Latest Updates
-
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు!
Virat Kohli Birthday : కింగ్ కోహ్లీ చేసే ఈ వర్కవుట్లతో మీ బాడీని ఎల్లప్పుడూ ఫిట్ గా ఉంచుకోవచ్చు...
టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బర్త్ సందర్భంగా, అతని డైట్ అండ్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు. ఈ ప్లేయర్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తాను శారీరకంగా బలంగా ఉండేందుకు అను నిత్యం అనేక వర్కవుట్లు చేస్తుంటాడు. అందుకే మూడు పదుల వయసు దాటినా నేటికీ పర్ఫెక్ట్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. టీమిండియాను మూడు ఫార్మాట్లలో విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఎందుకంటే కోహ్లీ క్రికెట్ ఆడే సమయంలో అయినా.. ఇతర సమయంలో అయినా ప్రతిరోజూ ప్రాక్టీస్ మాత్రం చేస్తూనే ఉంటాడు.

అందుకే తను ఫిట్ నెస్ విషయంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటూ యువ క్రికెటర్లతో పాటు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో నవంబర్ 5వ తేదీన కోహ్లీ 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ప్రతి మ్యాచ్ లోనూ దాదాపు హాఫ్ సెంచరీ లేదా సెంచరీ కొట్టే కింగ్ కొహ్లీ వయసు పెరుగుతున్నా కూడా అంత ఫిట్ గా ఎలా ఉంటాడు.. మాంసాహారం కూడా మానేసిన ఈ క్రికెటర్ బంతిని బలంగా ఎలా బాదుతాడనే అనుమానం చాలా మందికి వచ్చింది.

తన బాడీ ఫిట్ నెస్ కోసం విరాట్ కోహ్లీ గంటల తరబడి జిమ్ లో గడుపుతాడా? ప్రతిరోజూ కఠినమైన వర్కవుట్లను చేస్తాడా? లేదా ఆహారం విషయంలో ఏవైనా జాగ్రత్తలు పాటిస్తాడా అనే ప్రశ్నలన్నింటికీ విరాట్ కోహ్లీనే ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మీరు కూడా విరాట్ కోహ్లీలా ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండాలంటే.. తను చేసే వర్కవుట్లు, డైట్ అండ్ ఫిట్ నెస్ సీక్రెట్స్ తెలుసుకోండి... మీరు కూడా ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండండి.

ఫిట్ నెస్ ఐకాన్..
ప్రపంచవ్యాప్తంగా ఫిట్ నెస్ ఐకాన్ అయిన విరాట్ కోహ్లీ మూడు పదుల వయసు దాటినా తీవ్రమైన వర్కౌట్లు చేస్తున్నాడు. ఎందుకంటే బరువు తగ్గడం.. వెయిట్ బ్యాలెన్స్ చేయడం అనేది ఒక్కరోజులో జరిగే పని కాదు. అందుకే తక్కువ ఆహారం, మంచి కొవ్వు, ఎక్కువ ఇంటెన్సిటీ కార్డియో మరియు స్థిరమైన డైట్ పాటించడం వల్లే తను పూర్తి ఫిట్ మారాడు.

బేసిక్స్ తో ప్రారంభం..
మీరు కూడా కోహ్లీలా మంచిగా ఫిట్ గా కనిపించాలంటే.. ముందుగా బేసిక్స్ తో ప్రారంభించడం మంచిది. ముఖ్యంగా మీరు బరువు తగ్గేందుకు మీ వ్యాయామంలో రన్నింగ్ ను చేర్చడం చాలా ముఖ్యం. రెగ్యులర్ గా రన్నింగ్ చేయడం వల్ల మీకు బలమైన కండరాలు తయారవుతాయి. ఇది మీరు బరువు సులభంగా తగ్గేందుకు దోహదపడుతుంది. ట్రెడ్ మిల్ పై పరుగెత్తడం వల్ల ఒక గంటలో 705 నుండి 865 కేలరీలు ఖర్చవుతాయి. దీని వల్ల మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరు రోజంతా చురుగ్గా ఉంటారు.

పుష్ అప్స్..
ఫిట్ నెస్ విషయంలో విరాట్ కోహ్లీ మిగతా ఆటగాళ్లందరికీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఢిల్లీలో జన్మించిన కింగ్ కెప్టెన్ రన్నింగ్ తర్వాత పుష్ అప్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీని వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు మీ బాడీని మరింత బలంగా మారుతుంది. దీన్ని రెగ్యులర్ గా చేయడం వల్ల ఏకకాలంలో మీ చేతులు, భుజాలు, ఛాతీ, కోర్ కండరాలు మరియు వీపును బలంగా మారుస్తుంది.

