ కు వెళ్లి వర్కవుట్స్ చేస్తోందట.
రష్మీక మందాన ఒకప్పుడు మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకునేదంట.. అయితే ఈ కన్నడ భామ సినిమాల కోసం తనకు ఎంతగానో ఇష్టమైన మాంసాహారాన్ని వదిలేసుకుందంట.

అంతేకాదు ప్రస్తుతం శాఖాహారిగా మారిందట. ఒకప్పుడు కూరగాయలు, ఆకుకూరలు అంటే అస్యహించుకునే ఈ అందాల భామ ప్రస్తుతం వాటిని తన డైట్ లో చేర్చుకుందట. మాంసహార ప్రియురాలు అయిన రష్మీక మందాన నెమ్మదిగా శాఖాహారిగా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ఇంటర్య్యూలో తెలిపింది. ఇదంతా తన ఆరోగ్యం కోసమే అని తెలిపింది.

ప్రతిరోజూ లీటరు నీరు..
రష్మీక మందాన తన డైట్ లో భాగంగా ప్రతిరోజూ ఓ లీటరు వాటర్ కచ్చితంగా తాగాలని రిజల్యూషన్ తీసుకుందట. అంతేకాదు ఆమెకు అస్సలు ఇష్టం లేని బంగాళదుంపలు, టమోటాలను కూడా మెల్లగా తీసుకోవడం ప్రారంభించిందట.

చిలకడదుంపలకు ప్రాధాన్యత..
రష్మీక మందాన తనకు నచ్చని కూరగాయలను పక్కనబెట్టి.. నచ్చిన వాటికి తొలి ప్రాధాన్యత ఇస్తోందట. ఇందులో భాగంగా చిలకడ దుంపలకు తొలి ప్రాధాన్యత ఇస్తోందట.

హెల్త్ పై ఫోకస్..
తెలుగు, కన్నడ చిత్రాలతో బిజీగా మారిపోయిన రష్మీక మందాన తన హెల్త్ పై చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టిందట. షూటింగ్ ముగిశాక లేదా షూటింగుకు ముందు కచ్చితంగా జిమ్ కు వెళ్లి వర్కవుట్స్ చేస్తోందట. ఇంతకుముందు సాయంత్రం వేళ ఎక్కువగా వర్కవుట్లు చేసేదట. అయితే ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కారణంగా సాయంకాలం సమయంలో వర్కవుట్స్ తగ్గించిందట.

వర్కవుట్స్ పూర్తయ్యాక..
వర్కవుట్స్ పూర్తయిన వెంటనే కోడిగుడ్లను లేదా కోడిగుడ్లతో తయారైన ఆహారాన్ని తీసుకునేదట. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకోవాలని చెబుతోంది ఈ కన్నడ భామ. అంతేకాదు ఆరోగ్యమే మహాభాగ్యం అని.. ఎవరికైనా అదే శ్రీరామ రక్ష అని ఉచిత సలహా కూడా ఇచ్చేస్తోంది ఈ ‘భీష్మ‘ కథానాయిక.

పొగ త్రాగేవారంటే..
రష్మీక మందాన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా తనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ముఖ్యంగా సిగరేట్ (పొగ త్రాగడం) తాగే వ్యక్తులంటే ఈ కన్నడ భామ అస్సలు ఇష్టపడదట. అంతేకాదు ‘‘సిగరేట్ తాగే వారు తన చుట్టూ ఉండటాన్ని కూడా నేను తట్టుకోలేను‘‘ అని చెబుతుంది. ఎందుకంటే ఈ భామ ఆ వాసనను అస్సలు భరించలేదట.

ఆల్కహాల్ మితంగా తీసుకుంటే..
అయితే ఈ భామకు అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకునేవాళ్లు నచ్చుతారట. అయితే ఆల్కహాలిజం(ఎక్కువగా తాగడం) వంటివి చేస్తే అస్సలు నచ్చదట. ఎందుకంటే ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే కలిగి అనర్థాలేంటో.. ఆరోగ్యం ఏమవుతుందో తనకు బాగా అవగాహన ఉన్నట్టు చెబుతోంది రష్మీక మందాన.

కుక్క బిస్కెట్లను కూడా...
రష్మీక మందాన డైట్ లో భాగంగా ఓ సారి కుక్కబిస్కెట్లను కూడా తినిందని హీరో నితిని ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ విషయాన్ని రష్మీక మందాన కూడా స్వయంగా ఒప్పుకుంది. తను ఒకసారి కుక్క బిస్కెట్లను రుచి చూసిందట. అంతేకాదు అవి ఎలా ఉన్నాయో కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరించింది.



Click it and Unblock the Notifications