స్విమ్మింగ్ చేయడం..
కేవలం కొన్ని వారాల్లోనే మీరు బరువు తగ్గేందుకు సహాయపడే వ్యాయామంలో స్విమ్మింగ్ ఒకటి. రన్నింగ్ లేదా జాగింగ్ లా కాకుండా మీ బొడ్డు చుట్టూ కొవ్వు తగ్గేందుకు నీటి ఆధారిత వ్యాయామాలు చాలా ఉత్తమం. ఎందుకంటే స్విమ్మింగ్ చేయడం వల్ల మీ కండరాలకు ఎక్కువ పని పెరుగుతుంది. స్విమ్మింగ్ లో కేవలం 30 నిమిషాల బ్రెస్ట్ స్ట్రోక్ వల్ల దాదాపు 367 కేలరీలు బర్న్ అవుతాయి. ఫ్రీ స్టైల్ లో ఈత కొట్టడం వల్ల దాదాపు 404 కేలరీలు ఖర్చవుతాయి. అయితే రోటీన్ గా చేసే వాటిని మీరు విసుగు చెందితే.. మిమ్మల్ని మానసికంగా మంచి స్థితిలో ఉంచే అనేక స్ట్రోకులు కూడా ఉన్నాయి.

హెవీ వెయిట్ లిఫ్టులు..
మీరు కూడా విరాట్ కోహ్లీలా మంచి శారీర ధారుడ్యం కావాలని కోరుకుంటే.. విరాట్ మాదిరిగా హెవీ వెయిట్ లిఫ్టులను ట్రై చేయండి. అయితే ఇందుకోసం జిమ్ కోచ్ లేదా ట్రైనర్ సహాయం తీసుకోవడం మాత్రం మరచిపోవద్దు. ఇలా చేయడం వల్ల మీరు కేవలం కొన్ని రోజుల్లోనే కోహ్లీలాంటి ఫిట్ బాడీని పొందుతారు. టోన్డ్ కాళ్లను సాధిస్తారు. విరాట్ చెప్పినట్టుగా ఇందుకోసం ‘కఠినమైన పనికి షార్ట్ కట్ లేవు' వెయిట్ ట్రైనింగుకు నిరంతర ప్రయత్నం మరియు ఓపిక ఉంటే చాలు. మీరు మంచి బాడీ షేప్ పొందడానికి.. లైట్ వెయిట్ లిఫ్టింగుతో పోలిస్తే.. వారానికి రెండుసార్లు హెవీ వెయిట్ ట్రైనింగ్ సెషన్ నుండి మెరుగైన ఫలితాలను పొందొచ్చు. మీరు రోజూ 20 నుండి 30 నిమిషాల పాటు హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. దీని వల్ల మీ బాడీలో అద్భుతమైన పరివర్తన వస్తుంది.

కోహ్లీ డైట్ సీక్రెట్స్..
ప్రతిరోజూ జిమ్ లోనే దాదాపు 4 గంటలకు పైగా గడిపే కోహ్లీ మైదానంలో చురుగ్గా ఉండేందుకు తన డైట్ పైనా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాడట. అందులో ఉదయం తీసుకునే ఆహారంలో కోడిగుడ్డు కచ్చితంగా ఉండాలట. ప్రతిరోజూ మూడు కోడిగుడ్లను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటారట. దీంతో పాటు ఆకుకూరలు, బ్లాక్ పెప్పర్, వెన్నను క్రమం తప్పకుండా తీసుకుంటాడట. ఆ తర్వాత బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయను రెగ్యులర్ గా తీసుకుంటాడట. చివరగా గ్రీన్ టీతో తన టిఫిన్ ను ముగిస్తాడట.

ఉడికించిన కూరగాయలు..
విరాట్ కోహ్లీ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ మాత్రం లైట్ గా తీసుకుంటాడట. మధ్యాహ్నం లంచ్ సమయంలో ఉడికించిన బంగాళదుంపలు, పాలకూర, ఇతర కూరగాయాలను ఎక్కువగా తీసుకుంటాడట. డిన్నర్ ను మాత్రం డాక్టర్ల సలహా మేరకే స్వీకరిస్తాడట.

బాడీ రీఛార్జ్ కోసం..
విరాట్ కోహ్లీ వారంలో మొత్తం 5 రోజుల పాటు వర్కవుట్లు చేస్తే... రెండు రోజులు మాత్రం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాడట. వర్కవుట్ల తర్వాత రెస్ట్ అనేది చాలా అవసరమని, వర్కవుట్ల తర్వాత విశ్రాంతి తీసుకుంటేనే బాడీ రీచార్జ్ అవుతుందని.. ఈ విషయాన్ని మరచిపోవద్దని చెప్పాడు.
నవంబర్ 5వ తేదీన కోహ్లీ 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఫిట్ నెస్ ఐకాన్ అయిన విరాట్ కోహ్లీ మూడు పదుల వయసు దాటినా తీవ్రమైన వర్కౌట్లు చేస్తున్నాడు. ఎందుకంటే బరువు తగ్గడం.. వెయిట్ బ్యాలెన్స్ చేయడం అనేది ఒక్కరోజులో జరిగే పని కాదు. అందుకే తక్కువ ఆహారం, మంచి కొవ్వు, ఎక్కువ ఇంటెన్సిటీ కార్డియో మరియు స్థిరమైన డైట్ పాటించడం వల్లే తను పూర్తి ఫిట్ మారాడు.



Click it and Unblock the Notifications